అంబికా కృష్ణ - మాగంటి బాబు
ఏలూరు: ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు టీడీపీ నేతలు మాగంటి బాబు, అంబికా కృష్ణ, బడేటి బుజ్జిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా వారు పేరయ్యకోడేరులో సభ నిర్వహించారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో వీరిని పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. ఈసీ అనుమతి లేకుండా వారు ఎన్నికల సభ నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు.