చంద్రబాబు సమక్షంలోనే బయటపడ్డ విభేదాలు
నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జీ, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు, లోక్ సభ సభ్యుడు మాగంటి బాబు మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే వారిమధ్య విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. నూజివీడులో జరిగిన వనం-మనం కార్యక్రమం సందర్భంగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు, మాగంటి బాబు వర్గాల మధ్య శుక్రవారం ఘర్షణ జరిగింది.
ముద్రబోయిన వర్గాన్ని స్టేజ్ మీదకు పిలవడంపై మాగంటి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మాగంటి బాబు అనుచరులు స్టేజ్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ...మాగంటి బాబు వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ముద్రబోయిన, మాగంటిల మధ్య వైరం ఉంది. పలు సందర్భాల్లో వీరిద్దరూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్న విషయం తెలిసిందే.