muddaraboina venkateswara rao
-
మోసకారి బాబూ మీకో దండం
సాక్షి ప్రతినిధి ఏలూరు/నూజివీడు: తెలుగు దేశం పార్టీకి, ఆ పార్టీ నూజివీడు నియోజక వర్గ ఇన్చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ప్రకటించారు. నూజి వీడులోని తన కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటోతో కూడిన ఫ్లెక్సీని మంగళవారం ముద్దరబోయిన వెంకటేశ్వరరావు స్వయంగా తొలగించారు. అనంతరం ఆయన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో పదేళ్ల పాటు పనిచేసి టీడీపీని పటిష్టంగా తయారు చేస్తే ఇప్పుడు చంద్రబాబుకు తాను పనికిరాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో ఎవరూ లేకపోవడంతో తాను అడగకుండానే యనమల రామకృష్ణుడితో కబురు చేసి నూజివీడు టికెట్ ఇచ్చారని, ఇప్పుడు టికెట్ నిరాకరించడంపై కారణమేమిటో అడుగుతుంటే చంద్రబాబు వద్ద సమాధానమే లేదని చెప్పారు. తనను పదేళ్ల పాటు వాడుకొని బలిపశువును చేశారని ధ్వజమెత్తారు. ఉరిశిక్ష వేసేటప్పుడు కూడా ఆఖరి కోరిక ఏమిటని జడ్జి అడుగుతారని, టీడీపీలో మాత్రం అలాంటి నైతిక విలువలు ఏమీ లేవని దుయ్యబట్టారు. ‘చంద్రబాబుకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చె¯న్నాయుడికి, యనమల రామకృష్ణుడికి నమస్కారం, టీడీపీకి నమస్కారం’ అంటూ చేతులెత్తి దండం పెట్టారు. తన అభిమానులు, సానుభూతిపరులు, కలిసివచ్చే కార్యకర్తలు, నాయకులతో చర్చించి వారి నిర్ణయం మేరకు త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. నమ్మించి.. మోసం చేశారు: తనను పదేళ్లపాటు వాడుకొని అన్యాయంగా బయటకు గెంటివేసిన వారి అంతు చూస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై పోరాడతానని తెలిపారు. పుట్టగతులు లేకుండా పోయే పరిస్థితి టీడీపీకి వచ్చిందని, తనకు అన్యాయం చేసిన ఆ పార్టీ సంగతి చూస్తానని హెచ్చరించారు. -
పార్థసారథికి టికెటిస్తే ఓడిస్తాం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీలో రాజకీయ ప్రకంపనలు తారాస్థాయికి చేరాయి. తాజా పరిణామాలు ఆ పార్టీ ఆశావహ అభ్యర్థి పార్థసారథికి గట్టి షాక్ ఇస్తున్నాయి. స్థానికేతరుడికి టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న కాపా శ్రీనివాస్ ఇప్పటికే పార్టీ కి రాజీనామా చేయగా.. రెండు రోజుల్లో టికెట్ విషయం తేల్చకపోతే తన దారి తాను చూసుకుంటానని ముద్దరబోయిన అల్టిమేటం ఇచ్చారు. స్థానికేతరుడికి టికెటిస్తే ఓడించి తీరతామని అల్టిమేటం జారీచేశారు. టీడీపీ కేడర్‌తో శనివారం జరిగిన సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్థసారథికి టీడీపీ కేడర్ ఝలక్ పార్థసారథి టీడీపీలో చేరడం ఇప్పటికే ఖరారైంది. చంద్రబాబు చింతలపూడిలో నిర్వహించిన సభకు పార్థసారథి వాహనాలు ఏర్పాటు చేసి జనాలను తరలించారు. దీంతో పాటు నియోజకవర్గంలోనూ స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. గత మూడు రోజులుగా టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో పార్టీ కేడర్‌కు ఫోన్లు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం గోగులంపాడులో టీడీపీ మండల నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో పార్థసారథి పాల్గొన్నారు. చంద్రబాబు సొంత సామాజికవర్గ నాయకులు మినహా మిగిలినవారు ఎవరూ హాజరుకాలేదు. నూజివీడు టికెట్ ఆశిస్తున్న కాపా శ్రీనివాస్ టికెట్ పోరాటంలో అలసిపోయి పార్టీ కి రాజీనామా చేశారు. టికెట్ కోసం ముద్దరబోయినపై కాపా గట్టి పోరాటం చేశారు. పోటీ కార్యక్రమాలు, పార్టీ కార్యాలయాలకు వెళ్లి ఇన్చార్జిపై ఫిర్యాదు కూడా చేశారు. చివరకు పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. అయితే నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. మూటలతో వస్తే మద్దతివ్వం: ముద్దరబోయిన శనివారం సాయంత్రం ముద్దరబోయిన తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి జనసేన నేతలను కూడా ఆహ్వానించగా వారు సభకు దూరంగా ఉన్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబునాయుడిని కలిస్తే మీకు సర్వేలన్నీ బాగున్నా.. టికెట్ సర్దుబా టు చేయలేకపోతున్నామని తనకు చెప్పారని కేడర్ ముందు ఆయన వాపోయారు. పదేళ్ల నుంచి ఓడిపోతున్నా పార్టీ కోసం నియోజకవర్గంలో పనిచేస్తుంటే ఇప్పుడు టికెట్ లేదనడం కరెక్ట్ కాదని, రెండు మూడు రోజుల్లో టికెట్ విషయం తేల్చి చెప్పాలని అల్టిమేటం జారీ చేశారు. టికెట్ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తన దారి తాను చూసుకుంటానని అధిష్టానానికి ముద్దరబోయిన స్పష్టం చేసినట్లు సమాచారం. పార్థసారథి వస్తే ఓడించి తీరుతామని, పార్టీ కోసం పనిచేసేవారికి కాకుండా మూటలతో వచ్చిన వారిని సమరి్ధంచమని సమావేశంలో బహిరంగంగానే ప్రకటనలు చేశారు. -
నూజీవీడులో అవినీతి ముద్దర
సాక్షి, కృష్ణా : అధికారంలో ఉన్నది తమ పార్టీయే కదా అనే ధీమాతో తన అనుచరులతో కలిసి అవినీతికి ఆకాశమే హద్దు అన్నట్లు చెలరేగిపోయాడు.. ‘నీరు–చెట్టు’లో మట్టి దోపిడీకి తెరతీశారు.. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క మట్టి అక్రమ తరలింపులోనే ఈయన, అనుచరులు రూ.100 కోట్లు వెనకేశారంటే ఈయన నడిపిన దందా ఏమిటో అర్థమవుతోంది.. ఈయన వెంట ఉన్న చోటామోటా నాయకులకు ఒకప్పుడు ఏమీ లేకపోగా నేడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.. ఒక్క మట్టిదోపిడే కాకుండా ఇసుక అక్రమ రవాణా, రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణంలో కమీషన్లు, పేదలకు ఇచ్చే కార్పొరేషన్ రుణాల్లో వసూళ్ల దందా, చివరకు మరుగుదొడ్ల కేటాయింపు, నిర్మాణంలోనూ అవినీతి కంపు.. ఇలా కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లుగా అన్నిరంగాల్లో తన దందా కొనసాగించారు. ఆయనే నూజివీడు టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. అగ్నికి ఆజ్యం తోడైనట్లు పక్క జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చింతమనేని ఇక్కడ తమ్మిలేరులోనూ తన హవా కొనసాగించడంతో ఇసుక దోపిడీ భారీ స్థాయిలో జరిగి ఏరులు, చెరువులు తమ రూపునే కోల్పోయిన దుస్థితి ఏర్పడింది. చింతమనేని హవా.. ముసునూరు మండలాన్ని ఆనుకొని ఉన్న తమ్మిలేరులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుకదందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రోజుకు 100 నుంచి 200 ట్రాక్టర్ల వరకు ఇసుకను అక్రమంగా తవ్వేస్తూ వందల కోట్లు ఆర్జిస్తున్నారు. ట్రక్కు ఇసుక రూ.3వేల నుంచి రూ.4వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ ప్రజలు ఎవరైనా ఇంటివద్ద అవసరం కోసం ఒక ట్రక్కు ఇసుకను తెచ్చుకుంటుంటే ట్రాక్టర్లను సీజ్‌చేసి జరిమానాలు విధించే అధికారులు, ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నా అటువైపు కన్నెత్తి చూడరు. బలివే సమీపంలోని రంగంపేట వద్ద చింతమనేని ఇసుక దోపిడీని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నేపధ్యంలోనే అప్పటి ముసునూరు తహసీల్దార్ దోనవల్లి వనజాక్షిపై తన అనుచరులతో దాడి చేయించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అలాగే లోపూడి, గుళ్లపూడి, వలసపల్లి, యల్లాపురం, రంగంపేట, బలివేల వద్ద నుంచి ముసునూరు మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు చిలుకూరి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కొల్లిగంగారామ్, చిల్లబోయినపల్లి బుజ్జి తదితరులు ట్రాక్టర్లలో ఇసుకను విక్రయిస్తూ రూ.లక్షలు ఆర్జించారు. ఈ అక్రమార్జనలోనూ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు రూ. కోట్లు కప్పం కట్టినట్లు సమాచారం. నీరు– చెట్టు పనుల్లో రూ.100కోట్లు లూటీ నియోజకవర్గంలో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో చేపట్టిన నీరు చెట్టు పనుల్లో మట్టిని విచ్చలవిడిగా విక్రయించి అధికారపార్టీ నాయకులు రూ.100 కోట్ల పైన లూఠీ చేశారు. నాలుగున్నరేళ్లలో నూజివీడు మండలంలో రూ.28 కోట్లు, ముసునూరు మండలంలో రూ.24 కోట్లు, చాట్రాయి మండలంలో రూ.6 కోట్లు, ఆగిరిపల్లి మండలంలో రూ.5 కోట్లు చొప్పున మొత్తం రూ.63కోట్లు విలువైన పనులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీనిలో పొక్లెయిన్‌కు లోడింగ్ ఖర్చు కింద క్యూబిక్ మీటర్‌కు రూ.29 చొప్పున ప్రభుత్వం చెల్లించగా, టీడీపీ నాయకులు చెరువులలో మట్టిని ట్రక్కు రూ.500 నుంచి రూ.1,000 వరకు విక్రయించుకున్నారు. దాదాపు వేలాది ట్రిప్పుల మట్టిని విక్రయించి రూ.100కోట్ల పైనే దోచుకున్నారు. ప్రభుత్వమే నీరు–చెట్టు కింద లోడింగ్‌కు రూ.60కోట్ల వరకు చెల్లించిందంటే మట్టిని అమ్ముకోవడం ద్వారా ఎంత విక్రయించారో అర్ధమవుతోంది. నూజివీడు మండలంలోని చెరువుల్లోని మట్టి అంతా రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు వెంచర్ల నిర్వాహకులకు, పట్టణంలోని నివేశన స్థలాలకు తోలి విక్రయించుకున్నారు. అంతేగాకుండా ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులను సైతం నీరు చెట్టు పనుల్లో చేపట్టినట్టుగా చూపించి దోచుకున్నారు. టీడీపీ నాయకులు చేసిన మట్టి దందాతో కొన్ని చెరువులు తమ రూపురేఖలనే కోల్పోవడం గమనార్హం. చాట్రాయి పెద్దచెరువు, దీప చెరువుల్లో రూ.30లక్షలతో చేసిన పనులను తూతూమంత్రంగా చేసి లక్షలు దోచుకున్నారు. పోలవరం మట్టి మాఫియా పోలవరం కుడికాలువపైన ఉన్న మట్టిని అధికార టీడీపీకి చెందిన మట్టిమాఫియా లక్షలాది క్యూబిక్ మీటర్లు అమ్ముకుని కోట్లాది రూపాయలు ఆర్జించారు. రాత్రి,పగలు అనే తేడా లేకుండా తరలించారు. తవ్విన మట్టిని తవ్వినట్టే విక్రయించేసి సొమ్ము చేసుకున్నారు. ఇక్కడి మట్టి పల్లెర్లమూడి పరిధిలో ఉన్న క్వారీ గోతులకు, పలువురు రైతుల తోటలకు,హనుమాన్‌జంక్షన్, గుడివాడ వంటి దూరప్రాంతాలకు తరలిపోయింది. ఈ గ్రామ పరిధిలో ఎర్రచెరువుకు ఎగువభాగాన ఉన్న దాదాపు 15 ఎకరాల క్వారీ గోతులను పూడ్చివేశారు. ఈ గోతులు 20 నుంచి 25 అడుగుల లోతులో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. పల్లెర్లమూడి వద్ద నుంచి మర్రిబంధం వరకు పోలవరం కాలువను తవ్వతే 8.30లక్షల క్యూబిక్‌మీటర్ల మట్టి రాగా అందులో దాదాపు 5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అమ్మేసుకున్నారు. క్యూబిక్‌మీటరు మట్టికి ప్రభుత్వం రూ.30 ఇస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే తరలిపోయిన మట్టి విలువ రూ.1.50కోట్లు ఉంది. కేవలం నెలరోజుల వ్యవధిలో ఇంత పెద్దమొత్తంలో మట్టిని అమ్ముకున్నారు. ఏలూరు ఎంపీకి అనుచరుడిగా చెప్పుకునే టీడీపీకి చెందిన పల్లెర్లమూడికి చెందిన గ్రామనాయకుడు మట్టిని అమ్ముకోవడంలో కీలకపాత్ర పోషించాడు. పనుల్లో వాటా ఇవ్వాల్సిందే.. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో కమీషన్ల దందా సాగించి రూ. కోట్లు పోగేశారు. సర్పంచుల పదవీకాలం పూర్తయిన నాటి నుంచి ఈ దందా మరింత పెరిగి ప్రతి పనిలో 10శాతం వరకు కమీషన్ రూపంలో వసూలు చేస్తున్నట్లు సొంతపార్టీలోనే ప్రచారం జరిగింది. ఈ కమీషన్ల దందా కోసం కావాలనే వేరే డివిజన్లో పనిచేసే పంచాయతీరాజ్ డీఈని నూజివీడు డివిజన్‌కు ఇన్చార్జి ఈఈగా నియమించినట్లు సమాచారం. ఉపాధిహామీ, జడ్పీ, ఎంపీ నిధులు, ఇతర గ్రాంట్లు ద్వారా వచ్చే నిధులు కలిపి నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్ల కాలంలో రూ.42కోట్లు పనులు జరగగా, ఈ ఏడాదికి రూ.33కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల్లో 10 శాతం కమీషన్ రూపంలో ముద్దరబోయినకు దక్కినట్లు సమాచారం. ఇదే కాకుండా తన బినామీలతో నీరు–చెట్టు పనుల్లో భాగంగా చెరువుల్లో తవ్విన మట్టిని విక్రయించి పోగేసిన సొమ్ములోనూ ఆయనకు పెద్ద ఎత్తున వాటా ఉన్నట్లు తెలుస్తోంది. -
నూజివీడులో టెన్షన్..టెన్షన్
కృష్ణాజిల్లా : నూజివీడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుపై ముద్దరబోయిన అవినీతి ఆరోపణలు చేశారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఎమ్మెల్యే మేకా ప్రతాప్, ముద్దరబోయినకు బహిరంగ సవాల్ విసిరారు. స్థానిక పెద్దగాంధీ సెంటర్లో సోమవారం ఎమ్మెల్యే మేకా ప్రతాప్, పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి చర్చకు సిద్ధమయ్యారు. దీంతో టీడీపీ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పోలీసులు ముందస్తుగా ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్యే తన అనుచరులతో బహిరంగ చర్చకు వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అనుచరులు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే మేకా ప్రతాప్ చర్చకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. -
నూజివీడులో టెన్షన్..టెన్షన్
-
చంద్రబాబు సమక్షంలోనే బయటపడ్డ విభేదాలు
నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జీ, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు, లోక్ సభ సభ్యుడు మాగంటి బాబు మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే వారిమధ్య విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. నూజివీడులో జరిగిన వనం-మనం కార్యక్రమం సందర్భంగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు, మాగంటి బాబు వర్గాల మధ్య శుక్రవారం ఘర్షణ జరిగింది. ముద్రబోయిన వర్గాన్ని స్టేజ్ మీదకు పిలవడంపై మాగంటి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మాగంటి బాబు అనుచరులు స్టేజ్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ...మాగంటి బాబు వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ముద్రబోయిన, మాగంటిల మధ్య వైరం ఉంది. పలు సందర్భాల్లో వీరిద్దరూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్న విషయం తెలిసిందే.