నూజివీడులో టెన్షన్..టెన్షన్ | tension in nuzvid over challenges between ysrcp mla and tdp leader | Sakshi
Sakshi News home page

నూజివీడులో టెన్షన్..టెన్షన్

Published Mon, Oct 3 2016 6:48 PM | Last Updated on Tue, May 29 2018 3:48 PM

నూజివీడులో టెన్షన్..టెన్షన్ - Sakshi

నూజివీడులో టెన్షన్..టెన్షన్

కృష్ణాజిల్లా : నూజివీడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. 
 
ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుపై ముద్దరబోయిన అవినీతి ఆరోపణలు చేశారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఎమ్మెల్యే మేకా ప్రతాప్, ముద్దరబోయినకు బహిరంగ సవాల్ విసిరారు. స్థానిక పెద్దగాంధీ సెంటర్లో సోమవారం ఎమ్మెల్యే మేకా ప్రతాప్, పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి చర్చకు సిద్ధమయ్యారు. దీంతో టీడీపీ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. 

పోలీసులు ముందస్తుగా ఎమ్మెల్యే మేకా ప్రతాప్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్యే తన అనుచరులతో బహిరంగ చర్చకు వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అనుచరులు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే మేకా ప్రతాప్ చర్చకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement