హీరో రాజ్‌ తరుణ్‌- లావణ్య కేసులో ట్విస్ట్‌! | Big Twist In Hero Raj Tarun, Lavanya Police Case | Sakshi

హీరో రాజ్‌ తరుణ్‌- లావణ్య కేసులో ట్విస్ట్‌!

Published Sat, Jul 6 2024 11:37 AM | Last Updated on Sat, Jul 6 2024 1:17 PM

Big Twist In Hero Raj Tarun, Lavanya Police Case

ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరో రాజ్‌తరుణ్‌పై కోకపేటకు చెందిన లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్‌ తరుణ్‌, తాను పదకొండేళ్లుగా కలిసి జీవించామని, ఇప్పుడు అతను ముంబైకి చెందిన హీరోయిన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడంటూ పిర్యాదులో పేర్కొంది. అయితే ఈ కేసులో నార్సింగి పోలీసులు బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. పిర్యాదులో పేర్కొన్న ఆధారాలు సమర్పించాలంటూ తిరిగి లావణ్యకే నోటీసులు అందించారు. 

శుక్రవారం మధ్యాహ్నం లావణ్య ఫిర్యాదు చేయగా.. సాయంత్రమే  పోలీసులు నోటీసులు జారీ చేశారు. లావణ్య ఇచ్చిన నాలుగు పేజీల ఫిర్యాదు ఫార్మాట్‌లో లేదని,నేరం జరిగితే సమయం, ప్లేస్‌..ఇలాంటి వివరాలేవి అందులో పేర్కొనలేదని పోలీసులు తెలిపారు. లావణ్య చేసిన ఫిర్యాదుపై ఆధారాలు ఇవ్వమని నోటీసులు ఇచ్చినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు లావణ్య అందుబాటులోకి రానట్లు తెలుస్తోంది.

ప్రాణహానీ ఉంది: లావణ్య
హీరో రాజ్‌తరుణ్‌ తనతో సహజీవనం చేస్తూ మాల్వి మల్హోత్రాతో ప్రేమాయాణం సాగిస్తూ మోసం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఆమె మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిసింది. అంతేకాదు రాజ్‌తరుణ్‌, మాల్వి కలిసి ఇటీవల గోవా, చెన్నై, పాండిచ్చేరిలకు కలిసి వెళ్లారని, ఇదే విషయాన్ని నిలదీస్తే తనను దూరం పెట్టాడని పేర్కొంది. రాజ్‌తరుణ్‌ని వదిలేస్తే కొంత డబ్బు ఇస్తామని, లేదంటే చంపేస్తామని హీరోయిన్‌ సోదరుడు బెదిరించాడని తెలిపింది. తనకు ప్రాణహానీ ఉందని, కాపాడాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. అయితే అధారాలు సమర్పించాలని పోలీసులు లావణ్యను కోరారు.

రిలేషన్‌లో ఉన్న మాట నిజమే కానీ.. : రాజ్‌తరుణ్‌
లావణ్య ఫిర్యాదు తర్వాత రాజ్‌ తరుణ్‌ మీడియాతో మాట్లాడుతూ..గతంలో ఆమెతో రిలేషన్‌లో ఉన్న మాట నిజమేనని.. విడిపోయి చాలా కాలం అవుతుందని చెప్పారు. 2014 నుంచి 2017 వరకు లావణ్యతో కలిసి ఒకే ఇంట్లో ఉన్నానని చెప్పారు. తనకు మందు, సిగరేట్‌తో పాటు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉందని, ఎన్నిసార్లు చెప్పినా మానేకపోవడంతో తాను బయటకు వచ్చానని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement