‘నా భర్తను ట్రాప్‌ చేసింది.. ఇంటికి రాకుండా అడ్డుకునేది’ | Shocking Twist Revealed In Choreographer Jani Master Case, Check Details Inside | Sakshi
Sakshi News home page

Jani Master Case: ‘నా భర్తను ట్రాప్‌ చేసింది.. ఇంటికి రాకుండా అడ్డుకునేది’

Published Sat, Sep 28 2024 10:06 AM | Last Updated on Sat, Sep 28 2024 11:18 AM

Another Twist In Choreographer Jani Master Case

సాక్షి, హైదరాబాద్‌: కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ కేసులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. తన భర్తపై ఫిర్యాదు చేసిన బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఆయన భార్య సుమలత ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్‌గా పని చేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని పేర్కొన్నారు. ఐదేళ్లుగా నరకం అంటే చూపిందని.. తాను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందంటూ ఫిర్యాదులో తెలిపింది.

‘‘నాకు అమ్మ వద్దు.. నాన్న వద్దు.. నువ్వు పెళ్లి చేసుకో అంటూ నా భర్తపై తీవ్ర ఒత్తిడి చేసింది. నా భర్తను ఇంటికి రాకుండా అడ్డుకునేది. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది. బాధితురాలు ఇంటికి వెళ్లి జానీ మాస్టర్‌ను నువ్వు ఇష్టపడితే.. ఆయన జీవితం నుంచి నేను వెళ్లిపోతానని చెప్పాను. బాధితురాలు మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు మీరు నాకు వదిన అంటూ నమ్మించింది. నా భర్తతో కాకుండా చాలా మంది మగవాళ్లతో ఆమెకు అక్రమ సంబంధం ఉంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ ఆ అమ్మాయిని దూరం పెట్టాడు. దీంతో కక్ష కట్టి తన భర్త లైంగిక దాడి చేశాడంటూ అక్రమ కేసు పెట్టింది’’ అని ఫిర్యాదులో సుమలత పేర్కొంది.

‘‘పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఆమె వేధింపులకు గురిచేస్తుంది. ఆమె తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసింది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు, నా పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతుళ్లదే బాధ్యత. నాకు నా పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నాను’’ అని సుమలత తెలిపింది.

ఇదీ చదవండి: పెళ్లి చేసుకోమని ఆమె నన్ను వేధించేది: జానీ మాస్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement