జానీ కేసుపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు | BJP MLA Raja Singh Sensational Comments On Johnny Master | Sakshi
Sakshi News home page

జానీ కేసుపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

Published Thu, Sep 19 2024 1:01 PM | Last Updated on Thu, Sep 19 2024 4:51 PM

BJP MLA Raja Singh Sensational Comments On Johnny Master

సాక్షి, హైదరాబాద్‌: లవ్‌ జిహాదీకి పాల్పడిన కొరియోగ్రాఫర్‌ జానీ బాషాను కఠినంగా శిక్షించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌. అలాగే, జానీ బాషా ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలను మత మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చాడో బయటపెట్టించాలని పోలీసులకు సూచించారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు. తాజాగా రాజాసింగ్‌ మాట్లాడుతూ.. జానీ బాషా అరెస్ట్‌ ఎందుకు ఆలస్యమవుతోంది?. జానీని త్వరగా అరెస్ట్‌ చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. అతడు ఎంత మంది అమ్మాయిలను మత మార్పిడి కోసం ఒత్తిడి చేశాడో బయటపెట్టించాలి. ఒక దొంగకి, ఒక రౌడీకి, ఒక హంతకుడికి ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఇస్తారో అదే విధంగా అతడికి కూడా ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలని నేను పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. లవ్‌ జిహాదీకి పాల్పడిన జానీ బాషాను కఠినంగా శిక్షించాలి. బాలీవుడ్‌చిత్ర పరిశ్రమకు జానీ బాషా మచ్చ తెచ్చాడు. ఇలాంటి వారి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన ప్యానల్‌ సీరియస్‌గా వ్యవహరించాలి. ఇండస్ట్రీలో ఇలాంటి వారు మళ్లీ అడుగుపెట్టకుండా ప్యానల్‌ కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

జానీ మాస్టర్ ను కఠినంగా శిక్షించాలి

Video Credit: ఉత్తరాంధ్ర నౌ!

ఇదిలా ఉండగా.. కొరియోగ్రాఫర్‌ జానీ బాషాను హైదరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు కాసేపటి క్రితమే గోవాలో అరెస్ట్‌ చేశారు. అనంతరం, అతడిని గోవా కోర్టులో హాజరుపరిచారు. పీటీ వారెంట్‌ కింద.. పోలీసులు జానీని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రేపు ఉప్పరపల్లి కోర్టులో జానీ బాషాను హాజరుపరుచనున్నారు. ఇక, అంతకుముందు బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ బాషాపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement