Johny basha
-
జానీ కేసుపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: లవ్ జిహాదీకి పాల్పడిన కొరియోగ్రాఫర్ జానీ బాషాను కఠినంగా శిక్షించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అలాగే, జానీ బాషా ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలను మత మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చాడో బయటపెట్టించాలని పోలీసులకు సూచించారు.లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తాజాగా రాజాసింగ్ మాట్లాడుతూ.. జానీ బాషా అరెస్ట్ ఎందుకు ఆలస్యమవుతోంది?. జానీని త్వరగా అరెస్ట్ చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. అతడు ఎంత మంది అమ్మాయిలను మత మార్పిడి కోసం ఒత్తిడి చేశాడో బయటపెట్టించాలి. ఒక దొంగకి, ఒక రౌడీకి, ఒక హంతకుడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో అదే విధంగా అతడికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలని నేను పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. లవ్ జిహాదీకి పాల్పడిన జానీ బాషాను కఠినంగా శిక్షించాలి. బాలీవుడ్చిత్ర పరిశ్రమకు జానీ బాషా మచ్చ తెచ్చాడు. ఇలాంటి వారి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన ప్యానల్ సీరియస్‌గా వ్యవహరించాలి. ఇండస్ట్రీలో ఇలాంటి వారు మళ్లీ అడుగుపెట్టకుండా ప్యానల్ కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.జనసేన నేత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తాట తీయండి - బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్#Janasena #JaniMaster x #RajaSingh #UANow #STopRape pic.twitter.com/dVpZHyaKzN— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) September 19, 2024Video Credit: ఉత్తరాంధ్ర నౌ!ఇదిలా ఉండగా.. కొరియోగ్రాఫర్ జానీ బాషాను హైదరాబాద్ ఎస్వోటీ పోలీసులు కాసేపటి క్రితమే గోవాలో అరెస్ట్ చేశారు. అనంతరం, అతడిని గోవా కోర్టులో హాజరుపరిచారు. పీటీ వారెంట్ కింద.. పోలీసులు జానీని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రేపు ఉప్పరపల్లి కోర్టులో జానీ బాషాను హాజరుపరుచనున్నారు. ఇక, అంతకుముందు బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ బాషాపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు! -
కొరియోగ్రాఫర్ జానీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన సస్పెండెడ్ నేత జానీ మాస్టర్(షేక్ జానీ బాషా) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గోవాలో జానీని ట్రేస్ చేసిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు.. అక్కడే అరెస్ట్ చేశారు. సహా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న జానీపై.. నార్సింగి పీఎస్‌లో సెప్టెంబర్ 15వ తేదీన కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆపై జానీ ఆచూకీ లేకపోవడంతో.. పరారైనట్లు పోలీసులు ప్రకటించారు. చివరకు.. గోవాలో అరెస్ట్ చేసి అక్కడే కోర్టులో హాజరుపరిచ్చారు. గోవా కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతిస్తూ.. 24 గంటల్లోగా ఉప్పరపల్లి కోర్టులో జానీ బాషాను హాజరుపరచాలని ఆదేశించింది. దీంతో జానీని పోలీసులు తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపై ఆమె మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించసాగాడని బాధితురాలు చెప్పడంతో జానీపై పోక్సో చట్టం కింద కేసు జత చేశారు. అయితే కేసు తర్వాత జానీ ఆచూకీ తెలియరాలేదు. భార్యతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి.. తన ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు!తొలుత పోలీసులు కొండపూర్లోని నివాసానికి వెళ్లి చూడగా.. తాళం వేసి ఉంది. ఆపై స్వస్థలం నెల్లూరులో ఉండొచ్చని వెళ్లి చూడగా.. అక్కడా లేడు. ఆ తర్వాత లడ్ఢాఖ్‌లో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లి స్థానిక పోలీసులను సంప్రదించారు. మొత్తంగా నాలుగు టీంలతో ఆపరేషన్ జానీ ముమ్మరంగా కొనసాగగా.. చివరకు గోవాలో పట్టుబడ్డాడు. తెలుగుతో పాటు కోలీవుడ్, హిందీలోనూ పలు స్టార్ హీరోలకు జానీ కొరియోగ్రాఫ్ చేశాడు. అంతేకాదు.. పవన్ కల్యాణ్ జనసేనలోనూ మొదటి నుంచి క్రియాశీలకంగా పని చేస్తున్నాడు. అయితే.. లైంగిక వేధింపులు వెలుగులోకి రావడంతో పార్టీ అతన్ని దూరం పెడుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది కూడా చదవండి: జానీ మాస్టర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి: బీజేపీ మహిళా మోర్చా -
పవన్.. గొంతు ఎందుకు పెగలడం లేదు?
కాలం ఎప్పుడూ ఒక్క తీరున ఉండదంటారు పెద్దలు. నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే.. ఒకప్పుడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ చిన్న ఘటన జరిగినా దబాయిస్తూ.. గదమాయిస్తూ రంకెలు వేసిన పవన్ కళ్యాణ్ స్వరం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు మూగ పోయింది మరి!. కూటమి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా ఆయన పెదవి అస్సలు విప్పడం లేదు.టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ విషయమే తీసుకుందాం. తోటి కొరియోగ్రాఫర్‌ను జానీ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. టాలీవుడ్ నటులు చాలా మంది దీనిపై స్పందించారు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం తనకేమీ పట్టనట్టుగానే ఉన్నాడు. రెండేళ్లుగా తనను జానీ వేధిస్తున్నాడని, అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఆ జూనియర్ కొరియోగ్రాఫర్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నటి పూనమ్ కౌర్ కూడా ఆరోపణలను పునరుద్ఘాటించడం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్‌కు ఇష్టమైన వ్యక్తి కావడం గమనార్హం.పూనమ్ కౌర్ గతంలో పవన్ కళ్యాణ్‌పై స్వయంగా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. కానీ, రాజకీయ నేపథ్యం లేకపోవడం వల్లనో, సినీ పరిశ్రమలో తగినంత పలుకుబడి లేదనో తెలియదు కానీ ఆ అభియోగాలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులు కొందరిపై అడప దడపా లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పటికీ పెద్దలు కొందరు కల్పించుకుని ఏదోలా మేనేజ్ చేసి రక్షిస్తుంటారని పుకార్లు ఉన్నాయి.తెలుగుదేశం ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడి బావమరిది, సినీ నటుడు బాలకృష్ణ ఇంట్లో కాల్పుల వ్యవహారం కూడా అలాంటిదే అనుకోవాలి. ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపినా ఆయన జైలుకు వెళ్లకుండా పలుకుబడి కలిగిన వాళ్లు కాపాడినట్లు చర్చ ఇప్పటికీ నడుస్తూంటుంది. ‘ఆడది కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి..’ అంటూ బహిరంగ వేదికపైనే వ్యాఖ్యానించినా మహిళా సంఘాలు పెద్దగా ఆక్షేపించింది లేదు. పైగా ఆయన అభిమానులు ‘జై బాలయ్య’ అంటూ తిరుగుతుంటారు. పైగా హిందూపురం ప్రజలు ఆయనను మూడుసార్లు శాసనసభకు ఎన్నుకున్నారు. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే మహిళల విషయంలో చులకన భావంతో వ్యాఖ్యలు చేసే, అనైతిక చర్యలకు పాల్పడే వారి విషయంలో తప్పు ఎవరిదంటే.. ప్రజలదనే చెప్పాలి. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి వారిది కాదనే అనుకోవాలి.ఈ ఘటనలన్నీ తెలుగు సినిమా రంగంలోని వికృత, వికారపు చేష్టలకు అద్దంపట్టేవే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమపై వచ్చిన మత్తుమందు వాడకం ఆరోపణలు, రాజ్‌తరుణ్, అతడి సహజీవన భాగస్వామి మధ్య జరిగిన రచ్చ, ఆ తరువాత ప్రియురాలితో గొడవ వంటివి సినీ అభిమానులకు కనువిప్పు కావాలి. ఒక హత్య కేసులో కన్నడ సినీ హీరో దర్శన్‌ను ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేయడం ఆ రాష్ట్రంలో సంచలనం రేపింది. కేరళలో ‘హేమ కమిటీ’ నివేదిక సృష్టించిన కలకలం కూడా ఇంకా సద్దుమణగలేదు. మళయాల సినీ రంగంలో ప్రముఖ హీరోలు, నటులు మహిళా నటుల పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో ఈ నివేదిక బట్టబయలు చేసింది. మోహన్ లాల్ వంటి ప్రసిద్ధ నటుడు ఈ నివేదిక నేపథ్యంలో తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది.ఇక, తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే.. గత ప్రభుత్వ హయాంలోనూ పలువురు ప్రముఖ నటులు మత్తుమందుల వ్యవహారంలో విచారణ ఎదుర్కొన్నారు. కానీ, వారు ఎలాగోలా మేనేజ్ చేసుకున్నారని చెబుతారు. సినిమాల్లో నీతులు చెప్పడం, హీరోయిజం ప్రదర్శించడం వేరు. వాస్తవ జీవితంలో వారు వ్యవహరించే శైలి వేరని అనేక మార్లు రుజువవుతున్నా కొంతమంది కులం పేరుతోనో, లేక ఇతరత్రా అభిమానం పేరుతో విపరీతంగా ఆరాధించడం బాధాకరం. సినిమాను వినోదంగా చూసి సరిపెట్టుకోలేని అభిమానుల బలహీనతను నటులు కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తద్వారా రాజకీయాల్లోకి వచ్చి పదవులు పొంది కథలు చెబుతున్నారు. అలాంటి వారిలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరు కూడా పలువురు ప్రముఖంగా ప్రస్తావిస్తుంటారు.పవన్ కళ్యాణ్ తన కళ్ల ముందే ఇంకో మహిళతో కాపురం చేశారని ఆయన రెండో భార్య రేణూ దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో చెబితే.. అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. పవన్ చేసింది తప్పని మాత్రం అనలేకపోయారు. దానికి తోడు ఒక సామాజిక వర్గం పవన్ కళ్యాణ్‌ను అభిమానిస్తోందన్న బలహీనత నుంచి లబ్ధి పొందేందుకు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవం మొత్తాన్ని వాడుకుని మరీ వ్యూహాలు పన్నాడు. ఎలాగైతేనేం.. వీళ్లిద్దరూ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకైతే వచ్చారు. ఆ తరువాతి నుంచి ఏపీలో మహిళలపై ఎన్ని అత్యాచారాలు, దాష్టీకాలూ జరిగినా పవన్ కళ్యాణ్ నోరు పెగలడం లేదని విమర్శకులు అంటున్నారు.ఈ నేపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీకి జానీని దూరం పెట్టినట్లు ఒక ప్రకటనైతే వచ్చింది కానీ.. పవన్ కళ్యాణ్‌తో అతడికి ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిపే అంశాలు ప్రచారంలోకి రావడంతో పార్టీతోపాటు పవన్ పరువు కూడా పోయినట్లు అయ్యింది. పవన్ కల్యాణ్‌కు సంబంధించి జానీ ఒక ట్వీట్ చేస్తూ ‘మీ ప్రోత్సాహంతో మొదలై, మీ స్ఫూర్తితో కొనసాగుతున్న ప్రయాణమిది. అందరి ఆశీస్సులతోపాటు మీ అభినందనలు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చాయి. పవన్ కల్యాణ్ అన్నా’ అని వ్యాఖ్యానించాడు. ఒక అవార్డు వచ్చిన సందర్భంగా సామాజిక స్పృహ కలిగిన కళాకారుడు జానీ అని పవన్ కళ్యాణ్ మెచ్చుకోవడం విశేషం. అంతేకాకుండా తాను చేసిన పలు చిత్రాలకు జానీ పని చేశాడని, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కూడా ఉన్నాడని గుర్తు చేసుకున్నారు.అవార్డు వచ్చినందుకు పొగిడితే తప్పులేదు కానీ, సామాజిక స్పృహ ఉందనడం, అసలు పని చేయని కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఉన్నాడని చెప్పడం ద్వారా వారిద్దరి చిరకాల స్నేహ సంబంధాలు అందరికీ తెలిశాయి. జానీ ఇప్పుడు ఒక జూనియర్ డాన్సర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారన్న అభియోగానికి గురి కావడం సామాజిక స్పృహ ఎలా అవుతుందన్న ప్రశ్న వస్తోంది. పైగా పవన్ స్ఫూర్తితో ప్రయాణిస్తున్నానని జానీ అంతకు ముందు వ్యాఖ్యానించిన వైనం కూడా పవన్‌కు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు అందరికీ తెలిసినవే.ఇక, 2014-19 మధ్యలో టీడీపీ హయాంలో సుగాలీ ప్రీతి అనే యువతి హత్య కేసును వైఎస్ జగన్ ప్రభుత్వానికి అంటగట్టేందుకు పవన్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఏపీలో వాలంటీర్లుగా పని చేస్తున్న సామాన్యులను అమ్మాయిల కిడ్నాపర్లుగా పోల్చి దారుణంగా అవమానించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మాయిల కిడ్నాప్ గురించి నోరెత్తితే ఒట్టు. అంతే కాదు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అలాగే కొంతమంది జనసేన వారు హింసా కాండకు దిగినా, మహిళలపై సైతం రాక్షసత్వంగా వ్యవహరించినా పవన్ కనీసం ఎప్పుడూ ఖండించలేదు. ముచ్చుమర్రి అనే గ్రామంలో ఒక బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఆ బాలికను హత్య చేసి కృష్ణానదిలో పారేసినా పోలీసులు ఆ భౌతికకాయం ఎక్కడుందో కనిపెట్ట లేకపోయారు. కొద్ది రోజుల క్రితమే మంత్రి లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరిలో రెండు అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే గత నాలుగు నెలల్లో మహిళలపై జరిగిన అకృత్యాల సంఖ్య ఎక్కువే. అయినా పవన్ కల్యాణ్, చంద్రబాబు సరైన రీతిలో స్పందించడం లేదు. కానీ.. పలువురిని మోసం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై నటి ఒకరిని అడ్డం పెట్టి ముగ్గురు ఐపీఎస్ అధికారులను కనీస నిబంధనలు పాటించకుండా సస్పెండ్ చేయడం బహుశా ఏపీలో మాత్రమే జరిగి ఉంటుంది.గతంలో ఓటుకు నోటు కేసులోనో లేక స్కిల్ స్కామ్లోనో తనను పట్టుకున్నారన్న కోపంతో పీఎస్ఆర్ ఆంజనేయులుపై చంద్రబాబు ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనపై అత్యాచారం చేశారని అదే పార్టీకి చెందిన ఒక మహిళా నేత నేరుగా ఆరోపించినా ఆయన్ను అరెస్ట్ చేయకుండా సస్పెండ్ చేసి వదిలేశారు. ఇప్పుడు ఆ కేసును మేనేజ్ చేసే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై సైతం పవన్ కల్యాణ్ కనీసం ప్రశ్నించలేదు. వీటన్నిటి బట్టి అధికారంలోకి వచ్చాక పవన్ కల్యాణ్ ఎలా వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చని, తన అభిమానులకు ఆయన ఎలాంటి స్ఫూర్తిని అందిస్తున్నదని తెలుసుకోవచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా కేవలం సినిమా నటులు అన్న పిచ్చి అభిమానంతో వారు ఎన్ని అరాచకాలు చేసినా, కొన్ని హేయమైన పనులకు పాల్పడినా వారిని తమ దేవుళ్ల మాదిరి చూసుకోవడం తప్పో కాదో అభిమానులే నిర్ణయించుకోవాలి.కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జానీ మాస్టర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి: బీజేపీ మహిళా మోర్చా
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. యువతిని లైంగికంగా హింసించిన జానీకి కఠిన శిక్ష విధించాలని అధ్యక్షురాలు శిల్పా రెడ్డి డిమాండ్ చేశారు.కాగా, షేక్ జానీ బాషా లైంగిక వేధింపుల అంశంపై బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి తాజాగా స్పందించారు. ఈ క్రమంలో శిల్పారెడ్డి మాట్లాడుతూ.. యువతిని లైంగికంగా హింసించిన జానీకి కఠిన శిక్ష పడాలి. మతం మారాలని ఒత్తిడి చేయడం లవ్ జిహాద్‌కు సంబంధించిన కేసు. వేధింపుల కేసులో జానీని ఇంకా అరెస్ట్ చేయకపోవడం దారుణం. జానీని వెంటనే అరెస్ట్ చేయాలి’ అని కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ లైంగిక వేధింపు కేసులో నార్సింగి పోలీసులు దర్యాప్తుపై వేగం పెంచారు. తాజాగా బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అలాగే, ఆమెకు వైద్య పరీక్షలు కూడా ముగిశాయి. ఈ కేసులో మరిన్ని వివరాల సేకరించేందుకు పోలీసులు.. నేడు బాధితురాలి ఇంటికి వెళ్లనున్నారు.ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు! -
లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో నార్సింగి పోలీసులు వేగంగా పెంచారు. తాజాగా బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం, ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు.కాగా, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు.. బాధితురాలి స్టేట్మెంట్ను బుధవారం రికార్డు చేశారు. కాసేపటి క్రితమే ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఇక, మరికొన్ని ఆధారాల సేకరణ కోసం నేడు బాధితురాలి ఇంటికి పోలీసులు వెళ్లనున్నట్టు సమాచారం. అయితే, ఇప్పటికే ఈ కేసు వివరాలను సఖీ బృందం సేకరించిన విషయం తెలిసిందే. మైనర్‌గా ఉన్నప్పుడే బాధితురాలు లైంగిక వేధింపులకు గురైనట్టు గుర్తించారు. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరింపులకు గురిచేసినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేసింది.మరోవైపు.. జానీ మాస్టర్‌కు వ్యతిరేకంగా సినిమా ఇండస్ట్రీ కూడా స్వరం పెంచింది. టాలీవుడ్లో లైంగిక వేధింపుల అంశంపై ప్యానల్ విచారణ జరుపుతోంది. ఇక, ప్యానల్ సైతం వేధింపులపై ఇప్పటికే కొన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. జానీ వ్యవహారంలో నివేదికను సిద్ధం చేస్తున్నామని ప్యానల్ తెలిపింది. ఇదిలా ఉండగా.. బాధితురాలికి ఉన్న వర్క్ టాలెంట్‌తో ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అగ్ర హీరో బాధితురాలికి మద్దతు పలికినట్టు సమాచారం.కేసు వివరాలు ఇలా..జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతని సహాయకురాలు (21) చేసిన ఫిర్యాదు మేరకు ఈనెల 15న నార్సింగి పీఎస్‌లో ఐపీసీ 376 (2)(ఎన్), 506, 323 సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ముంబైలోని ఓ హోటల్లో మొదలుపెట్టి.. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం..బాధితురాలు 2017లో తన స్వస్థలం నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఢీ–12 డ్యాన్స్ షో చేస్తున్న క్రమంలో ఆమెకు జానీ మాస్టర్‌తో పరిచయం ఏర్పడింది. సహాయ కొరియోగ్రాఫర్‌గా పనిచేయడానికి జానీ మాస్టర్ బృందం నుంచి ఫోన్ కాల్ రావడంతో 2019లో ఆ బృందంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఈ క్రమంలో ముంబైలో ఒక ప్రాజెక్టు కోసం జానీ మాస్టర్, ఇద్దరు అసిస్టెంట్లతో కలిసి ముంబైకు వెళ్లింది. అప్పుడు ఓ హోటల్లో జానీ మాస్టర్ ఆమెపై బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని బెదిరించాడు.దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. ఆపై ప్రతి షూట్ సమయంలోనూ జానీ మాస్టర్ ఆమెను వేధించేవాడు. ఆమె వ్యానిటీ వ్యాన్‌లోకి ప్రవేశించి లైంగిక వాంఛను తీర్చాలని బలవంతం చేసేవాడు. షూటింగ్ సెట్లలో ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఒకసారి తన కోరిక తీర్చనన్నందుకు జుట్టు పట్టుకొని ఆమె తలను వ్యానిటీ వ్యాన్‌లోని అద్దానికి గుద్దాడు. ఒకసారి షూటింగ్ ముగిశాక అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి స్కూటీని ధ్వంసం చేశాడు. మతం మారాలని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆగంతకుడి బెదిరింపులు.. అనుమానాస్పద పార్శిల్ వేధింపులు భరించలేక బాధితురాలు సొంతంగా పనిచేసుకోవడం ప్రారంభించింది. కానీ చిత్ర పరిశ్రమలో తనకున్న పరిచయాలను ఆధారంగా చేసుకుని జానీ మాస్టర్ ఆమెకు ఎలాంటి అవకాశాలు రాకుండా చేసేవాడు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాజెక్టుల కోసం ఆమెను ఎంపిక చేసుకుని, షూటింగ్ కొంత పూర్తయ్యాక మధ్యలో వదిలేసి వేరొకర్ని నియమించుకున్నాడు. గత నెల 17న గుడి నుంచి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. 28న ఆమె ఇంటి తలుపులకు అనుమానాస్పద పార్శిల్ వేలాడదీసి ఉంది. అందులో ‘కంగ్రాచ్యులేషన్స్ ఫర్ సన్ .. బట్ బీ కేర్ ఫుల్..’అని రాసి ఉందని బాధితురాలు ఎఫ్ఐఆర్లో పేర్కొంది.ఇది కూడా చదవండి: జానీ మాస్టర్ కేసులో మరిన్ని కీలక అంశాలు -
‘బాక్సింగ్’ విజేత జానీబాషా
గుంటూరు ఎడ్యుకేషన్ : శ్రీకాకుళంలో స్టూడెంట్స్ ఒలింపిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–17 జాతీయస్థాయి ఉషూ బాక్సింగ్ పోటీలో నారాయణ విద్యాసంస్థల విద్యార్థి పి. జానీబాషా విజేతగా నిలిచాడని విద్యాసంస్థల జనరల్ మేనేజర్ పిడికిటి తిలక్‌బాబు తెలిపారు. అమరావతిరోడ్డులోని నారాయణ జోనల్ కార్యాలయంలో శనివారం జరిగిన విద్యార్ధి అభినందన సభలో తిలక్‌బాబు మాట్లాడుతూ బాక్సింగ్ నేర్చుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. తద్వారా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునే శక్తి, ఏకాగ్రత చేకూరుతాయన్నారు. పూణేలో జరగనున్న జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు జానీబాషా సంసిద్ధమయ్యాడని పేర్కొన్నారు. జానీ బాషా మాట్లాడుతూ గతంలో రాష్ట్ర స్థాయిలో మూడు సార్లు బంగారు పతకం సాధించానని, అంతర్జాతీయస్థాయి బాక్సింగ్‌లో సైతం విజేతగా నిలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అండర్– 17, 42, 52 కేజీల విభాగంలో విజేతకు శిక్షణ ఇచ్చిన శిక్షకుడు నరసింహారావు, తండ్రి మస్తాన్ ఖాన్‌ను జీఎం తిలక్‌బాబు అభినందించారు. కార్యక్రమంలో డీన్ వీరగంధం శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్స్ కోటేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.