‘బాక్సింగ్’ విజేత జానీబాషా
‘బాక్సింగ్’ విజేత జానీబాషా
Published Sat, Nov 26 2016 10:11 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
గుంటూరు ఎడ్యుకేషన్ : శ్రీకాకుళంలో స్టూడెంట్స్ ఒలింపిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–17 జాతీయస్థాయి ఉషూ బాక్సింగ్ పోటీలో నారాయణ విద్యాసంస్థల విద్యార్థి పి. జానీబాషా విజేతగా నిలిచాడని విద్యాసంస్థల జనరల్ మేనేజర్ పిడికిటి తిలక్‌బాబు తెలిపారు. అమరావతిరోడ్డులోని నారాయణ జోనల్ కార్యాలయంలో శనివారం జరిగిన విద్యార్ధి అభినందన సభలో తిలక్‌బాబు మాట్లాడుతూ బాక్సింగ్ నేర్చుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. తద్వారా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునే శక్తి, ఏకాగ్రత చేకూరుతాయన్నారు. పూణేలో జరగనున్న జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు జానీబాషా సంసిద్ధమయ్యాడని పేర్కొన్నారు. జానీ బాషా మాట్లాడుతూ గతంలో రాష్ట్ర స్థాయిలో మూడు సార్లు బంగారు పతకం సాధించానని, అంతర్జాతీయస్థాయి బాక్సింగ్‌లో సైతం విజేతగా నిలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అండర్– 17, 42, 52 కేజీల విభాగంలో విజేతకు శిక్షణ ఇచ్చిన శిక్షకుడు నరసింహారావు, తండ్రి మస్తాన్ ఖాన్‌ను జీఎం తిలక్‌బాబు అభినందించారు. కార్యక్రమంలో డీన్ వీరగంధం శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్స్ కోటేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Advertisement