
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్‌ను ఉప్పరపల్లి కోర్టు విధించింది. అక్టోబర్ 3 వరకు ఆయన చంచల్‌గూడ జైలులో ఉండనున్నారు. గత నాలుగైదు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను గోవాలోని ఓ లాడ్జిలో నార్సింగి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన్ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.
కోర్టు ఆవరణలో జానీ మాస్టర్ మాట్లాడుతూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నాడు. తనను కావాలని ఇరికించిన వారిని మాత్రం ఎట్టిపరిస్థితిల్లో వదిలిపెట్టనంటూ వార్నింగ్ ఇచ్చాడు. అతని దగ్గర సహాయక కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన మైనర్ ఈనెల 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు జానీ మాస్టర్‌పై ఐపీసీ 376 (2) (ఎ¯Œ), 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో కింద కేసు నమోదు చేశారు.

Comments
Please login to add a commentAdd a comment