జానీ మాస్టర్‌ అరెస్టు | Sexual assault case against Jani Master: Dance choreographer arrested in Goa | Sakshi
Sakshi News home page

జానీ మాస్టర్‌ అరెస్టు

Published Fri, Sep 20 2024 6:15 AM | Last Updated on Fri, Sep 20 2024 6:15 AM

Sexual assault case against Jani Master: Dance choreographer arrested in Goa

గోవాలో అదుపులోకి తీసుకున్న స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ 

పాస్‌పోర్టు, సెల్‌ఫోన్లు స్వా«దీనం 

ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలింపు 

కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు 

సోమవారం కస్టడీ పిటిషన్‌ దాఖలుకు సన్నాహాలు

సాక్షి, హైదరాబాద్‌: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ఎట్టకేలకు సైబరాబాద్‌ పోలీసులకు చిక్కాడు. గత నాలుగైదు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను గోవాలోని ఓ లాడ్జిలో నార్సింగి స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు. ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేర కు జ్యుడీíÙయల్‌ రిమాండ్‌కు తరలిస్తామని రాజేంద్రనగర్‌ డీసీపీ సీహెచ్‌ శ్రీనివాస్‌ తెలిపారు. తనపై జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అతని దగ్గర సహాయక కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన మైనర్‌ ఈనెల 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు జానీ మాస్టర్‌పై ఐపీసీ 376 (2) (ఎ¯Œ), 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో కింద కేసు నమోదు చేశారు.  

భార్య ఇచి్చన సమాచారంతోనే.. 
జానీ మాస్టర్‌తో పాటు ఆయన భార్య కూడా పలుమార్లు తనపై శారీరకంగా దాడికి పాల్పడిందంటూ మైనర్‌ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్‌ భార్యను నార్సింగి పోలీసులు స్టేషన్‌ లో విచారించారు. ఈనెల 15 నుంచే పరారీ లో ఉన్న జానీ మాస్టర్‌ తన ఫోన్‌ను స్విఛాఫ్‌ చేసుకున్నా డు. పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. జానీ భార్యను విచారిస్తున్న క్రమంలో ఆయన ఎక్కడున్నాడనే సమాచారాన్ని పోలీసులు రాబట్టారు.

ఆ సమాచారం ఆధారంగా గోవాకు వెళ్లిన ప్రత్యేక బృందం జానీని అరెస్టు చేసింది. అతని వద్ద నుంచి పాస్‌ పోర్ట్, సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. బాధితురాలితో జానీ మాస్టర్‌ జరిపిన కాల్స్, వాట్సాప్‌ చాటింగ్, ఇతరత్రా ఆధారాలను సేకరించేందుకు సెల్‌ఫోన్‌లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. తదుపరి విచారణ నిమిత్తం జానీ మాస్టర్‌ను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించిన పోలీసులు.. ఈమేరకు సోమవారం కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

మైనర్‌పై లైంగిక వేధింపులు! 
ఓ డ్యాన్స్‌ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచి్చన బాధితురాలికి జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీ బాషాతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో జానీ 2019లో తన నృత్య బృందంలో సహాయ కొరియోగ్రాఫర్‌గా ఆమెను నియమించుకున్నాడు. ఓ డ్యాన్స్‌ ప్రాజెక్టు నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు ముంబై వెళ్లిన బాధితురాలిపై అక్కడి ఓ హోటల్‌లో జానీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అప్పటికి బాధితురాలు వయసు 17 ఏళ్లే కావడం గమనార్హం. కాగా జానీ ఆ తర్వాత కూడా తనపై పలుమార్లు వేధింపులకు పాల్పడినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement