జానీ మాస్టర్ హీరోగా సినిమా.. టైటిల్‌ ఇదే! | Jani Master Turned As A Hero | Sakshi
Sakshi News home page

జానీ మాస్టర్ హీరోగా సినిమా.. టైటిల్‌ ఇదే!

Published Sun, Jul 2 2023 4:35 PM | Last Updated on Sun, Jul 2 2023 4:35 PM

Jani Master Turned As A Hero - Sakshi

ప్రముఖ కొరియోగ్రాఫర్, తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్‌కి కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్‌ హీరోగా మారాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రన్నర్‌’. పోలీసు బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంతో విజయ్ చౌదరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అరవింద్ 2' చిత్ర నిర్మాతలు విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం. శ్రీహరి విజయ ఢమరుక ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ వెల్లడించడంతో పాటు ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

పోలీస్ నేపథ్యంలో తండ్రీ కుమారుల మధ్య అనుబంధంతో సాగే కథతో సినిమా రూపొందిస్తున్నామని చిత్ర బృందం తెలియజేసింది. 'రన్నర్' ఫస్ట్ లుక్ చూస్తే... ఖాకీ ప్యాంట్ వేసిన జానీ మాస్టర్, షర్టులో వేరియేషన్ చూపించారు. ఒకవైపు ఖాకి ఉంటే... మరోవైపు ఖద్దర్ ఉంది. ఎందుకు అలా డిజైన్ చేశారు? ఆయన ఎవరికి నమస్తే పెడుతున్నారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.    

చిత్రదర్శకుడు విజయ్ చౌదరి మాట్లాడుతూ 'ఇదొక డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా. మణిశర్మ గారు అద్భుతమైన బాణీలు అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన ట్యూన్లకు జానీ మాస్టర్ వేసే స్టెప్పులు అదిరిపోతాయి. ఇతర నటీనటులు, మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తాం’అన్నారు.

 హైదరాబాద్ నగరంలో కొన్నాళ్ళ క్రితం జరిగిన వాస్తవ ఘటనలు, సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేశాం'అని చిత్ర నిర్మాతలు విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం. శ్రీహరి  అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement