అవినాష్‌నే ఏడిపించావు, సిగ్గుండాలి: సోహైల్‌ | Bigg Boss 4 Telugu: Sohel Won Patience Task And Talk With Audience | Sakshi
Sakshi News home page

బొమ్మ లొల్లి: శోకాలు పెట్టిన టామ్ అండ్ జెర్రీ

Published Wed, Dec 9 2020 11:35 PM | Last Updated on Wed, Dec 9 2020 11:36 PM

Bigg Boss 4 Telugu: Sohel Won Patience Task And Talk With Audience - Sakshi

బొమ్మ కోసం టామ్ అండ్ జెర్రీ మ‌ధ్య‌ లొల్లి జ‌రిగింది. టాస్క్‌లో భాగంగా ఆమె బొమ్మ‌ను నీళ్ల‌లో వేసినందుకు అరియానా సోహైల్ మీద మండిప‌డింది. దీంతో అత‌డూరుకుంటాడా! నువ్వు క్రూరంగా ఏ టాస్కు చేయ‌లేదా? అని ఆమె అరాచ‌కాల‌ను గుర్తు చేశాడు. తీవ్ర స్థాయిలో జ‌రిగిన ఈ గొడ‌వ కార‌ణంగా ఇద్ద‌రూ క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. మ‌రి వీరి గొడ‌వ ఎలా మొద‌లైంది? ఎలా ఎండ్ అయ్యింది? అనేది తెలియాలంటే ఈ బిగ్‌బాస్‌ స్టోరీ చ‌దివేయండి..

నా ఎమోష‌న్‌తో ఆడుకున్నావు
ఓపిక టాస్క్‌లో రోబోలా కూర్చున్న సోహైల్‌పై అరియానా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. త‌న బొమ్మ(చింటూ)‌ను పాడు చేయాల‌నుకున్నావంటూ తిట్టిపోసింది. చింటూను నీళ్ల‌లో ప‌డేసి ఎమోష‌న్‌తో ఆడుకున్నావంటూ ఎన్నెన్నో మాట్లాడింది. టాస్క్‌లో ఉన్నందున సోహైల్ ఏ ప్ర‌శ్న‌కూ స‌మాధానమివ్వ‌లేదు. కానీ బ‌జ‌ర్ మోగిన మ‌రు నిమిషం అరియానాకు రివ‌ర్స్ కౌంట‌రిచ్చాడు. నువ్వు టాస్క్ చేస్తే ఒప్పు, అదే టాస్క్ మేము చేస్తే త‌ప్పా అని నిల‌దీశాడు. నువ్వు మోనాల్‌కు గుడ్డు కొట్టిన‌ప్పుడు ఏమీ అనిపించనిది, ఇప్పుడు నీ బొమ్మ‌ను ప‌ట్టుకుంటే వ‌చ్చిందా? అని తిరిగి ప్ర‌శ్నించాడు. దీంతో ఆవేశం పొంగుకొచ్చిన‌ అరియానా నాతో పెట్టుకోవ‌ద్దు అని వార్నింగ్ ఇచ్చింది.(చ‌ద‌వండి: మోనాల్ వ‌ల్ల గేమ్ డిస్ట‌ర్బ్ అవుతోంది..)

అవినాష్‌నే ఏడిపించావు..
ఈ వార్నింగ్‌తో మ‌రింత రెచ్చిపోయిన సోహైల్‌.. తొక్క‌లో బొమ్మ కోసం నిన్ను అంత బాగా చూసుకున్న అవినాష్‌నే ఏడిపించావు. నువ్వు మాట్లాడ‌కు అని హెచ్చ‌రించాడు. సిగ్గుండాలి అంటూ‌ అరియానా మీద నోరు జారాడు. బేబీ కేర్ అప్పుడు ఎంత టార్చ‌ర్ పెట్టావు అని గుర్తు చేశాడు. ఇద్ద‌రూ హోరాహోరీగా పోట్లాట‌కు దిగ‌గా నేను త‌ప్పు చేస్తే ఇక్క‌డ ఎందుకుంటాను? అంటూ అరియానా ఏడ్చేసింది. సోహైల్ అగ్రెసివ్ బిహేవియ‌ర్ నేను తీసుకోలేక‌పోతున్నా అంటూ కేక‌లు పెడుతూ త‌న‌ ఎమోష‌న్స్‌తో ఆడుకుంటున్నారంటూ శోకాలు పెట్టింది. దీంతో అభి వెళ్లి ఆమెను ఓదార్చాడు. మోనాల్ కూడా ఆమెను ఓదార్చేందుకు ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌గా.. నాకు రియాలిటీ అర్థ‌మైందంటూ అరియానా దండం పెట్టి అక్క‌డ నుంచి వెళ్లిపోయింది. (చ‌ద‌వండి: వారిద్దరిలో ఎవరు గెలిచినా నాకు ఓకే : నాగబాబు)

గొడ‌వ‌ను ఇక్క‌డితో వ‌దిలేస్తా
మ‌రోవైపు 'ఓపిక' టాస్క్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వ‌కుండా ఉండ‌టంలో అభి పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. కానీ అంద‌రినీ న‌వ్వించాడు. మొత్తానికి ఈ టాస్కులో ఒక్క‌ ఎక్స్‌ప్రెష‌న్ ఇవ్వకుండా విగ్ర‌హంలా ఉండిపోయిన‌‌ సోహైల్ గెలిచాడు. దీంతో అత‌డు ప్రేక్ష‌కుల‌తో మాట్లాడే అవ‌కాశాన్ని కొట్టేశాడు. "18 సంవ‌త్స‌రాల‌కే ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. కానీ ప‌దేళ్లు అవుతున్నా గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్ క‌ప్పు కొట్టాల‌న్న‌దే నా ల‌క్ష్యం. నా కోపం మీకు న‌చ్చ‌క‌పోతే క్ష‌మించండి. కానీ నేను మీ మ‌న‌సుల్లో ఉండిపోవాలి" అని వీక్ష‌కుల‌కు సందేశ‌మిచ్చాడు. త‌న కోపం గురించి చెప్తూ అదే త‌న‌ మైన‌స్ అని, కానీ ఊరికే రాద‌ని స్ప‌ష్టం చేశాడు. అరియానాకు చిన్న స‌మ‌స్య అనిపించినా నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతుందని వాపోయాడు. కానీ ఆమెతో జ‌రిగిన గొడ‌వ‌ను ఇక్క‌డితో వ‌దిలేస్తాన‌‌ని స్ప‌ష్టం చేశాడు. త‌ర్వాత త‌న లోప‌ల ఉన్న బాధనంతా అఖిల్‌తో చెప్పుకుని మ‌న‌సు తేలిక చేసుకున్నాడు.

ఒక అబ్బాయి నా మీద‌మీద‌కు వ‌చ్చాడు
మ‌రోవైపు అరియానా మాత్రం అదే గొడ‌వ‌ను ప‌ట్టుకుని వేలాడింది. ఒక అబ్బాయి నా మీద‌ మీద‌కు వ‌చ్చాడంటూ వాష్‌రూమ్‌లో మ‌రోసారి ఏడ్చింది. నా లైఫ్‌లో మొద‌టి సారి అబ్బాయి అలా పైపైకి గొడ‌వ‌కు రావ‌డ‌మ‌ని చెప్పింది. దీంతో అఖిల్ వెళ్లి సోహైల్‌ను బ్యాడ్ చేయొద్ద‌ని సూచించాడు. నువ్వు కూడా అత‌డి పైపైకి వెళ్లావని, త‌ప్పంతా అతడిపైకి తోసేయొద్దు అని చెప్పాడు. ఇది న‌చ్చ‌ని అరియానా నాకు అనిపించింది చెప్తాను, నువ్వు విన‌కంటూ అత‌డికి తేల్చి చెప్పింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అప్పుడు రాహుల్‌, ఇప్పుడు అఖిల్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement