దొంగ‌త‌నంగా వాళ్లింట్లో అన్నం తినేదాన్ని | Bigg Boss 4 Telugu: Monal Sister Strong Advice To Abhijeet | Sakshi
Sakshi News home page

అభిజిత్‌కు క్లాస్ పీకిన‌ మోనాల్ సోద‌రి

Published Thu, Nov 19 2020 11:11 PM | Last Updated on Fri, Nov 20 2020 1:11 PM

Bigg Boss 4 Telugu: Monal Sister Strong Advice To Abhijeet - Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లోకి నేడు కూడా కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ ఎంట్రీ ఇచ్చాయి. ఇక‌ త‌న ఫ్రెండ్ క‌ళ్లెదురుగా క‌నిపించ‌డంతో అరియానా కాళ్లు నేల మీద ఆగ‌లేవు. ఇక సోహైల్ తండ్రికి సంతోషంతో ఏం మాట్లాడాలో తోచ‌లేదు. తండ్రి క‌ళ్ల‌లో ఆనందం చూసిన సోహైల్‌ ఇది చాలు నాకంటూ పొంగిపోయాడు. అయితే మోనాల్ త‌ల్లి రావ‌ట్లేదంటూ ఆమె ఎమోష‌న్స్‌తో ఆడుకున్న బిగ్‌బాస్ త‌ర్వాత ఆమె చెల్లిని పంపించాడు. వ‌చ్చీరావ‌డంతోనే ఆమె అభిజిత్‌కు క్లాస్ పీకింది. చివ‌ర్లో మోనాల్‌తో బాగా మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించ‌మ‌ని స‌ల‌హా ఇచ్చింది. దీంతో అత‌డు కాస్త దిగులు చెందాడు. మ‌రి అస‌లు ఆమె ఏమ‌ని చెప్పిందో తెలుసుకోవాలంటే దీన్ని చ‌దివేయండి..

ఫస్ట్ టైమ్ అమ్మ ఐ ల‌వ్ యూ చెప్పింది
అమ్మ మొద‌టిసారి నాకు ఐ ల‌వ్ యూ చెప్పింద‌ని అఖిల్ హ్యాపీగా ఫీల‌య్యాడు. అమ్మ త‌న పేరును ప‌చ్చ‌బొట్టు పొడిపించుకుంద‌ని త‌ను చాలా పొసెసివ్ అని మోనాల్‌తో చెప్పుకొచ్చాడు. అందుకే నీతో ఎక్కువ‌గా మాట్లాడ‌లేదని తెలిపాడు. ఇక క‌మాండ్స్ ట్రైనింగ్ సెంట‌ర్‌ గేమ్‌లో బిగ్‌బాస్ ఇంటిస‌భ్యుల‌తో ఆడుకుంటే సోహైల్ మాత్రం అవినాష్‌తో ఆడుకున్నాడు. కానీ అవినాష్ మాత్రం ఏ అవ‌కాశం దొరికినా వ‌దిలి పెట్ట‌కుండా మోనాల్ ద‌గ్గ‌ర పాట‌లు పాడుతూ పులిహోర క‌లిపాడు. అనంత‌రం అరియానా స్నేహితుడు విన‌య్ హౌస్‌లోకి వ‌చ్చాడు. అత‌న్ని చూడ‌గానే అరియానా గుక్క‌పెట్టి ఏడ్చేసింది. (దివిని పెళ్లి చేసుకుంటా: మెహ‌బూబ్‌)

తిండి కోసం అత‌డి ఇంటికి వెళ్లాను: అరియానా
విన‌య్ వేరేవాళ్ల‌ను ప‌ల‌క‌రిస్తే కూడా స‌హించ‌లేక‌పోయింది. త‌న‌తోనే మాట్లాడ‌మ‌ని అరిచి గీ పెట్టింది. 'గ‌తేడాది నువ్వొక‌టి అన్నావు, గుర్తుందా? పాప నువ్వు బిగ్‌బాస్‌కు వెళ్తే డొక్కు కారు అద్దెకు తెచ్చి డ్యాన్స్ చేయిస్తా అన్నావు' అన‌గానే దాన్ని త‌ప్ప‌కుండా నెర‌వేరుస్తా అని హామీ ఇచ్చాడు. అలాగే త‌న‌కు బ‌ట్ట‌లు, చెప్పులు పంపించ‌మంటూ చాంతాడంత లిస్టు చెప్పుకొచ్చింది. త‌మ‌ది 12 ఏళ్ల స్నేహ‌మ‌ని. త‌న క‌ష్ట‌సుఖాల్లో ప్ర‌తిసారి ఇత‌డే ఉన్నాడ‌ని తెలిపింది. అన్నం లేని స‌మ‌యంలో దొంగ‌లాగా అత‌ని ఇంటికి వెళ్లి తినేదాన్ని అని చెప్తూ ఐ ల‌వ్ యూ విన‌య్ అంటూ సంతోషంతో గెంతులు వేసింది. (ఇక నుంచి నామినేట్ చేయ‌కండి: అభి అభ్య‌ర్థ‌న‌)

బిగ్‌బాస్‌.. నాకు కోపం వ‌స్తుంది
త‌ర్వాత మోనాల్ అమ్మ వాయిస్ వినిపించారు. మోనాల్ పాపా ఎలా ఉన్నావు, నువ్వు చాలా గుర్తొస్తున్నావు. హైద‌రాబాద్‌కు రాలేక‌పోయాము అని చెప్పింది. దీంతో త‌ల్లి రావ‌ట్లేద‌ని తెలిసి గుండెలవిసేలా రోదించిన మోనాల్‌ను ఓదార్చ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాలేదు. నాత‌న సోద‌రి వ‌స్తుంది క‌దూ.. నా ఎమోష‌న్స్‌తో ఆడుకోకు బిగ్‌బాస్‌.. నాకు కోపం వ‌స్తుంది అంటూ ఏదో ఒక‌టి చెప్ప‌మ‌ని బిగ్‌బాస్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఆ వెంట‌నే మోనాల్ సోద‌రిని లోనికి పంపించ‌గా ఆమెను చూసి క‌న్నీళ్లు పెట్టుకుంది.

మోనాల్ సోద‌రి మాట‌ల‌కు హ‌ర్టైన అభి
నా గురించి అఖిల్ గురించి చెడుగా అనుకోవ‌ట్లేదు క‌దా అని మొద‌టి ప్ర‌శ్న‌ అడ‌గ‌డంతో ఆమె ఏం చెప్పాలో అర్థం కాక ఓ క్ష‌ణ‌మాగి అలాంటిదేమీ లేద‌ని చెప్పుకొచ్చింది. సోహైల్‌తో నువ్వంటే ఇష్ట‌మ‌ని చెప్పింది. అవినాష్‌ను అంద‌రితో పులిహోర క‌లిపేయ‌డ‌మే నీ ప‌నా అని కౌంట‌ర్ ఇచ్చింది. ఏదైనా మాట్లాడేది ఉంటే ముందే మాట్లాడ‌మ‌ని అభిజిత్‌కు స‌ల‌హా ఇచ్చింది. అలాగే మోనాల్‌తో ఎక్కువ‌గా మాట్లాడ‌మ‌ని చెప్పింది. ఇక‌ ప్ర‌తిదానికి ఏడిస్తే కొడ‌తాన‌ని మోనాల్‌కు వార్నింగ్ ఇచ్చి వీడ్కోలు తీసుకుంది. అఖిల్‌తో స‌రిగా మాట్లాడలేదు. మ‌రోవైపు మోనాల్ సోద‌రి చెప్పిన మాట‌ల‌కు అభి హ‌ర్ట్ అయిన‌ట్లు క‌నిపించాడు. (అభి, నీ బ్ర‌ద‌ర్‌ను బాగా చూసుకో: అఖిల్ అమ్మ‌)

సోహైల్‌ను తాత అని పిలుస్తాం..
త‌ర్వాత సోహైల్ తండ్రి స‌లీమ్‌ లోనికి వ‌చ్చాడు. సింగ‌రేణి ఒక్క‌టే కాదు. ప‌ల్లె గిల్లా అంతా మ‌న‌దే, బ‌య‌ట క‌థ వేరే ఉంద‌ని ఆయ‌న గ‌ర్వంగా చెప్పుకొచ్చాడు. వీడు మా తాత‌లాగే ఉంటాడ‌ని, అందుకే సోహైల్‌ను తాత అని పిలుస్తామ‌ని తెలిపాడు. ఒక‌రిపై ఒక‌రు ముద్దులు కురిపించుకున్న త‌ర్వాత‌ జై సింగ‌రేణి నినాదాల‌తో ఆయ‌న‌కు అంద‌రూ వీడ్కోలు తెలిపారు. త‌ర్వాత మోనాల్‌, లాస్య, సోహైల్‌.. అఖిల్‌ను అమ్మాయిలా అందంగా రెడీ చేస్తూ ఆట‌ప‌ట్టించారు. (బిగ్‌బాస్‌: 'క‌రివేపాకు'కు అభిజిత్ ఫ్యాన్స్ వార్నింగ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement