మోనాల్ మ‌న‌సులో నేనున్నా అంది: అభి | Bigg Boss 4 Telugu: Monal Said She Likes Me Says Abhijeet | Sakshi
Sakshi News home page

మోనాల్ గుట్టు ర‌ట్టు చేసిన అభిజిత్‌

Published Thu, Dec 3 2020 11:15 PM | Last Updated on Fri, Dec 4 2020 9:26 PM

Bigg Boss 4 Telugu: Monal Said She Likes Me Says Abhijeet - Sakshi

కెట్ టు ఫినాలే రేసు నేడు మూడో లెవ‌ల్‌లోకి అడుగుపెట్టింది. ఈసారి బిగ్‌బాస్‌ ఫిజిక‌ల్ టాస్కు లాంటివి కాకుండా స‌హ‌నానికి, ఓపిక‌కు ప‌రీక్ష పెట్టాడు. ఉయ్యాలో ఊగ‌మ‌ని చెప్పాడు. విన‌డానికి ఓస్ ఇంతేనా అనిపించినా, అది అంత ఈజీ కాదు. పూట‌కోసారి తీసుకొచ్చే జ్యూసులు తాగుతూ చ‌లిలో కూర్చున్న‌చోటు నుంచి క‌ద‌ల‌కూడ‌దు అంటే మాట‌లు కావు. పొట్ట ఉబ్బి అవ‌స్థ ప‌డుతూ ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూస్తారు. ఈ టాస్కులో ఇద్ద‌రు స్నేహితులూ ప‌ట్టువిడ‌వ‌కుండా ఉయ్యాల మీదే ఉండిపోయారు. ఇక అభిజిత్ మోనాల్ గుట్టును బ‌య‌ట‌పెట్టాడు. ఆ వివ‌రాల‌న్నీ తెలియాలంటే ఈ స్టోరీని చ‌దివేయండి..

అవినాష్‌- బ్ర‌ద‌ర్ ఆఫ్ మోనాలి
'టికెట్ టు ఫినాలే' రేస్‌ మూడో లెవ‌ల్‌లో అఖిల్‌, సోహైల్‌ ఊయ‌ల‌పై కూర్చుని పాట‌లు పాడుకున్నారు, స‌ర‌దాగా కొట్టుకున్నారు కూడా! ఈ టాస్క్‌కు సంచాల‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన‌ అభిజిత్ అఖిల్‌కు ఎండ కొడుతుంటే కాసేపు అత‌డికి నీడ‌లా నిల‌బ‌డ్డాడు. ఈ ఇద్ద‌రినీ 48 గంట‌లు ఉయ్యాల మీద నుంచి దింప‌కండ‌ని అవినాష్ త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతూ బిగ్‌బాస్‌ను అభ్య‌ర్థించాడు. త‌ర్వాత మోనాల్‌ను వెంటేసుకుని అవినాష్ బ‌య‌ట‌కు రావడాన్ని చూసిన అఖిల్‌.. అత‌డు మీ త‌మ్ముడా అని మోనాల్‌ను అడిగాడు. అందుకు హ‌ర్ట్ అయిన అవినాష్ నేను నీకు అన్న‌య్య‌నా? అవినాష్‌నా? అని అడ‌గ్గా మోనాల్ అవినాష్ అన్న‌య్య అని ట‌పీమ‌ని చెప్పేసింది. దీంతో త‌లెక్క‌డ పెట్టుకోవాలో తెలీక అవినాష్ కాసేపు అవ‌మానంతో చ‌చ్చిపోయాడు. వీరి రిలేష‌న్‌కు అఖిల్ "బ్ర‌ద‌ర్ ఆఫ్ మోనాలి" అని టైటిల్ కూడా ఇచ్చేశాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అవినాష్‌కు గడ్డు కాలం?)

ఇద్ద‌రి మ‌ధ్య ఫిట్టింగ్ పెట్టిన బిగ్‌బాస్‌
పోటీదారుల‌ను తిప్ప‌లు పెట్టేందుకు బిగ్‌బాస్ పాల‌ను పంపించాడు. అఖిల్‌కు పాలు తాగ‌డం అల‌వాటు లేక‌పోయినా త‌ప్పక తాగాడు. త‌ర్వాత కూర్చున్న‌ద‌గ్గ‌రే ప‌ర‌దాలు చుట్టి వాష్‌రూమ్‌కు వెళ్లారు. రాత్రి బిగ్‌బాస్ తుపాకీ పేలుడు శ‌బ్ధాలు చేయ‌డంతో అంద‌రూ ఉలిక్కిప‌డ్డారు. కానీ అఖిల్‌, సోహైల్ మాత్రం కూర్చున్న‌చోట నుంచి అంగుళం కూడా క‌ద‌ల్లేదు. వీరు భ‌య‌ప‌డ‌టం లేద‌ని తెలుసుకున్న బిగ్‌బాస్ ఈసారి కొట్టుకుని చావండంటూ ఇద్ద‌రి మ‌ధ్య ఫిట్టింగ్ పెట్టాడు. ముల్లంగి ర‌సాన్ని ఒక‌రికి ఒక‌రు చెంచాతో తాగించుకోమ‌ని చెప్పాడు. అయితే తాగించే స‌భ్యుడు త‌ను ఉయ్యాల మీద ఉండ‌టానికి ఎందుకు అర్హుడు? ఎదుటివాడు ఎందుకు అన‌ర్హుడు? అన్న విష‌యాన్ని చెప్పాల‌ని ఆదేశించాడు.  ఈ క్ర‌మంలో ఇద్ద‌రికీ చిన్న‌పాటి గొడ‌వ జ‌రిగింది. త‌ర్వాత ఇదంతా కాద‌ని చిన్న‌చిన్న కార‌ణాలు చెప్తూ జ్యూస్ తాగించుకున్నారు. అక్క‌డే ఉన్న అరియానా మ‌ధ్య‌లో దూరి మీరు చెప్పే కార‌ణాలు స‌రిగా లేవ‌ని విమ‌ర్శించింది. దీంతో ఇద్ద‌రూ ఏక‌మై మాలో ఇద్ద‌రం అర్హులమే, అందుకే చిన్న‌చిన్న‌వి అయినా లెక్క‌లోకి తీసుకుంటున్నామ‌ని క్లారిటీ ఇఇస్తూ ఆమె నోరు మూయించారు. (చ‌ద‌వండి: హారిక బెస్ట్ కెప్టెన్ కానే కాదు: నాగార్జున‌)

హారిక మీద సీరియ‌స్ అయిన అభి
హారిక.. త‌నకు నాగ్ క్లాస్ పీకిన విష‌యాన్ని అభిజిత్ ముందు ఏక‌రువు పెట్టింది. ఒక కెప్టెన్‌గా మోనాల్‌తో డేట్‌కు వెళ్లాల్సిన టాస్క్ నీతో చేయించ‌క‌పోవ‌డం త‌ప్పని నాగ్ స‌ర్ చెప్పార‌ని బాధ‌ప‌డింది. దీంతో అభిజిత్ క‌ల‌గ‌జేసుకుంటూ ఎన్నో రోజులుగా త‌న గుండెలో దాచుకున్న నిజాన్ని బ‌య‌ట‌కు వెల్ల‌డించాడు. 'నేనంటే ఇష్ట‌మ‌ని మోనాల్ స్వ‌యంగా నాతో చెప్పింది. త‌ర్వాత‌ ప్ర‌తిసారి ఆమె మ‌న‌సులో ఒక A ఉందంటున్నారు క‌దా! ఆ A ఎవ‌రు అని అడిగితే నేనే అంది. కానీ ఇది ఎప్పుడూ అంద‌రి ముందు బ‌య‌ట పెట్ట‌లేదు. అయినా స‌రే ఆమె నాకు స్టాండ్ తీసుకోలేదు, ఇంకా నామినేట్ చేసింది' అని త‌న బాధను బ‌య‌ట‌కు కక్కాడు. అయితే అత‌డు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే.. హారిక తెలుగు తెలుగు అని ప‌దే ప‌దే గుర్తు చేసింది. దీంతో చిర్రెత్తిన అభి.. నువ్వు నాతో మాట్లాడాలంటే ఇంకో 5 సంవ‌త్స‌రాలు ఎద‌గాలి అన్నాడు. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు అని మండిప‌డ్డాడు. (బిగ్‌బాస్‌ : ఆ ఇద్దరికే నా సపోర్ట్‌.. నాగబాబు)

అవినాష్ మీద అరియానా తిట్ల పురాణం
ఇక టాస్క్ జ‌రిగేట‌ప్పుడు లైట్లు ఆర్పేయ‌మ‌ని బిగ్‌బాస్ తేల్చి చెప్ప‌డంతో కంటెస్టెంట్లు జాగ‌ర‌ణ చేశారు. అఖిల్ అరియానాతో పులిహోర క‌లుపుతున్నాడ‌ని హారిక మోనాల్ చెవిలో ఊదింది. ఇదెప్పుడు జ‌రిగింద‌ని మోనాల్ అవాక్కైంది. అవినాష్ జోకులు పేల్చుతూ అరియానా మీద కూడా జోకేశాడు. దీంతో ఆమె వ‌చ్చి అవినాష్‌కు నాలుగు త‌గిలించ‌డ‌మే కాక‌ అత‌డి మీద కొత్త కొత్త బూతుల‌ను ప్ర‌యోగించింది. ఇక తెల్ల‌వారు కోడి కూసే వేళ‌కు కూడా అఖిల్‌, సోహైల్ ఉయ్యాల మీద‌నే ఉన్న‌ట్లు చూపించారు. స‌హ‌నంతో కాలాన్ని నెట్టుకొచ్చిన ఈ ఇద్ద‌రు రేప‌టి ఎపిసోడ్‌లో మాత్రం ఉయ్యాల మీద నుంచి కింద‌కు దిగిన‌ట్లు తెలుస్తోంది. సోష‌ల్ మీడియా టాక్ ప్ర‌కారం అఖిల్ గెలిచాడా? లేదా సోహైలా? అన్న విష‌యం రేపు తేలనుంది. (చ‌ద‌వండి: సిటీకి దూరంగా నోయల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement