అఖిల్ బ‌ర్త్‌డే: ముద్దులు కురిపించిన మోనాల్‌ | Bigg Boss 4 Telugu: Akhil Birthday Celebrated In House | Sakshi
Sakshi News home page

మొద‌టిసారి నాకు ముద్దు పెట్టావు: అఖిల్‌

Published Tue, Nov 17 2020 11:22 PM | Last Updated on Wed, Nov 18 2020 1:33 PM

Bigg Boss 4 Telugu: Akhil Birthday Celebrated In House - Sakshi

క్ర‌మ‌శిక్ష‌ణ లేకుండా పోయిన హౌస్‌ను బిగ్‌బాస్‌ క‌మాండో ఇన్‌స్టిట్యూట్‌గా మార్చాడు. ఇది టాస్క్ కాదు శిక్ష అనేట్టుగా వారితో స‌క‌ల‌‌ ఆట‌లు ఆడించాడు. ప‌డుతూ లేస్తూ, న‌వ్వుతూ తుళ్లుతూ, ఆయాస‌ప‌డుతూ ఆటాడుతూ చ‌చ్చిన‌ట్లు బిగ్‌బాస్ చెప్పిన‌ట్లు న‌డుచుకుంటున్నారు. మ‌రోవైపు నామినేష‌న్ ప్ర‌క్రియ రోజు నిప్పులు తొక్కిన కంటెస్టెంట్ల ఆవేశం నేడు చ‌ల్లారిన‌ట్లు క‌నిపిస్తోంది. గొడ‌వ‌లు ప‌క్క‌న‌పెట్టి తిరిగి ఎప్ప‌టిలాగే మాట్లాడుకున్నారు. మ‌రి నేటి బిగ్‌బాస్ షోలోని 73వ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో చ‌దివేయండి..

క‌మాండోలుగా మారిన కంటెస్టెంట్లు
బిగ్‌బాస్ ఇల్లు క‌మాండో ఇన్‌స్టిట్యూట్‌గా మారింది. ఈ టాస్క్‌లో యూనిఫామ్ ధ‌రించిన ఇంటిస‌భ్యులు కొన్ని డ్రిల్స్ చేయాలి. అఖిల్‌ కేడ‌ట్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించారు. ట్రంపెట్ సౌండ్ వ‌స్తే మార్చి ఫాస్ట్‌, ఎక్స‌ర్‌సైజ్‌, గ‌న్‌షాట్స్ వ‌స్తే దాక్కోవ‌డం, ప‌వ‌ర్ సేవ్ అన‌గానే ఫ్రీజ్ అవ‌డం, స్లో మోష‌న్ అన్న‌ప్పుడు స్లో మోష‌న్‌లో, ఫాస్ట్ ఫార్వ‌ర్డ్ అన్న‌ప్పుడు ఫాస్ట్ ఫార్వ‌ర్డ్‌లో, డ్ర‌మ్ రోల్స్ వ‌స్తే నేల‌పై పాక‌డం వంటివి అన్నీ చేయాలి. బ‌జ‌ర్ మోగిన‌ప్పుడు దాన్ని ముందుగా కొట్టే వ్య‌క్తి ఒక ఛాలెంజ్ చేసే అవ‌కాశం పొందుతారు. ఇలా నాలుగు సార్లు బ‌జ‌ర్ మోగుతుంది. ఒక‌సారి ఛాలెంజ్ పూర్తి చేసిన వ్య‌క్తికి మ‌రోసారి బ‌జ‌ర్ కొట్టే అవ‌కాశం లేదు. (చ‌ద‌వండి: కెప్టెన్ అఖిల్‌: ఆ ముగ్గురికీ దుమ్ము దులిపాడు)

పోరాడి ఓడిన సోహైల్‌
టాస్క్ మొద‌ల‌వ‌గానే బిగ్‌బాస్ చెప్పిన‌ట్టుగా ఆడుతూ ఎంజాయ్ చేశారు. కానీ ప‌దేప‌దే స్టంట్లు చేసేందుకు మాత్రం తెగ ఆయాస‌ప‌డ్డారు. మొద‌టి బ‌జ‌ర్ మోగ‌గానే సోహైల్ అన్నింటిక‌న్నా క‌ఠిన‌మైన‌ ఛాలెంజ్ స్వీక‌రించాడు. ఇందులో సోహైల్ స్విమ్మింగ్ పూల్‌లో ఒక‌వైపున ఉన్న బ‌రువైన వ‌స్తువుల‌ను మ‌రోవైపుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మెహ‌బూబ్ కోసం ఈ ఆటాడుతున్నాన‌ని చెప్పిన సోహైల్ చివ‌రికి ఓడిపోవ‌డంతో ఎమోష‌న‌ల్ అయ్యాడు. త‌ర్వాత బ‌జ‌ర్ కొట్టిన అఖిల్‌.. పోల్‌ను వాటేసుకుని కిందకు దిగ‌కూడ‌ద‌న్న స‌వాలు స్వీక‌రించి విజ‌యం సాధించాడు. (చ‌ద‌వండి: బిగ్‌ స‌ర్‌ప్రైజ్‌: హౌస్‌లోకి కంటెస్టెంట్ల‌ ఫ్యామిలీ‌స్‌!)

ఇక నుంచి నామినేట్ చేయ‌కండి: అభి
త‌ర్వా‌తది నువ్వే కొట్టాల‌ని హారిక అభిజిత్‌కు చెప్పింది. అనుకున్న‌ట్లుగానే అభి బ‌జ‌ర్ కొట్టి మంకీ బార్ ఛాలెంజ్ స్వీక‌రించి గెలుపొందాడు. 100 శాతం ఇస్తున్నా క‌దా, ఈ సారి న‌న్ను నామినేట్ చేయ‌కండి అని అభి అభ్య‌ర్థించాడు. మ‌రోవైపు అవినాష్‌ స‌రిగా దాక్కోలేద‌ని అభిజిత్ ఫిర్యాదు చేయ‌గా అవున‌ని అరియానా స‌మ‌ర్థించింది. దీంతో అవినాష్‌, అరియానా కొట్టుకు చచ్చారు. నాకెవ్వ‌రితో మాట్లాడాల్సిన అవ‌స‌రం లేదు అని అరియానా స్ప‌ష్టం చేసింది. త‌ర్వాత బ‌జ‌ర్ కొట్టిన హారిక టైర్‌ను గార్డెన్ ఏరియాలో ప‌ది రౌండ్లు ఫ్లిప్ చేసే స‌వాలును స్వీక‌రించి పూర్తి చేసింది. (చ‌ద‌వండి: నాతో మ‌ర్యాద‌గా మాట్లాడు: అభిజిత్‌)

అఖిల్‌కు మోనాల్ రొమాంటిక్ గిఫ్ట్‌
అనంత‌రం రాత్రి పూట హౌస్‌లో అఖిల్ పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రిపారు. అఖిలే నం.1 అని కేక్ మీద రాసి బ‌ర్త్‌డే బాయ్‌తో కేక్ క‌ట్ చేయించారు. మొద‌ట ఎవ‌రికి తినిపిస్తాడు అన్న స‌స్పెన్స్‌కు తూట్లు పొడుస్తూ కేకు ముక్క తనే తిన్నాడు. త‌ర్వాత మోనాల్ అఖిల్‌ను హ‌త్తుకుని తొలిసారిగా ముద్దులు కురిపించింది. దీంతో గాల్లో తేలిపోయిన అఖిల్‌ రోజు నా బ‌ర్త్‌డే ఉంటే బాగుండ‌ని మ‌నసులోని మాట బ‌య‌ట‌పెట్టాడు. ఇక‌ ఈ సెల‌బ్రేష‌న్స్‌లో సోహైల్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. (చ‌ద‌వండి: ఎలిమినేష‌న్‌: సోహైల్‌కు షాకుల మీద షాకులు)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/6

2
2/6

3
3/6

4
4/6

5
5/6

6
6/6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement