ఒకప్పుడు నాగార్జున ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని అభిజిత్‌ను హెచ్చరించేవారు. కానీ ఇప్పుడు సీను మారింది. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దంటూ అఖిల్‌కు చీవాట్లు పెట్టారు. అఖిల్‌ను వెళ్లగొట్టినంత పని చేసి తిరిగి లోనికి పంపించారు. ఇక కంటెస్టెంట్ల కోసం నాగార్జున భార్య అమల డ్రైఫ్రూట్స్ పంపించగా, నాగ్ మటన్ పంపిస్తానని మాటిచ్చారు. మరి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి..
బిగ్‌బాస్ సంధించిన ప్రశ్నలు అర్థం చేసుకోరా?
కంటెస్టెంట్లు అందరూ జంటలుగా విడిపోయి నాగార్జున సాంగ్స్‌కు డ్యాన్స్ చేసి ఆయన్ను సర్‌ప్రైజ్ చేశారు. అందరితోపాటు అభిజిత్ కూడా డ్యాన్స్ బాగా చేశాడని నాగ్ మెచ్చుకున్నారు. అనంతరం తన భార్య అమల ఇచ్చిన బహుమతులను పంపించాడు. అందులో సంచుల కొద్దీ డ్రైఫ్రూట్స్ ఉండటంతో ఇంటిసభ్యులు సంతోషంతో ఎగిరి గంతేశారు. తర్వాత అఖిల్ ఎలిమినేషన్ గురించి మాట్లాడారు. బిగ్‌బాస్ మిమ్మల్ని ఒంటిగంటకు నిద్ర లేపి ఏకగ్రీవంగా ఒక పేరు చెప్పమన్నాడు. ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు? ఎవరు మీ గేమ్‌కు అడ్డుపడతారు? ఫైనల్స్‌కు మీకు అడ్డొచ్చేది ఎవరు? అని మూడు కండీషన్లు పెట్టారు. కానీ మీరందరూ మొదటి కండీషన్‌ను మాత్రమే పట్టుకుని వేలాడారు. అభిజిత్, లాస్య, హారిక ఎవరి పేరు వాళ్లే చెప్పుకోవడాన్ని కూడా తప్పు పట్టారు. ఈ చర్చతో హౌస్‌లో వాతావరణం వేడెక్కగా దాన్ని చల్లబరిచేందుకు గేమ్ ఆడించారు.
సెల్ఫ్‌డబ్బా కొట్టుకున్న హారిక
త్వరగా ఆరిపోయే చిచ్చుబుడ్డి, అందర్నీ షేక్ చేసే ఆటంబాంబు ఎవరు అని ఆటాడించారు. మెహబూబ్.. అరియానా చిచ్చుబుడ్డి, అభిజిత్ ఆటంబాంబు అని చెప్పాడు ఇక అరియానా.. చాలా ఎఫెక్టివ్‌గా కనిపించాలనుకుంటాడు, కానీ ఏమీ ఉండదని మెహబూబ్‌ను చిచ్చుబుడ్డి, దొంగ మొహపోడు అవినాష్ ఆటంబాంబు అని చెప్పుకొచ్చింది. సోహైల్.. అరియానా చిచ్చుబుడ్డి, అభి ఆటంబాంబ్ అని అభిప్రాయపడ్డాడు. మోనాల్.. సోహైల్ చిచ్చుబుడ్డి, అభి ఆటంబాంబ్ అని తెలిపింది. అభి.. సోహైల్ చిచ్చుబుడ్డి, మెహబూబ్ ఆటంబాంబు అని తెలిపాడు. హారిక.. సోహైల్ వేస్ట్‌గాడు, ఎవ్వరూ పట్టించుకోరు అంటూ అతడికి చిచ్చుబుడ్డి ఇచ్చింది. తానే ఆటంబాంబు అని సెల్ఫ్‌డబ్బా కొట్టుకుంది. సరే కానీ ఎవరికి ఇస్తావు అని నాగ్ కూడా విసుగు చెందుతూ ఆమెలా గెంతుతూ నాగ్ ఇమిటేట్ చేయడంతో కంటెస్టెంట్లు పడీ పడీ నవ్వారు.
అవినాష్, నువ్వు పెళ్లికి పనికి రావేమో
దీంతో బుంగమూతి పెట్టిన హారిక.. మెహబూబ్‌కు ఆటంబాంబు ఇచ్చింది. లాస్య.. సోహైల్‌కు చిచ్చుబుడ్డి, అభికి ఆటంబాంబు ఇచ్చింది. అవును కానీ లాస్యను ఆంటీ అని ఏడిపించారేంటి అంటూ నాగ్ ఆమెను పదే పదే ఆంటీ అని గుచ్చి గుచ్చి పిలిచారు. తర్వాత అవినాష్.. మోనాల్ చిచ్చుబుడ్డి, అరియానా ఆటంబాంబు అని చెప్పాడు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ నువ్వు ఆటంబాంబు ఇచ్చినా ఆమె పడదు అని తేల్చి చెప్పారు. దీంతో అవినాష్ తాము ఫ్రెండ్స్ మాత్రమేనని స్పష్టం చేశాడు. అయినా సరే నాగ్ మాత్రం నువ్వు పెళ్లికి పనికిరావేమో అని అవినాష్ మీద జోకేశారు. (చదవండి: అబ్బాయితో రిలేషన్‌లో ఉన్నా, కానీ బ్రేకప్ అయింది: హారిక)
చంటిపిల్లాడిలా ఏడ్చేసిన అఖిల్
సీక్రెట్ రూమ్‌లో ఉన్న అఖిల్‌తో నాగ్ మాట్లాడుతూ.. "నువ్వు ఫైటర్, మరి అంత ఈజీగా ఎందుకు వచ్చేశావు?" అని నాగ్ అనుమానం వ్యక్తం చేశారు. దీనికి అఖిల్ సమాధానమిస్తూ.. "ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంటును ఎందుకు పంపిస్తారు. వీక్ కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడిస్తారా? నన్ను పంపించరు అని నమ్మకముండే" అని చెప్పుకొచ్చాడు. దీనికి నాగ్ స్పందిస్తూ 'నీ అంచనా తప్పు. చాలా సీజన్లలో ఇలాగే కంటెస్టెంట్లను సీక్రెట్ రూమ్ నుంచే ఇంటికి పంపించేసిన సందర్భాలున్నాయి. నువ్వు బ్యాగు సర్దుకొని బయటకు వచ్చేయ్' అని ఆదేశించారు. దీంతో ఖంగు తిన్న అఖిల్ తనను పంపించొద్దని ప్రాధేయపడ్డాడు. దయచేసి పంపకండని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయినా సరే అంగీకరించని నాగ్ కంటెస్టెంట్లతో ఫొటో దిగి వచ్చేయ్ అని చెప్పాడు. (చదవండి: మాస్టర్ మీద కావాలని కాఫీ పోసిన హారిక)
అభిజిత్ ఆలోచన దిగజారిపోయింది..
ఈ విషయం తెలిసిన మోనాల్ అఖిల్‌కు బదులు తాను వెళ్లిపోతానంటూ ముందుకొచ్చింది. కానీ అది కుదరదని నాగ్ తేల్చి చెప్పారు. అనంతరం అఖిల్‌తో టాస్క్ ఆడించారు. ఇద్దరు ఫ్రెండ్స్, నలుగురు శత్రువుల పేర్లు చెప్పమన్నారు. దీంతో అఖిల్.. సోహైల్‌కు, మోనాల్‌కు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టాడు. అభి ఆమెను ఛీ కొట్టినా అతడు టాప్ 5లో ఉంటాడని మోనాల్ పాజిటివ్‌గా మాట్లాడేదని చెప్పాడు. ఇక అభిజిత్, లాస్య, హారిక, మెహబూబ్‌ను శత్రువుల జాబితాలో చేర్చాడు. మొదట అభిజిత్ గురించి మాట్లాడుతూ నీ ఆలోచన దిగజారిపోయింది అని విమర్శించాడు. "పచ్చకామెర్లు ఉన్నోడికి లోకమంత పచ్చగ కనిపిస్తదట. నువ్వు ఫేక్ అయితేనే నీకు వేరేవారు ఫేక్ అనిపిస్తారు" అని చెంపపెట్టుగా సమాధానమిచ్చాడు. (చదవండి: ఒక్కమాటతో మనసు దోచుకున్న మోనాల్)
నా మీద అలాంటి జోకులా, ఇది నీ ఎథిక్స్
"సింపథీ కార్డు ఎప్పుడు పని చేయదు అన్నావు. నువ్వెన్నిసార్లు వాడావు. నేను వెళ్లిపోయేటప్పుడు ఐ హేట్ యూ అని చెప్పావు. అసలు నన్నో ఫ్రెండ్‌గా ఎప్పుడు ఇష్టపడ్డావు" అని హారికను నిలదీశాడు. నేను లేనప్పుడు నా మీద జోక్స్ వేశావు. అది నీ మెచ్యూరిటీ, ఎథిక్స్ అని లాస్యను విమర్శించాడు. ఎప్పుడూ నీకే అన్నీ చేయాలి అంటే ఎవరూ ఏం చేయరు అని మెహబూబ్‌కు బోధించాడు. తర్వాత లాస్య తన జోక్‌కు హర్ట్ అయినందుకు సారీ చెప్పగా హారిక మొదటి సారి ఐ లవ్‌యూ అని అఖిల్‌తో చెప్పింది. అనంతరం అఖిల్ హౌస్‌లోనే ఉంటున్నాడని నాగ్ స్పష్టం చేయడంతో సోహైల్, మోనాల్ తెగ సంతోషపడ్డారు. తర్వాత అఖిల్‌కు బంపరాఫర్ ఇచ్చారు. రెండు కుండలు పెట్టి అందులో ఒకదాంట్లో నామినేషన్, మరొకదాంట్లో కెప్టెన్సీ ఉంటుందని చెప్పాడు. అఖిల్ చేయి పెట్టిన కుండలోకెప్టెన్ ట్యాగ్ ఉండటంతో తర్వాతి వారం ఇమ్యూనిటీ పొందాడు. తర్వాత అభిజిత్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. చివర్లో రెండు కిలోల మటన్ పంపించండని అవినాష్ నాగ్‌ను అభ్యర్థించాడు. దీంతో అతడి విన్నపాన్ని ఆలకించిన నాగ్ తప్పకుండా పంపుతానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment