
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్‌ను రెండో రన్నరప్ సోహైల్ స్వీకరించాడు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని పార్క్‌లో సోహైల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ.. ప్రకృతి మనకు చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు. అలసిపోయి వచ్చిన పచ్చని చెట్టు కింద కూర్చుని పచ్చడి మెతుకులు వేసుకొని తింటే ఆ ఆనందమే వేరు ఉంటుందని పేర్కొన్నారు. మనం ఇప్పుడు మంచి నీటిని డబ్బులు ఇచ్చి కోనుకుంటున్నామని, రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొనుక్కొనే పరిస్థితి రాకుడదంటే బాధ్యతగా మనం అందరం మొక్కలు నాటాలని సోహైల్ కోరారు. చదవండి: హీరోగా ఎంట్రీ.. సోహైల్ కొత్త సినిమా ఫిక్స్!
దయచేసి నన్ను అభిమానించే అందరూ మొక్కలు నాటి ఎంపీ సంతోష్ కుమార్, నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేయగలరు అని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తను మరో ముగ్గురికి( అరియానా, మెహబూబ్, అఖిల్) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు ఈ సందర్భంగా సోహైల్‌కు వృక్షవేదం పుస్తకాన్ని అందజేశారు. చదవండి: సమంతతో ఆఫర్ కొట్టేసిన అభిజిత్