బిగ్‌బాస్‌ : ఫ్రైజ్‌ మనీ గెలిస్తే.. సోహైల్‌ ఎమోషనల్‌ | Bigg Boss 4 Telugu : sohel Emotional Comments On Prize Money | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : ఫ్రైజ్‌ మనీ గెలిస్తే.. సోహైల్‌ ఎమోషనల్‌

Published Sun, Dec 13 2020 5:52 PM | Last Updated on Sun, Dec 13 2020 8:16 PM

Bigg Boss 4 Telugu : sohel Emotional Comments On Prize Money - Sakshi

ఎన్నో అనుమానాల మధ్య మొదలైన బిగ్‌బాస్‌ నాల్లో సీజన్‌.. అప్పుడే ముగింపు దశకు చేరుకుంది.  కరోనా, ఐపీఎస్‌ లాంటి ఎన్నో ఆటుపోటులను తట్టుకుంటూ వచ్చిన ఈ బిగ్‌ రియాల్టీ షో మరో వారం రోజుల్లో ముగియనుంది. కొద్ది సమయం మాత్రమే ఉండటంతో కంటెస్టెంట్స్‌ తుదిపోరుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్‌లో ఇప్పటికే  టాప్ 5లో ఇద్దరు చోటు దక్కించుకున్నారు. అఖిల్ , సోహైల్ ఇద్దరూ బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే చేరుకున్నారు. ఈ రోజు ఒకరు ఎలిమినేట్‌ అయి మరో ముగ్గురు టాప్‌లోకి చేరుకుంటారు. ఇదిలా ఉంటే వారం రోజుల ముందే విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్‌ మనీ ఎంతో నాగార్జున తేల్చేశాడు. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ప్రైజ్ మనీ పై క్లారిటీ ఇచ్చినట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది.

 బిగ్‌బాస్‌ విన్నర్‌కు 50లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందుకుంటారు. అయితే ఈ భారీ జాక్ పాట్ ఎవరు అందుకుంటారు? ఆ డబ్బుతో ఏమేం చేస్తారో చెప్పాలని నాగ్‌ అడగ్గా.. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. ముఖ్యంగా సోహెల్ ఒక్క డైలాగ్ తోనే ఎమోషనల్ గా టచ్ చేసినట్లు అర్ధమయ్యింది. ఇప్పటివరకు నా అకౌంట్ లో లక్ష దాటి లేదు అని వివరణ ఇచ్చాడు. ఇక హారిక మాత్రం ఆ డబ్బును గెలుచుకుంటే పూర్తిగా తన తల్లికే ఇస్తానని చెప్పింది. ఇక అభిజిత్ వంతు రావడంతో ఆ ప్రైజ్ మనీ మొత్తం ఇంట్లో వాళ్ళకే అంటూ ఏం చేసుకుంటారో మీ ఇష్టం అంటూ అని చెప్పాడు. ఇక అఖిల్ మంచి కేఫె ఓపెన్ చేస్తానని చెప్పాడు. దానికి ముఖ్య అతిథిగా రావాలని నాగ్‌ను కోరాడు.

ఇక బిగ్ బాస్ విన్నర్‌గా ప్రకటిస్తే.. కంటెస్టెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో వేరే కంటెస్టెంట్స్ చూపించాలని నాగ్ కోరడంతో హారిక, మోనాల్ ను ఇమిటేట్ చేసింది. ఇక అఖిల్ అరియానా ఫీలింగ్ ను తెలుపగా..అరియానా అభిని ఇమిటేట్ చేసింది. మోనాల్, సోహెల్ డ్యాన్స్ ను చూపించగా.. హారిక ముద్దులు ఎలా పెడుతుందో సోహెల్ చూపించాడు. మరి వారి ఇమిటేట్‌ హౌస్‌లో ఏ మేరకు నవ్వులు పూయించిదో నేటి ఎపిసోడ్‌లో చూడాలి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement