
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఈ సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ప్రజలు మరోసారి నిత్యవసర సరుకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆపత్కాలంలో పేద కటుంబాలను ఆదుకునేందుకు సామాన్య ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు ముందుకు వస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ 4 సీజన్ విన్నర్ అభిజిత్ తన ఉదారతను చాటుకున్నాడు.
సిద్దిపేటకు చెందిన ముడు పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణి చేసి వారి అవసరాన్ని తీర్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలు అభిజిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘మూడు కుటుంబాలు నిత్యవసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారని నిన్న సాయంత్రం సిద్దిపేట నుంచి ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. వెంటనే నేను నాకు తెలిసిన యువకులను దీని గురించి తెలుసుకోమ్మని చెప్పాను. తెల్లారి లేచే సరికి ఈ ఫొటోలు, వీడియొలు నాకు పంపించారు. ఇందుకు సహకరించిన సిద్దిపేట యువకులకు ధన్యవాదాలు’ అంటూ అభిజిత్ రాసుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment