బిగ్‌బాస్ నాల్గో సీజన్ చివరి ఘట్టానికి చేరుకునేసరికి అన్నీ మారిపోయాయి. అభిజిత్‌తో తప్ప ఎవరితో కలవదనుకున్న హారిక అందరితో కలిసిపోయింది. కోపిష్టి అనుకున్న సోహైల్ ప్రేమతో ఇంటి సభ్యుల మనసులు గెలుచుకుని అందరివాడయ్యాడు. టాస్కులు ఒక్కటే తన గోల్ అనుకున్న అఖిల్ ఇంట్లో వాళ్ల మమకారం కూడా అంతే ముఖ్యమని తెలుసుకున్నాడు. కేవలం ఎక్స్‌పీరియన్స్ కోసం వచ్చానన్న అభిజిత్ అభిమానుల సపోర్ట్ చూశాక ఎలాగైనా గెలవాల్సిందేనంటున్నాడు. ఎవరికీ ఓ పట్టాన అర్థమవదనుకున్న అరియానా ఏం చేసినా తన గెలుపుకోసమే చేశానని చెప్తోంది. ఆట ఎంత ముఖ్యమో ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో టాప్ 5 కంటెస్టెంట్లు నూటికి నూరు మార్కులు సాధించారు. ఇక్కడివరకు రావడానికి వాళ్లు ఎంతగానో కృషి చేశారు. ఇప్పుడు మిగిలిందంల్లా ప్రేక్షకుల వంతు. వారిని ఏయే స్థానాల్లో నిలబెట్టాలనేది వీక్షకులే నిర్ణయించనున్నారు. (ఆ సెంటిమెంట్ కలిసొస్తే అభిజితే విన్నర్?)
మరో మూడు రోజుల్లో బిగ్‌బాస్ ముగుస్తుండటంతో బిగ్‌బాస్ అందరి జర్నీని వీడియో ద్వారా చూపించాడు. దీంతో కంటెస్టెంట్లు భావోద్వేగానికి లోనయ్యారు. సోహైల్‌కు కోప్పడిన సందర్భాలను చూపిస్తూనే మెహబూబ్ ఎలిమినేట్ అయినప్పుడు బాధపడటాన్ని చూపించడంతో అతడు మరోసారి ఏడ్చేశాడు. అభికి అతడి రాతనే మార్చేసిన రోబో టాస్క్‌ను కళ్ల ముందుంచారు. అవినాష్‌కు కోపం తెప్పించాలనే సీక్రెట్ టాస్క్ హారిక ఎలా గెలిచిందో మరోసారి చూపించడంతో ఆమె నవ్వేసింది. అంతలోనే తన అన్నయ్యకు ఇష్టం లేకపోయినా సరే, టాస్క్ కోసం జుట్టు కత్తిరించుకోవడం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. (తిండి కోసం అతడి ఇంటికి వెళ్లాను: అరియానా)
సుమ తనను ఇమిటేట్ చేయడం, సోహైల్‌తో గొడవలో కిందపడి ఏడ్చేయడం చూసి అరియానా స్థాణువులా నిల్చుండిపోయింది. ఇప్పటికే మోనాల్ లేకపోవడంతో ఊపిరి ఆడనట్లుగా ఉందన్న అఖిల్‌కు ఆమెతో కలిసున్న క్షణాలను చూపించి ఆ బాధను రెట్టింపు చేశారు. మొత్తానికి ఈ హౌస్‌లో అన్ని ఎమోషన్స్ పండించిన కంటెస్టెంట్లు వాళ్లను వాళ్లే వెనక్కు తిరిగి చూసుకుని ఎమోషనల్ అవుతున్నారు. ఈ సందర్భంగా.. నేనేంటో నాకు బిగ్‌బాస్ హౌస్‌లోనే పూర్తిగా తెలిసిందని అఖిల్ చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్‌కు రావడం అనేది నా జీవితంలోనే నేను తీసుకున్న గొప్ప నిర్ణయం అని అభిజిత్ అభిప్రాయపడ్డాడు. మరి ఈ కంటెస్టెంట్ల వంద రోజుల ప్రయాణాన్ని మరోసారి చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (బిగ్‌బాస్: మాట మీద నిలబడ్డ దేవి నాగవల్లి)
Comments
Please login to add a commentAdd a comment