Bigg Boss Sohel: Anil Ravipudi Launched Lucky Laxman First Look Poster - Sakshi
Sakshi News home page

Bigg Boss Sohel Lucky Laxman: లక్కీ లక్ష్మణ్‌గా సోహైల్‌ లుక్‌ చూశారా?

Published Wed, Jul 6 2022 9:19 PM | Last Updated on Fri, Jul 8 2022 1:05 PM

Anil Ravipudi Launched Lucky Laxman First Look Poster - Sakshi

బిగ్‌బాస్‌ ఫేమ్‌ సోహైల్‌, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం లక్కీ లక్ష్మణ్‌. ఎ.ఆర్‌.అభి దర్శకత్వం వహిస్తున్నారు. దత్తాత్రేయ మీడియాపై హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి రిలీజ్‌ చేశాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శకనిర్మాతలకు ఇది మొదటి సినిమా అయినా చక్కగా తెరకెక్కించారు. సోహైల్‌ నాకు బిగ్‌బాస్‌ నుంచి తెలుసు. తన నటన బాగుంటుంది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. అనిల్‌ రావిపూడి అన్న ఎంత బిజీగా ఉన్నా లక్కీ లక్ష్మణ్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ లాంచ్‌ చేయడం సంతోషంగా ఉందన్నాడు సోహైల్‌. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించాడు.

చదవండి: Tamannaah Bhatia: తమన్నా వద్ద ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద వజ్రం..
జూలై రెండో వారం రిలీజవుతున్న సినిమాలు, సిరీస్‌ల లిస్టు ఇదిగో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement