
బిగ్‌బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లు సోహైల్, అరియానా పేర్లు చెప్పగానే అందరికీ టామ్ అండ్ జెర్రీ గుర్తొస్తుంది. వీళ్లు ఎంత కొట్టుకున్నా అది టామ్ అండ్ జెర్రీ ఫైట్‌లాగే కనిపించేది. కానీ గతవారంలో మాత్రం ఇద్దరూ బద్ధ శత్రువుల్లా మారి పూనకం వచ్చినట్లుగా ప్రవర్తించారు. మాటల తూటాలు పేలుస్తూ ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్లారు. వీళ్లను శాంతింపజేయడం ఎవరి తరమూ కాలేదు. చివరకు వీకెండ్‌లో నాగార్జున వీళ్ల పంచాయితీని పరిష్కరిస్తూ తలా రెండు మొట్టికాయలు వేశారు. దీంతో ఇద్దరూ ఒకరికి ఒకరు సారీ చెప్పుకుంటూ మళ్లీ కలిసిపోయారు. ఒకరినొకరు జెండూబామ్ అనుకున్నవాళ్లే బబుల్‌గమ్‌లా అతుక్కుపోయారు. కానీ ఏడిపించడం మాత్రం మానుకోలేదు. (చదవండి: అభి ఫ్యాన్స్‌ఫై పోలీసులకు మోనాల్ ఫిర్యాదు)
నాకు పెట్టకుండా తింటున్నావా?
తాజాగా బిగ్‌బాస్ అన్‌సీన్‌లో సోహైల్, అఖిల్ గార్డెన్ ఏరియాలో పడుకున్నారు. అరియానా కప్పులో ఏదో తినుకుంటూ వస్తోంది. ఇది చూసిన సోహైల్ నాకు పెట్టకుండానే తింటున్నావా? ఇదేనా దోస్తానా? అని భారీ డైలాగులు కొట్టాడు. దీంతో అరియానా అతడికి స్పూన్‌తో తినిపించింది. సరిగ్గా తినిపించట్లేదు, అవసరం లేదు, పో అని సోహైల్ హర్ట్ అవ్వడంతో నువ్వు జోక్ చేయొచ్చు, కానీ నేను చేయొద్దా అంటూ ఆమె అరిచేసింది. (చదవండి: మోనాల్ వెళ్లిపోయాక ఊపిరి ఆడలేదు: అఖిల్)
24 ఏళ్ల వయసులో పదహారేళ్ల పిల్లలా ఎలా?
దీంతో తాను కూడా జోక్‌గా అన్నా అంటూ సోహైల్ ఆమెను బంగారుతల్లి అంటూ బుజ్జగించాడు. ఇంత అందంగా ఎట్లున్నావు? అంటూ పులిహోర కలిపాడు. సోహైల్‌లో ఈ కొత్త యాంగిల్ చూసిన అరియానా షాక్ తింది. ఈ వయసులో కూడా ఇంత అందంగా ఎలా ఉన్నావు? అని బిస్కెట్లు వేస్తూ ..32 ఏళ్లు ఉంటాయ్ కదా? అన్నాడు. అది నీకు అంటూ అరియానా పంచ్ వేసింది. నాకు 28 అని సోహైల్ చెప్పడంతో తనకు 24 అని అరియానా సమాధానమిచ్చింది. అయినా 24 ఏళ్ల వయసులో పదహారేళ్ల పిల్లలాగా ఎలా కన్పిస్తున్నావే.. అంటూ అడుగుతూనే ఉన్నాడు. దీంతో ఈ పులిహోర ఘాటు తట్టుకోలేక అరియానా ఇది మనకు సెట్టవ్వదు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. (చదవండి: బిగ్‌బాస్: మాట మీద నిలబడ్డ దేవి నాగవల్లి)
Day 103 Unseen 💥
— BB4 Telugu UNSEEN (@BiggBoss4Unseen) December 19, 2020
Telegram ➡️ @biggboss4_unseen#BiggBossTelugu4 #BiggBoss4Telugu #BiggBossUNSEEN #Ariyana #Sohel pic.twitter.com/PIZdgmNjwC