బిగ్‌బాస్‌: హారిక‌కు ఇచ్చి ప‌డేసిన సోహైల్‌ | Bigg Boss 4 Telugu: Sohel Fight With Harika In Nominations | Sakshi
Sakshi News home page

అరియానా నాకు కాంపిటీష‌నే కాదు: లాస్య‌

Published Mon, Nov 16 2020 4:25 PM | Last Updated on Mon, Nov 16 2020 4:25 PM

Bigg Boss 4 Telugu: Sohel Fight With Harika In Nominations - Sakshi

బిగ్‌బాస్ షోలో ఎలిమినేష‌న్ క‌న్నా నామినేష‌నే ర‌స‌వ‌త్త‌రంగా ఉంటోంది. ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ముందే లీక‌వుతుండ‌టంతో సండే ఎపిసోడ్ మీద ప్రేక్ష‌కుల‌కు ఆస‌క్తి స‌న్న‌గిల్లుతోంది. అయితే నామినేష‌న్ లిస్టు కూడా కొన్నిసార్లు ముందే లీక‌వుతున్నా వారి మ‌ధ్య జ‌రిగే ఫైట్ చూడ‌టానికి ప్రేక్ష‌కులు క‌ళ్ల‌లో వ‌త్తులు వేసుకుని మ‌రీ ఎదురు చూస్తున్నారు. అప్ప‌టివ‌ర‌కు స్నేహ‌గీతాలు పాడుకుంటూ సంక్రాంతి సినిమా చూపించే కంటెస్టెంట్లు నామినేష‌న్‌లో క‌త్తులు దూసుకుంటూ ఆర్జీవీ క్రైమ్ సినిమా చూపిస్తారు. బిగ్‌బాస్ కూడా ఎల్ల‌ప్పుడూ అగ్నికి ఆజ్యం పోసేందుకు ప్ర‌య‌త్నిస్తూ ఉంటాడు. ఇక నేటి మండే మంట‌లో నామినేష‌న్ ప్ర‌క్రియ వేరే లెవ‌ల్లో ఉండ‌నున్న‌ట్లు కనిపిస్తోంది.

హారిక గుండెల్లో గుచ్చిన సోహైల్‌
చెత్త ప‌ర్ఫామెన్స్ ఎవ‌రు అనిపిస్తున్నారో వారి గుండెల్లో బాణాన్ని గుచ్చి నామినేట్ చేయాల‌ని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో ప‌దునైన మాట‌ల‌తోనూ బాణాలు విసురుతూ ఇంటిస‌భ్యులు ఒక‌రినొక‌రు నామినేట్ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో అరియానా మాట్లాడుతూ.. 'నేను లాస్య‌కు కాంపిటీష‌నే కాద‌ని అంది' అని చెప్తుండ‌గా ఇప్ప‌టికీ అదే ఫీల‌వుతున్నా అని లాస్య స్ప‌ష్టం చేసింది. దీంతో అరియానా క‌సితో ఆమె గుండెల్లో గున‌పాన్ని దింపింది. ఇక మొన్న‌టి ఎపిసోడ్‌లో హారిక సోహైల్‌ను అవ‌మానించిన విష‌యం తెలిసిందే క‌దా! సోహైల్ వేస్ట్‌గాడు, అత‌డిని ఎవ్వ‌రూ దేఖ‌రు అని నోటికొచ్చిన‌ట్లు మాట్లాడేసింది. దీనికి హ‌ర్ట్ అయిన సోహైల్ నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో త‌న ప్ర‌తాపాన్ని చూపించాడు. గింతంత లేవు అంటూ ఆమె హైట్ గురించి వెక్కిరించాడు. (నేను గేమ్ ఆడ‌టానికి రాలేదు‌: అభిజిత్)

అంటే, నేను నాలా ఉండ‌కూడ‌దు: సోహైల్‌
మ‌రోవైపు అభిజిత్ కూడా ఎంత‌చెప్పి చూసినా త‌న మాట‌తీరు మార్చుకోవ‌డం లేదంటూ సోహైల్‌ను నామినేట్ చేశాడు. దీనికి సోహైల్ కౌంట‌రిస్తూ.. అంటే నేను నాలాగా ఉండ‌కూడ‌దు.. పాశ్‌గా మాట్లాడాలి అని చెప్ప‌డంతో అభి సైలెంట్ అయిపోయాడు. వీళ్ల గొడ‌వ ఎటు తిరిగి ఎక్క‌డికి వెళుతుందో కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం నెటిజ‌న్లు ప్రోమో మీద తెగ చ‌ర్చించుకుంటున్నారు. ఈ సీజ‌న్‌కు లాస్య తొలి కెప్టెన్ అవ‌డం మిన‌హా అంత‌కు మించి ఏం చేసిందని ప్ర‌శ్నిస్తున్నారు. లాస్య‌తో పోలిస్తే అరియానా వంద‌రెట్లు న‌య‌మ‌ని కామెంట్లు చేస్తున్నారు. కేవ‌లం అభిమానుల ఓట్ల వ‌ల్లే ఆమె ఇంకా హౌస్‌లో ఉంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక సోహైల్‌-అభి గొడ‌వ‌లో మెజారిటీ జ‌నాలు సోహైల్‌కే స‌పోర్ట్ చేస్తున్నారు. అత‌డి యాస‌ను ఎలా మార్చుకోగ‌ల‌డ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక అంద‌రిముందే త‌న‌ను కించ‌ప‌రిచిన హారిక‌కు కూడా సోహైల్‌ ఇచ్చి ప‌డేశిండు అని ఆయ‌న అభిమానులు అంటున్నారు. కాగా సోహైల్, అరియానా, లాస్య‌, అభిజిత్, హారిక‌, మోనాల్ ఈ వారం నామినేష‌న్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. (మెహ‌బూబ్ గుడ్‌బై: అవినాష్‌పై బిగ్‌బాంబ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement