హారిక‌కు సోహైల్ వార్నింగ్‌: క‌థే వేరే ఉందిగా! | Bigg Boss 4 Telugu: Sohel In Angry Mood Because Of Harika | Sakshi
Sakshi News home page

సోహైల్ చేస్తే ఒప్పు? హారిక చేస్తే త‌ప్పా?

Published Mon, Dec 7 2020 5:47 PM | Last Updated on Mon, Dec 7 2020 5:47 PM

Bigg Boss 4 Telugu: Sohel In Angry Mood Because Of Harika - Sakshi

క‌ళ్యాణ‌మొచ్చినా క‌క్కొచ్చినా ఆగ‌ద‌న్న‌ది లోకోక్తి. కానీ బిగ్‌బాస్‌లో ఉన్న‌ సోహైల్‌కు సంతోష‌మేసినా, కోప‌మొచ్చినా దేన్నీ దాచుకోలేడు. అత‌డి ఆనందం క‌ళ్ల‌ల్లో క‌నిపిస్తే, కోపంలో మాత్రం బాడీ న‌రాలు బ‌య‌ట‌కొచ్చేలా క‌నిపిస్తాయి. అయితే అర్జున్ రెడ్డిలా ఉండే సోహైల్ వ్యాఖ్యాత నాగార్జున చెప్పార‌ని త‌న కోపాన్ని అణుచుకుని అంద‌రి బంధువుగా మారిపోయాడు. అలాంటి సోహైల్‌కు తాజాగా కొంద‌రు ఇంటిస‌భ్యులు కోపం తెచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ మేర‌కు ప్రోమో కూడా రిలీజైంది. బిగ్‌బాస్ ఇచ్చిన రాజారాణి టాస్కులో అప్పుడు సోహైల్ రాజ‌వ‌గా ఇప్పుడా అదృష్టం హారిక‌ను వ‌రించిన‌ట్లు క‌నిపిస్తోంది. హౌస్‌లో ఆమె మ‌హారాణిగా కొలువు దీరింది. అఖిల్ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. (చ‌ద‌వండి: ఈ ఇద్ద‌రిలో ఒక‌రే బిగ్‌బాస్ విజేత‌: కౌశ‌ల్)

ప‌ది సెక‌న్ల‌లో నా క‌ళ్ల ముందుండాలి
గార్డెన్ ఏరియాలో కూర్చున్న హారిక అభిజిత్‌ను ర‌మ్మ‌ని ఆదేశించింది. దాన్ని అత‌డు పెద్ద‌గా ప‌ట్టించుకోలేడు. దీంతో మ‌హారాణికి కోపం రాగా, ప‌ది సెకండ్ల‌లో నా ఎదుట ప్ర‌త్య‌క్షం కాక‌పోతే మీ బ‌ట్ట‌లు స్విమ్మింగ్ పూల్‌లో ప‌డేస్తాన‌ని హెచ్చ‌రించింది. త‌న బ‌ట్ట‌లు ప‌డేస్తే చుక్క‌లు చూపిస్తాన‌ని సోహైల్ వార్నింగ్ ఇచ్చాడు. అయినా స‌రే, హారిక త‌ను చెప్పిన‌దాని ప్ర‌కారం బ‌ట్ట‌లు పూల్‌లో ప‌డేసింది. అది అభిజిత్‌వా? సోహైల్‌వా? అన్న‌దానిపై స్ప‌ష్ట‌త లేదు. ఆమె అన్నంత ప‌ని చేస్తుంద‌ని అర్థ‌మైన సోహైల్ త‌ర్వాత ఆమె ముందు నిల‌బ‌డ్డాడు. (చ‌ద‌వండి: అవినాష్ అవుట్‌: అభిజిత్‌పై బిగ్‌బాంబ్‌)

సోహైల్ చేస్తే ఒప్పు, హారిక చేస్తే త‌ప్పా!
చెప్పిన ప‌ని అయిందా? అని హారిక హుంక‌రించ‌గా.. దానికి కొంచెం స‌మ‌యం ప‌డుతుంద‌ని దురుసుగా స‌మాధాన‌మిచ్చాడు. అత‌డి తీరును అక్క‌డే ఉన్న అఖిల్ త‌ప్పుప‌ట్ట‌గా బ‌రాబ‌ర్‌.. ఇట్ల‌నే మాట్లాడ‌తా అంటూ సోహైల్ అక్క‌డి నుంచి విసురుగా వెళ్లిపోయాడు. ఎప్ప‌టిలాగే త‌న‌ కోపాన్ని వ‌స్తువుల మీద తీస్తూ కుర్చీని విసిరిగొట్టాడు. మ‌రి సోహైల్ కోపానికి కార‌ణ‌మేంట‌న్న‌ది తెలియరాలేదు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజ‌న్లు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. చాలా రోజుల త‌ర్వాత సోహైల్ కోపాన్ని చూస్తున్నామ‌ని కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంద‌రేమో సోహైల్ అరియానాకు ప‌నులు చెప్పి ఆమెను టార్చ‌ర్ చేయ‌డం క‌రెక్ట్ కానీ హారిక మాత్రం అత‌డిని ఏమీ అన‌కూడ‌దా? అని విమ‌ర్శిస్తున్నారు. అబ్బాయికి కోపం వ‌స్తే ఆటిట్యూడ్ బాగుందంటారు, కానీ అమ్మాయి అలా ప్ర‌వ‌ర్తిస్తే పొగ‌ర‌ని తిడ‌తారు? ఇదేం న్యాయమ‌ని క‌డిగి పారేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement