
సింగరేణి ముద్దుబిడ్డ సోహైల్ బిగ్‌బాస్ షోతో ఎక్కడలేని క్రేజ్ సంపాదించాడు. ఆ గుర్తింపుతోనే వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు నటించిన లక్కీ లక్ష్మణ్ డిసెంబర్ 30న విడుదల కానుంది. ఈ క్రమంలో వెరైటీ ప్రమోషన్స్ మొదలుపెట్టాడు సోహైల్. యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని కలిసశాడు. ఇతడు చేపలు పడుతూ అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటాడు. అతడిని కలవడానికి సోహైల్ వైజాగ్ వెళ్లాడు. మత్స్యకారుడు నానితో కలిసి చేపలు పట్టడానికి సముద్రం మధ్యలోకి బోట్‌లో వెళ్లాడు. వల ఎలా విసరాలి? చేపలు పట్టడం ఎలా? ఇవన్నీ దగ్గరుండి చూపించాడతడు.
అవన్నీ చూసి సర్‌ప్రైజ్ అయిన సోహైల్ పడవ చివరంచున నిలబడి ఫోటోకు పోజివ్వడానికి ప్రయత్నించాడు. ఇంతలో పట్టు తప్పి నడి సముద్రంలో పడిపోయాడు. వెంటనే నాని సముద్రంలో దూకి అతడిని రక్షించి పైకి తీసుకొచ్చాడు. కానీ సోహైల్ కాలికి గాయాలై రక్తం కారింది. ఏదేమైనా సోహైల్ పెద్ద గండం నుంచి బయటపడ్డాడని ఊపిరి పీల్చుకుంటున్నారు. అతడి అభిమానులు.
చదవండి: పారిపోయి పెళ్లి చేసుకున్నాం, మిస్ క్యారేజ్ అయింది: నటి ఎమోషనల్
ఐదేళ్లుగా నటి సీక్రెట్ లవ్, ప్రియుడెవరో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment