
పగిలిన అద్దాన్ని, విరిగిన మనసును అతికించలేమంటారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న టామ్ అండ్ జెర్రీల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎప్పుడూ చిన్నచిన్న గొడవలు పడి వెంటనే కలిసిపోయే వీళ్లిద్దరూ నిన్నటి ఎపిసోడ్‌లో మాత్రం తీవ్రస్థాయి ఘర్షణకు దిగారు. లెక్కలేనన్ని మాటలు అనుకన్నారు. ఒకరి మీద ఒకరు నోరు జారారు. చివరికి ఇద్దరూ ఏడ్చారు. అరియానా మీద కేకలేసిన సోహైల్‌కు ఒకరి మీద మాత్రం ఇంకా కోపం తగ్గలేదు. ఈ తగాదాకు కారణమైన చింటూ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూనే జాలి పడ్డాడు. (చదవండి: అరియానాతో ఘర్షణ: సోహైల్ విజయానికి గండి)
నిన్ను అరియానా తీసుకెళ్లలేదా? నువ్వు వట్టి ఎమోషనల్.. అనవసరంగా మోసపోతున్నావు రా అంటూ బొమ్మతో కబుర్లు పెట్టాడు. ఇంతలోనే ఈ గొడకు మూల కారణం చింటూ అని గుర్తొచ్చిందో ఏమో కానీ అరియానా ఎంతగానో ప్రేమించే చింటూను అడ్డంగా దొరికించుకుని ఉతికారేయబోయాడు. దీంతో అక్కడే ఉన్న మోనాల్.. బొమ్మను పాడు చేయకుండా సోహైల్‌ను అడ్డుకుంది. అతడు మాత్రం ఈ చింటూగాడిని చంపేస్తానంటూ ఆ బొమ్మ దగ్గరకు వెళ్లడం నవ్వు తెప్పిస్తోంది. మరి ఈ రోజు ఈ టామ్ అండ్ జెర్రీ కలుస్తారో, లేదో చూడాలి. మరోవైపు ఈ ప్రోమో చూసిన నెటిజన్లు సోహైల్ కామెడీకి నవ్వుకుంటున్నారు. అతడి కోపం చిచ్చుబుడ్డిలాంటిదని చెప్తున్నారు. మరికొందరు మాత్రం అరియానా బొమ్మను కూడా వదలవా అని విమర్శిస్తున్నారు. (చదవండి: టాప్ 2: లాస్య జోస్యం నిజమయ్యేనా?)