Sohel And Mehaboob Mass Dance For Natu Natu Song From Rrr Movie: పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'ఆర్‌ఆర్‌ఆర్' నుంచి ఇటీవలె విడుదలైన మాస్ సాంగ్ నాటు నాటుకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగు నాట ఎక్కడ విన్నా ఈ పాటే మారుమోగుతోంది. 10మిలియన్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఈ సాంగ్‌ను ఇప్పటికే చాలామంది నెటిజన్లు రీక్రియేట్ చేస్తూ స్టెప్పులేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సోహేల్, మెహబూబ్ నాటు నాటు సాంగ్‌కు అదిరిపోయే మాస్ స్టెప్పులేశారు.
దీనికి సంబంధించిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. టాలీవుడ్ మాత్రమే కాకుండా ఇండియా వైడ్‌గా ఎదురుచూస్తున్న ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment