బిగ్‌బాస్ నాలుగో సీజన్.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది. ఆటలు, పాటలు, అలకలు, గొడవలు, కోపాలు, బుజ్జగింపులు, ప్రేమ, గాసిప్స్ ఇలా అన్నీ పంచిపెట్టింది. ఈ సీజన్‌లో మొత్తం 19 మంది బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టగా వారిలో కొంత మందికి మాత్రమే సరైన గుర్తింపు లభించింది. తమ తలరాతను మార్చేలా భవిష్యత్తు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. బిగ్‌బాస్‌తో లైఫ్ చేంజ్ అయిన వారిలో సోహైల్ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటి వరకు అడపాదడపా సినిమాల్లో నటించిన సోహైల్‌కు పెద్దగా చెప్పుకునే అంతా పేరు రాలేదు. కానీ బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత తన లైఫ్ వేరేలా మారిపోయింది. సీజన్ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు. అయితే ఇంత పాపులారిటీ సంపాదించిన సోహైల్‌కు ఒక్కసారిగా ట్రోల్స్, మీమ్స్‌తో గట్టి ఎదురుదెబ్బ ఎదురయ్యింది. చదవండి: బిగ్‌బాస్: బయటపడ్డ సోహైల్, మెహబూబ్ కుట్ర!
బిగ్‌బాస్ చివరి అంకానికి చేరుకున్న సమయంలో ఎలిమినేట్ అయిన సభ్యులు ఇంట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అద్దాలతో ఏర్పాటు చేసిన గది నుంచి ఒక్కొక్కరూ వచ్చి టాప్ 5 కంటెస్టెంట్లను కలిసి కాసేపు అలరించారు. అయితే మెహబూబ్ మాత్రం సోహైల్‌తో ఏవో సైగలు చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అందరితో కూల్‌గా మాట్లాడినట్లు నటించిన నటించిన మెహబూబ్.. తన సంజ్ఞలతో సోహైల్‌కు ఏదో చెప్పాడని నెటిజన్లు మండిపడ్డారు. సోహైల్ నెంబర్ త్రీలో ఉన్నట్టు మెహబూబ్ అద్దంపై మూడు వేళ్లతో సూచించినట్టు ఆరోపిస్తున్నారు. అలాగే, డబ్బులు తీసుకునే ఆఫర్ గనుక వస్తే వదిలిపెట్టొదని సిగ్నల్ ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు. ఇక మెహబూబ్ చెప్పినట్లుగానే టాప్ 3 కంటెస్టెంట్లుగా మిగిలిన అఖిల్, అభిజిత్, సోహైల్‌కు బిగ్‌బాస్ భారీ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోటీ నుంచి తప్పుకున్నవారికి రూ.25 లక్షలు ఇస్తామని బిగ్‌బాస్ చెప్పగా.. సోహైల్ ఆ డీల్‌కు అంగీకరించాడు. రూ.25 లక్షలు తీసుకుని హౌజ్ నుంచి బయటికొచ్చాడు. దీంతో మెహబూబ్ చెప్పడం వల్లే ఎలాగూ తనది మూడో స్థానం అని సోహైల్ డబ్బులు తీసుకున్నాడని, తద్వారా విన్నర్ అభిజిత్‌కు ప్రైజ్ మనీలో సగం కోత పడిందని అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సోహైల్‌కు బ్రహ్మానందం బంపర్ ఆఫర్
కాగా తాజాగా మంగళవారం సోహైల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియోలోకి వచ్చారు. ఎవరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చేప్తానని చెప్పడంతో అనేకమంది మెహబూబ్ సైగా విఫయాన్ని కామెంట్ల రూపంలో ప్రశ్నించారు. దీంతో మెహబూబ్ సైగలపై స్పందిస్తూ ఆగ్రహానికి గురయ్యాడు. బిగ్‌బాస్‌లో తరువాత ఏం జరుగుతుందనేది అసలు ఎవరికి తెలియదని, ఎవరు ఉంటారు, ఎవరు పోతరని ఎవరికి తెలియదు. ‘అంతా సీన్ లేదు అక్కడ. అట్ల ఉంటే మంచిగుండు. ఏరోజు అలాంటి పరిస్థితి రాలేదు. అలాగే చిన్న లాజిక్ చెబుతా. జాగ్రత్తగా వినండి. వాడు ఏదో గ్లాస్‌ను పట్టుకుని ఊరికే చేతి వేళ్లను అలా అన్నాడు. అసలు వాడేమన్నడో నాకు తెలియదు. టాప్ 3లో ఎవరుంటరనేది ఎవరూ జడ్జ్ చేయలేదు. నేడు విన్నర్ అయ్యే వాడినేమో, టాప్ 2లో ఉండే వాడినేమో. వాడు ఎలా చెప్తడు. వాడికి ఎలా తెలుస్తోంది. మెహబూబ్ బిగ్‌బాస్ కాదు.
వాడు డబ్బులు గెలుచుకొని రారా అని సిగ్నల్ చేసిండేమో.. తను చెప్పింది అర్థం కాలేదని తర్వాత అఖిల్‌తో కూడా చర్చిందాను. దాన్ని పట్టుకొని వీడియోలు చేసి, కథలు పడి ఇవన్నీ చేయడం నాకు నచ్చలేదు. నా పది సంవత్సరాల కష్టం. నా కెరీర్ మీద ఒట్టేసి చెప్తున్నా. నిజంగా అలా అన్నది ఎందుకు అన్నాడో నాకు తెలీదు. టాప్ 3 అని నేను అన్నది తెలీదు. నేను నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత అని అడిగాను. అంతే అయినా థర్డ్ ప్లేస్‌లో ఉన్న వాళ్లకు డబ్బులు ఇస్తారని మెహబూబ్‌కు ఎలా తెలుసు. 25 లక్షలు 25 లక్షలు ఆఫర్ ఇస్తే మనం వినియోగించుకుందాం అని అఖిల్ నేను అనుకున్నాం. అంతేగాని మూడో ప్లేస్‌లో ఉంటే డబ్బులు ఇస్తారని ఎవరికి తెలియదు. నేను అలా స్కాం చేసి చేసి గెలిస్తే నా కెరీర్‌లోనే బాగుపడను. అసలు అది ఫ్రాడ్, స్కాం కాదు. అభిజిత్ ఫ్యాన్స్‌కు కూడా చెబుతున్నా. నేను తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా చెప్తా. బిగ్‌బాస్ హౌజ్‌లో అసలేం జరుగుతుందో ముందే ఎవరికి తెలియదు’ అని సోహైల్ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment