మెహ‌బూబ్ అవుట్‌: ఎంత క‌ష్ట‌ప‌డ్డా ఫ‌లితం లేదు | Bigg Boss 4 Telugu: Mehboob Drops Bigg Bomb On Avinash | Sakshi

మెహ‌బూబ్ గుడ్‌బై: అవినాష్‌పై బిగ్‌బాంబ్‌

Published Sun, Nov 15 2020 11:02 PM | Last Updated on Mon, Nov 16 2020 5:16 AM

Bigg Boss 4 Telugu: Mehboob Drops Bigg Bomb On Avinash - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ప‌దోవారం మెహ‌బూబ్ దిల్‌సే షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో కుమిలిపోయిన‌ సోహైల్ బోరుబోరుమంటూ ఏడ్చేశాడు. ఊహించ‌ని దెబ్బ‌కు మెహ‌బూబ్ కూడా విల‌విల్లాడిపోయాడు. ఎంత క‌ష్ట‌ప‌డినా ఫ‌లితం ద‌క్క‌ట్లేద‌ని త‌ల‌రాతను తిట్టుకున్నాడు. కానీ బిగ్‌బాస్ హౌస్ ఎన్నో నేర్పించింద‌ని సంతోషించాడు. చివ‌రిసారిగా డ్యాన్స్ చేసి అంద‌రినీ కంట‌త‌డి పెట్టించాడు. మ‌రి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చ‌దివేయండి..

రెండుసార్లు గెలిచిన సోహైల్‌!
హోస్ట్‌ నాగార్జున‌ ఇంటిస‌భ్యుల‌తో గ‌ద్ద కుందేలు ఆట ఆడించారు. మొద‌ట గ‌ద్ద‌గా మారిన అభి కుందేలుగా ఉన్న ఇంటిస‌భ్యుల్లో నుంచి అఖిల్‌ను ప‌ట్టుకుని గద్ద‌గా మార్చేశాడు. ఇలా గేమ్ పూర్త‌య్యేస‌రికి అంద‌రూ గ‌ద్ద‌లుగా మారిపోగా సోహైల్‌ మాత్రం కుందేలుగా ఉండి విజేత‌గా నిలిచాడు. త‌ర్వాత అరియానా సేఫ్ అయిన‌ట్లు తెలిపారు. అనంత‌రం ఒక‌రు బొమ్మ గీస్తే మిగ‌తావాళ్లు దాన్ని ఆధారంగా చేసుకుని సినిమా పేరు చెప్పాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో సోహైల్ లీడ‌ర్‌గా అవినాష్‌, అఖిల్‌, హారిక ఒక టీమ్‌, అరియానా లీడ‌ర్‌గా మెహ‌బూబ్‌, లాస్య‌, అభిజిత్‌, మ‌రో టీమ్‌గా విడిపోయారు. మోనాల్ సంచాల‌కురాలిగా వ్య‌వ‌హ‌రించింది. (చ‌ద‌వండి: జ‌బ‌ర్ద‌స్త్‌లోకి మ‌ళ్లీ తీసుకుంటారు: అవినాష్ త‌మ్ముళ్లు)

లాస్య‌ను ఆంటీ అని ఆట‌ప‌ట్టించిన అవినాష్‌
ఈ గేమ్‌లో అంద‌రిక‌న్నా అవినాష్ బాగా ఆడుతూ ఎగిరి గంతులేశాడు. ఈ క్ర‌మంలో అమ్మాయిలు, ఆంటీలు, ఫిగ‌ర్లు అంటూ తిరిగావో యాసిడ్ పోసి చంపేస్తాన‌ని హారిక డైలాగ్ చెప్తూ అవినాష్‌ మీద బాటిల్‌ గుమ్మ‌రించేసింది. అనంత‌రం మోనాల్ సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. త‌ర్వాత లాస్య‌ను ఆంటీ అంటూ అవినాష్ ఆట‌ప‌ట్టించడంతో ఆమె అత‌డిని ఏడ‌వ‌లేక న‌వ్వుతూ హెచ్చ‌రించింది. ఇక సినిమా పేర్ల‌ను కనుక్కునే గేమ్‌లో అరియానా టీమ్‌ను చిత్తుచిత్తుగా ఓడించి సోహైల్ టీమ్ విజ‌యాన్ని ముద్దాడింది. అనంత‌రం హారిక సేఫ్ అయిన‌ట్లు తెలిపారు. (చ‌ద‌వండి: దివి న‌న్ను కాపాడిన దేవ‌త‌, హౌస్‌లో అభి దండ‌గ‌)

విజ‌యం కోసం ప‌దేళ్లుగా ఎదురు చూస్తున్నా
చివ‌రికి సోహైల్‌, మెహ‌బూబ్ డేంజ‌ర్ జోన్‌లో మిగిలారు. ఈ సంద‌ర్భంగా స‌క్సెస్ కోసం ప‌దేళ్లుగా క‌ల కంటున్నా అని సోహైల్‌, క‌ష్ట‌ప‌డుతున్నాను కానీ దుర‌దృష్టం వెంటాడుతోంద‌ని మెహ‌బూబ్ బాధ‌ప‌డ్డాడు. మెహ‌బూబ్ చెప్పిన‌ట్టుగానే అత‌డి నెత్తి మీద ద‌రిద్రం దాండియా ఆడుతోంది. ఫ‌లితంగా మెహ‌బూబ్ ఎలిమినేట్ అయిన‌ట్లు నాగ్ వెల్ల‌డించ‌డంతో సోహైల్ క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యాడు. టాప్ 5లో ఉంటామంటూ ఇప్పుడు వెళ్లిపోతున్నాడ‌ని చిన్న‌పిల్లాడిలా ఏడ్చేశాడు. దీంతో స్నేహితుడి క‌న్నీళ్ల‌ను తుడుస్తూ.. నువ్వు, అఖిల్ త‌ప్ప‌కుండా టాప్ 5లో ఉండాలంటూ మెహ‌బూబ్ కూడా దుఃఖించాడు. ఇంటిస‌భ్యుల నుంచి భారంగా వీడ్కోలు తీసుకున్నాడు.

రేప‌టి నుంచి ఎవ‌రితో డ్యాన్స్ చేయాలి?
హౌస్‌ను వీడి వ‌చ్చేసిన మెహ‌బూబ్ త‌న‌కు బిగ్‌బాస్ షో చాలా నేర్పింద‌ని, అంద‌రూ త‌న‌కు స్విమ్మింగ్ కూడా నేర్పార‌ని చెప్పుకొచ్చాడు. కాగా 'నువ్వు లేక‌పోతే నేను డ్యాన్స్ చేయ‌లేను' అని హారిక, ఎగ్ దోశ ఎవ‌రికి వేయాల‌ని లాస్య‌ క‌న్నీళ్లు పెట్టుకున్నారు. మెహ‌బూబ్ మాట్లాడుతూ.. హౌస్‌లో అభిజిత్ త‌న‌కు అన్న‌లాగా ఉన్నాడ‌ని వెక్కివెక్కి ఏడ్చాడు. ఇంత హార్డ్ వ‌ర్క్ చేసేవారిని తానెప్పుడూ చూడ‌లేద‌ని అభి చెప్పుకొచ్చాడు. ఇక‌ ఎవ‌రికి ఆరోగ్యం బాగోలేక‌పోయినా మోనాల్ ద‌గ్గ‌రుండి చూసుకుంటుంద‌ని, హౌస్‌లో బెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ అవినాష్ అని, అఖిలే నంబ‌ర్ 1 అని మెహ‌బూబ్ చెప్పుకొచ్చాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఏంటేంటి? అత‌డు టైటిల్ ఎగ‌రేసుకుపోతాడా?)

హౌస్‌లో సోహైల్ ఉంటే మెహ‌బూబ్ ఉన్న‌ట్లే
మ‌రోవైపు సోహైల్ మాత్రం దుఃఖ సాగ‌రంలో నుంచి బ‌య‌ట ప‌డ‌లేక‌పోయాడు. మొన్న‌ మాస్ట‌ర్ పోయాడు, త‌ర్వాత అఖిల్ వెళ్లొచ్చాడు, ఇప్పుడు మెహ‌బూబ్ వెళ్తున్నాడు అంటూ  వెక్కివెక్కి ఏడ్చాడు. అత‌డిని మెహ‌బూబ్ అతిక‌ష్టం మీద ఓదారుస్తూ బిగ్‌బాస్‌లో నువ్వు ఎన్ని రోజులు ఉంటే తాను కూడా అన్ని రోజులు లోప‌ల ఉన్న‌ట్లే అని చెప్పుకొచ్చాడు. చివ‌ర‌గా ఓ హిందీ పాట‌కు ఆర్తిగా డ్యాన్స్ చేస్తూ అంద‌రినీ ఏడిపించేశాడు. అనంత‌రం నెక్స్ట్ వీక్‌ నాన్‌వెజ్ తిన‌కూడ‌ద‌నే బిగ్‌బాంబ్‌ను అవినాష్ మీద వేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement