నేను గేమ్ ఆడ‌టానికి రాలేదు‌: అభిజిత్ | Bigg Boss 4 Telugu: Abhijeet Entered In Bigg Boss Just For Experience | Sakshi
Sakshi News home page

అఖిల్ ఎలిమినేట్‌; వెక్కివెక్కి ఏడ్చిన సోహైల్‌, మోనాల్‌

Published Wed, Nov 11 2020 11:15 PM | Last Updated on Thu, Nov 12 2020 5:16 AM

Bigg Boss 4 Telugu: Abhijeet Entered In Bigg Boss Just For Experience - Sakshi

ఇంట్లో ఒక్క‌రూ నాకు స‌పోర్ట్ చేయ‌లేదు అని అఖిల్ ఎప్పుడూ బాధ‌ప‌డుతూ ఉండేవాడు. మొద‌టిసారి అభి మిన‌హా అంద‌రూ ఏకాభిప్రాయంతో అఖిల్ పేరు చెప్పారు.. కానీ అత‌డిని హౌస్ నుంచి బ‌య‌ట‌కు పంపించ‌డానికి. అయితే ఓ ర‌కంగా ఇది అత‌నికి మంచే చేసింది. ఎవ‌రేంటని తెలుసుకునేందుకు మంచి అవ‌కాశం ల‌భించింది. అయితే అఖిల్ ఎలిమినేట్ కావ‌డంలో మోనాల్‌, సోహైల్ కీల‌క పాత్ర వ‌హించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచే అంశం. మ‌రి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో తెలియాలంటే ఇది చ‌దివేయండి..

గేమ్ కోసం ఫ్రెండ్ పేరు చెప్పిన సోహైల్‌, మోనాల్‌
అర్ధ‌రాత్రి ఇంటిస‌భ్యుల‌ను నిద్ర లేపిన బిగ్‌బాస్ అంద‌రినీ బ్యాగు స‌ర్దుకోమ‌ని ఆదేశించాడు. అనంత‌రం ఫినాలే వ‌ర‌కు సాగే మీ ప్ర‌యాణంలో ఎవ‌రు మీకు అడ్డుప‌డ‌తార‌ని భావిస్తారో ఆ వ్య‌క్తి పేరును ఏకాభిప్రాయంతో తెలియ‌జేయాల‌ని, అత‌డు త‌క్ష‌ణ‌మే హౌస్‌ను వీడి వెళ్లాల్సి ఉంటుంద‌ని చెప్పాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక‌ కంటెస్టెంట్లు త‌లలు ప‌ట్టుకున్నారు. అభిజిత్ మాత్రం త‌న‌కు అ‌డ్డు ప‌డేంత స్ట్రాంగ్ ఎవ‌రూ అనిపించ‌ట్లేదు అంటూనే ఇక్క‌డికి క‌చ్చితంగా గెల‌వ‌డానికి రాలేదు, ఎక్స్‌పీరియ‌న్స్ కోసం మాత్ర‌మే వ‌చ్చాన‌ని త‌న‌లో త‌నే మాట్లాడుకున్నాడు. అనంత‌రం సోహైల్‌, మోనాల్‌, అరియానా.. అఖిల్; మెహ‌బూబ్, అవినాష్‌‌.. అరియానా; అఖిల్‌, లాస్య, అభిజిత్ వాళ్ల‌ పేరును వాళ్లే చెప్పుకున్నారు. అంద‌రూ ఏ పేరు చెప్తే దానితో తాను ఏకీభ‌విస్తాన‌ని హారిక తెలిపింది. (చ‌ద‌వండి: నాకొక గ‌ర్ల్‌ఫ్రెండ్ కావాలి: అఖిల్‌)

ఎలిమినేష‌న్‌తో మూగ‌బోయిన అఖిల్‌
అఖిల్‌కు ఎక్కువ మెజారిటీ ఓట్లు ప‌డ‌టంతో అత‌డు హౌస్‌ నుంచి నిష్క్ర‌మించాడు. ఇది ఊహించ‌ని అత‌డు క‌న్నీళ్లు ఆపుకునేందుకు విశ్వ ప్ర‌య‌త్నం చేశాడు. మొద‌టి సారి ఏకాభిప్రాయంతో న‌న్ను సెల‌క్ట్ చేసుకున్నారు అంటూ త‌న బాధ‌ను చెప్పుకునేందుకు మాట‌లు వెతుక్కున్నాడు. సోహైల్‌, మోనాల్ క‌న్నీళ్ల ప‌ర్యంతం అవ‌గా అభిజిత్ మాత్రం క‌నీసం ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్ల‌లేదు. అఖిల్ లాగే సోహైల్‌, మోనాల్ గేమ్ ఈజ్ గేమ్ అని ఆలోచించారు. కానీ స్ట్రాంగ్ అని చెప్తూనే త‌న ఫ్రెండును బ‌య‌ట‌కు పంపించ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అని లాస్య‌, అభి, హారిక‌.. మోనాల్ తీరు మీద చ‌ర్చ‌లు పెట్టారు. తామైతే అలా చేయ‌లేమ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. (చ‌ద‌వండి: మోనాల్‌తో తెగ‌తెంపులు చేసుకున్న అభిజిత్‌!)

అబ‌ద్ధం చెప్పిన అభి, దండం పెట్టిన అఖిల్‌
మ‌రోవైపు అఖిల్ ఫేక్ ఎలిమినేష‌న్‌తో నేరుగా సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లాడు. ఈ అవ‌కాశం ల‌భించినందుకు ఆనందించిన అఖిల్‌ ఇప్పుడు త‌న‌కు క్లారిటీ దొరుకుతుంద‌ని భావించాడు. కానీ అక్క‌డ హౌస్‌లో మాత్రం మోనాల్‌, సోహైల్ చంటిపిల్ల‌ల్లా ఏడ్చారు. ఇక‌ త‌ర్వాతి రోజు నుంచి ఇంట్లో ఏం జ‌రుగుతుంద‌నేది అఖిల్ టీవీలో చూశాడు. ఈ సంద‌ర్భంగా మోనాల్ అత‌డిని తలుచుకుని క‌న్నీళ్లు కార్చ‌డం చూసి ఫీల‌య్యాడు. ఇక కెప్టెన్సీ టాస్కులో  సోహైల్ బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం ఏంట‌ని అభి హారిక‌తో అన్నాడు. వాళ్లు గొడ‌వ‌ప‌డి ప‌ది రోజులు మాట్లాడుకోలేదు అనడంతో ఇది పెద్ద అబద్ధ‌మంటూ అఖిల్ లోప‌ల నుంచే దండం పెట్టాడు. ఇక అభి కూడా ఇది క‌నక నువ్వు చూస్తుంటే వ‌చ్చాక దీని గురించి మాట్లాడ‌తాను అని అఖిల్‌ను ఉద్దేశించి చెప్పాడు. అఖిల్ వెళ్లిపోయాక ఇల్లు చాలా సైలెంట్‌గా అయిపోయింద‌ని మోనాల్ వెలితిగా ఫీల‌వుతుంటే త‌న‌కు మాత్రం ఎప్ప‌టిలాగే ఉంద‌ని అభి కౌంట‌రిచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement