లక్కీ లక్ష్మణ్‌గా సోహైల్‌.. మోషన్‌ పోస్టర్‌ చూశారా? | Bigg Boss Fame Syed Sohel Ryan 4th Movie Titled As Lucky Lakshman | Sakshi
Sakshi News home page

Syed Sohel Ryan: మొదటి సినిమా రిలీజ్‌ కాకముందే నాలుగో సినిమా మొదలుపెట్టిన సోహైల్‌

Published Sat, Apr 23 2022 8:04 AM | Last Updated on Sat, Apr 23 2022 9:01 AM

Bigg Boss Fame Syed Sohel Ryan 4th Movie Titled As Lucky Lakshman - Sakshi

‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్‌. అభి దర్శకత్వంలో ‘లక్కీ లక్ష్మణ్‌’ అనే సినిమాకి శ్రీకారం చుట్టారు. వైష్ణవి ఆర్ట్స్, దత్తాత్రేయ మీడియాపై హరిత గోగినేని, రమ్యా ప్రభాకర్‌  నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు క్లాప్‌ ఇవ్వగా, నిర్మాత సి. కల్యాణ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మిర్యాల రవీందర్‌ రెడ్డి, బెక్కం వేణుగోపాల్, పుప్పాల రమేష్, నటుడు రాజా రవీంద్ర స్క్రిప్ట్‌ను చిత్రయూనిట్‌కి అందించారు.

నిర్మాత అప్పిరెడ్డి ‘లక్కీ లక్ష్మణ్‌’ సినిమా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరిత గోగినేని మాట్లాడుతూ–  ‘‘ఐటీ రంగంతో నా ప్రయాణం ప్రారంభమైనా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సెటిల్‌ అయ్యాను. అభికి సినిమాపై ఉండే ప్యాషన్, తపన చూసి ఈ సినిమా నిర్మిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది’’ అన్నారు అభి. ‘‘నాకు కథ నచ్చితేనే సినిమా చేసేందుకు ఒప్పుకుంటాను’’ అన్నారు సోహైల్‌. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్, కెమెరా: ఐ. ఆండ్రూ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయానంద్‌ కీత.

చదవండి: ఆగని 'ఆర్ఆర్ఆర్‌' కలెక్షన్లు.. ఎంత వసూలు చేసిందంటే ?

 కేజీఎఫ్‌ 2 మూవీపై అల్లు అర్జున్‌ ప్రశంసలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement