Syed Sohel Ryan gives warning to trollers in Lucky Laxman Pre Release Event - Sakshi
Sakshi News home page

Syed Sohel Ryan: నేనేం దొంగతనం చేయలేదు, మోసం చేయలేదు..

Published Wed, Dec 28 2022 4:30 PM | Last Updated on Wed, Dec 28 2022 5:46 PM

Syed Sohel Ryan Warning to Trollers in Lucky Laxman Pre Release Event - Sakshi

ఎవరినీ మోసం చేయలేదు, దొంగతనం అంతకన్నా చేయలేదు. నాకు ఆఫర్‌ వచ్చింది తీసుకున్నా.. ఎందుకంటే మాలాంటి మధ్యతరగతి వాళ్లకు రూ.25 లక్షలంటే రెండు

సయ్యద్‌ సోహైల్‌.. మొదటగా సీరియల్స్‌లో, సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించాడు. కానీ అంత గుర్తింపు రాలేదు. అయితే బిగ్‌బాస్‌ షో అతడి తలరాతనే మార్చేసింది. ఈ ఒక్క షో వల్ల చిన్నచిన్న రోల్స్‌ చేసుకునే స్టేజ్‌ నుంచి హీరోగా నటించే స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం మూడు, నాలుగు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు సోహైల్‌. అయితే బిగ్‌బాస్‌ ప్రైజ్‌మనీ గురించి ఎప్పుడు చర్చ వచ్చినా సోహైల్‌ పేరు తప్పకుండా వినిపిస్తోంది. బిగ్‌బాస్‌ ఆఫర్‌ చేయగానే రూ.25 లక్షలు తీసుకున్నాడంటూ కొందరు ఇప్పటికీ అతడిని విమర్శిస్తూనే ఉన్నారు. ఈ ట్రోలింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు సోహైల్‌.

లక్కీ లక్ష్మణ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సోహైల్‌ మాట్లాడుతూ.. 'సూట్‌కేస్‌ తీసుకెళ్లాడు, పెద్ద స్కామ్‌ చేశాడంటున్నారు. ఆ డబ్బులు మీ ఇంట్లో నుంచి తీసుకోలేదు. ఎవరినీ మోసం చేయలేదు, దొంగతనం అంతకన్నా చేయలేదు. నాకు ఆఫర్‌ వచ్చింది తీసుకున్నా.. ఎందుకంటే మాలాంటి మధ్యతరగతి వాళ్లకు రూ.25 లక్షలంటే రెండు కోట్లతో సమానం. ఆ డబ్బుతో నా చెల్లె పెళ్లి చేశాను. ప్రజలు వేసిన ఓట్లు ఏవీ వృథా కాలేదు. ఓ ఆడపిల్ల పెళ్లి చేశా, అంతకంటే ఏం కావాలి. నాకు వచ్చే డబ్బుల్లో పదిమందికి సాయం చేయడమే నాకు తెలుసు. నన్ను ఎవరైతే తిడుతున్నారో వాళ్లకు ఒకటే చెప్తున్నా.. నన్ను ఎంత హేట్‌ చేసినా పర్లేదు కానీ పేరెంట్స్‌ను తిడితే మాత్రం ఊరుకోను. కొడకల్లారా? మీ ఇంటికొచ్చి తరిమి తరిమి మరీ కొడ్తా.. సినిమా ఇండస్ట్రీలోని ఎవరినైనా సరే విమర్శించండి తప్పులేదు, కానీ వారి ఇంట్లోవాళ్లను గలీజ్‌ బూతులు తిడితే మాత్రం వెతికి మరీ కొడ్తా' అని స్టేజీపై వార్నింగ్‌ ఇచ్చాడు. కాగా లక్కీ లక్ష్మణ్‌ చిత్రం ఈ నెల 30న రిలీజ్‌ కానుంది.

చదవండి: చెప్పులు కూడా వదిలేసి పారిపోయిన హీరోయిన్‌
కొడుకు చనిపోయాడు, అదే రోజు వాల్తేరు వీరయ్య షూటింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement