
సాక్షి, విజయవాడ: బిగ్‌బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ విజయవాడలో సందడి చేశాడు. ఆదివారం నాడు నగరంలోని పాతబస్తీ పంజా సెంటర్‌లో అభిమానులను కలిసి వారిని సంతోషపర్చాడు. నాలుగు చోట్ల అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని కేక్ కట్ చేశాడు. ఈ సందర్భంగా తనను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక సోహైల్ వస్తున్నాడని తెలుసుకుని అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఆయన్ను ఆహ్వానిస్తూ దారి పొడవునా కటౌట్లు వెలిశాయి.
అభిమానులతో వేడుకల అనంతరం సోహైల్ మీడియాతో మాట్లాడుతూ.. నేను ఎవరో తెలీకపోయినా బిగ్‌బాస్ షోలో నన్ను ప్రోత్సహించిన అభిమానులను కలిసి కృతజ్ఞతలు చెప్పేందుకు విజయవాడ వచ్చాను. జార్జి రెడ్డి డైరెక్టర్ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో మార్చి ఒకటో తేదీ నుంచి ఒక సినిమా చేస్తున్నాను. విజయవాడలో ఉన్న నా మిత్రుడు మగ్బుల్ దగ్గరకు గతంలో చాలాసార్లు వచ్చాను. అప్పుడు నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు. కానీ బిగ్‌బాస్ షోకు వచ్చాక నాకు మంచి గుర్తింపు వచ్చింది. నాపై ఇంత ఆదరణ చూపిస్తున్న అభిమానులందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు. (చదవండి: ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పిన సమంత.. కారణం ఇదే!)
(చదవండి: అల్లు అర్జున్ కార్‌వాన్‌కు ప్రమాదం)