
పెదరాయుడు అంటే జనం కళ్లలో భయం, భక్తి దోబూచులాడుతుంటాయి. ఆయన వస్తున్నాడంటే జనమంతా పక్కకు జరిగి, వంగి వంగి దండాలు పెడుతూ ఆయనకు దారిస్తారు. అంత మర్యాదిస్తారు. అది సినిమాలో! కానీ ఇక్కడ పెదరాయుడు అంటే మర్యాద మాట దేవుడెరుగు. కానీ అగౌరవపర్చకపోతే అదే పదివేలు అనే పరిస్థితి దాపురించింది. ఇంతకీ ఇదెక్కడనుకుంటున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో! అవును, బిగ్‌బాస్ ఇచ్చిన పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్కులో సోహైల్ పెదరాయుడిగా ఒదిగిపోయాడు. కానీ అతడి ప్రతిభను ఎవరూ గుర్తించట్లేదు. మిగతా ఇంటిసభ్యులు ఆయన మీదే జోకులు పేలుస్తున్నారు. అయినా సరే సోహైల్ తన పెద్దరికాన్ని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో నేడు ఓ పంచాయితీలో తీర్పు చెప్పబోతున్నాడు. (చదవండి: బిగ్‌బాస్: మారథాన్ ఎపిసోడ్ రేటింగ్ ఎంతంటే..)
అవినాష్ అరియానాతో ఉన్న సమస్యను పెదరాయుడు ముందు ఏకరువు పెట్టాడు. అప్పుడప్పుడు ఆమె పిచ్చిపిచ్చిగా చేస్తుందని తెలిపాడు. అటు అరియానా.. అవినాష్ తనను నెట్టేశాడని చెప్పింది. దీనికి పెదరాయుడుగా సోహైల్ తీర్పు చెప్పాల్సి ఉండగా అఖిల్ మధ్యలో దూరుతున్నాడు. దీంతో అతడిని ఆగమని వారించాడు. అమ్మాయి మీద చెయ్యేసిన అవినాష్‌ను నోర్మూయ్ అంటూ మండిపడ్డాడు. మరి సోహైల్ దగ్గరికి ఏం పంచాయితీ వచ్చింది? ఇతడు ఏమని తీర్పు ఇచ్చాడో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ టాస్కు గురించి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. టాస్కు నీరసంగా సాగుతోందని కొందరు పెదవి విరుస్తుంటే హారిక సీక్రెట్ టాస్క్ బాగా చేస్తోందని మరికొందరు ప్రశంసిస్తున్నారు. ఇక అభిజిత్, మోనాల్‌కు సరైన పాత్రలు ఇవ్వలేదని పెదవి విరుస్తున్నారు. (చదవండి: హారికతో మూడు హత్యలు చేయిస్తున్న బిగ్‌బాస్)