పల్లవి ప్రశాంత్‌ వల్ల నన్ను బాధపెట్టారు.. నా సపోర్ట్‌ ఎవరికంటే: సోహైల్ | Bigg Boss Syed Sohel Comments On Pallavi Prashanth | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్‌ గురించి ఆశ్చర్యపోయే విషయాలు చెప్పిన సోహైల్‌

Published Thu, Oct 12 2023 6:42 PM | Last Updated on Thu, Oct 12 2023 7:14 PM

Bigg Boss Syed Sohel Comments On Pallavi Prashanth - Sakshi

'బిగ్ బాస్' ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ అందరికీ పరిచయమే ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకున్నాడు. త్వరలో సోహైల్‌ 'బూట్‌కట్‌ బాలరాజు' సినిమాతో త్వరలో వస్తున్నాడు. ఈ సినిమా పనిలో ఆయన చాలారోజుల నుంచి బిజీగా ఉన్నాడు.  ప్రస్తుతం నిర్మాణాంతర పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సినిమాకు ఎం.డి.పాషా నిర్మాత. మేఘ లేఖ కథానాయిక. సునీల్‌, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పాట మంచి గుర్తింపు తెచ్చు​కుంది.

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన బిగ్‌బాస్‌ సీజన్‌ 7 గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. బిగ్‌బాస్‌ షోను రెగ్యులర్‌గా తాను చూడటం లేదని చెప్పిన సోహైల్‌.. పల్లవి ప్రశాంత్‌ను మెచ్చుకున్నాడు. 'బిగ్‌బాస్‌ షోలో ఉన్న కంటెస్టెంట్ల పట్ల ప్రశాంత్‌ ఎక్కడ కూడా దురుసు మాటలు మాట్లడలేదు. లూజ్‌ టంగ్‌ ఉపయోగించలేదు. వాడు పెద్దగా చదువుకోలేదు.. కానీ ఎక్కడా ఇతరుల పట్ల అగౌరవంగా ప్రవర్తించలేదు. అది నాకు నచ్చింది కాబట్టి ఒకసారి నా సోషల్‌ మీడియాలో 'ఫార్మర్‌' అని మాత్రమే మెసేజ్‌ పెట్టాను. అందుకు నన్ను తిడుతూ వెంటనే ఎన్నో మెసేజ్‌లు వచ్చాయి.

నేను ఏం తప్పు చేశాను. ప్రశాంత్‌ తీరు నచ్చి ఆ మెసేజ్‌ మాత్రమే చేసినా.. అందుకు కొందరు నన్ను దొంగ, ఫాల్తు, ఫ్రాడ్‌ గాడు అంటూ గలీజు కామెంట్లు చేశారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది.  దీంతో బిగ్‌బాస్‌ గురించి ఎక్కడా మాట్లడటం లేదు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఒక్కోసారి నేను కూడా ట్రిగ్గర్‌ అవుతాను. అప్పుడు నేను కూడా నాలుగు మాటలు అనవచ్చు.. అందువల్ల వాళ్లు కూడా బాధపడుతారు. ఎందుకు ఇవన్నీ అని దూరంగా ఉన్నాను.' అని సోహైల్‌ తెలిపాడు. తనకు అమర్‌ దీప్‌తో పాటు హోస్‌లో చాలమంది స్నేహితులు ఉన్నారు. వారి పేరును చెప్పనందుకు బాధ కలగవచ్చు అందుకు తానేమీ చేయలేనని సోహైల్‌ చెప్పాడు.


వాడు నా కోసం కష్టపడ్డాడు
సోహైల్‌ నటించిన లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాల కోసం పల్లవి ప్రశాంత్‌ చాలా కష్టపడ్డాడని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సినిమాల ప్రమోషన్స్‌ కోసం వాడు కనీసం నిద్రపోకుండా కష్టపడ్డాడు. నా రూమ్‌ వద్దకు వచ్చి వాడే ఆ సినిమా ప్రమోషన్స్‌ పనులను చూసుకున్నాడు అని సోహైల్‌ తెలిపాడు. ఈ వ్యాఖ్యలతో పల్లివి ప్రశాంత్‌ను అభిమానించే వారు ఆశ్చర్యపోతున్నారు. సోహైల్‌ కోసం ఇంతలా కష్టపడినా ఓట్ల కోసం ఆయన పేరును హోస్‌లో ప్రశాంత్‌  ఎక్కడా ప్రస్థావించలేదని చెప్పుకొస్తున్నారు.          

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement