
హుస్నాబాద్: బుల్లితెర వీక్షకులను అలరించిన తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సోహైల్‌కు శనివారం రాత్రి హుస్నాబాద్ పట్టణంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. వరంగల్ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న సోహైల్‌కు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో అభిమానులు స్వాగతం పలికారు. కొద్ది సేపు ఆగి వారితో మాట్లాడారు. కాగా సోహైల్‌కు స్నేహితుడు ఒకరు అతని వాహనంలో ప్రయాణించడంతో.. స్నేహితుడి స్వగ్రామం హుస్నాబాద్ కావడంతో అతని కోరిక మేరకు హుస్నాబాద్ నుంచి వెళ్దామని కోరడంతో సోహైల్ వరంగల్ నుంచి హుస్నాబాద్ మీదుగా కరీంనగర్‌కు వెళ్లేందుకు పయనమయ్యాడు.
అప్పటికే తన స్నేహితుడి సమాచారం మేరకు అయనను కలుసుకునేందుకు హుస్నాబాద్ పట్టణంలో అభిమానులు సిద్ధమయ్యారు. అంబేడ్కర్ చౌరస్తాలో సోహైల్‌కు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా బిగ్‌బాస్ షోలో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా, చివరకు 5గురు టాప్ 5 ఫైనల్ కంటెస్టెంట్స్‌గా నిలిచారు. కాగా చివరి ముగ్గురిలో వెళ్లిపోవడానికి ఇష్టపడిన వారిలో సోహైల్ అంగీకరించడంతో అతను రూ.25లక్షలు ప్రైజ్‌మనీ పొందాడు.