
వారమంతా కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ వచ్చారు. ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు కంటెస్టెంట్ల ఫ్రెండ్స్ కూడా స్టేజీపైకి వచ్చారు. వారికి నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. తమ కుటుంబ సభ్యుడిని మినహాయించి మిగతావారిలో ఎవరు టాప్ 5లో ఉంటారో చెప్పాలన్నాడు. మరి ఎవరెవరు ఏయే కంటెస్టెంట్లను టాప్ 5లో పెట్టారో నేటి (నవంబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..

టాప్ 5 ర్యాంకులు
మొదట ప్రేరణ తల్లి రూప, చెల్లి ప్రకృతితో పాటు నటి ప్రియ వచ్చారు. ప్రకృతి మిస్ ఇండియా తెలంగాణతో పాటు బెనెటి యూనివర్సిటీ మిస్ సుడోకుగా నిలిచిందంటూ నాగ్ అభినందించాడు. తర్వాత ప్రేరణ తల్లి.. నిఖిల్‌ను మొదటి స్థానంలో, నబీల్‌ను రెండో స్థానంలో, గౌతమ్, యష్మి, రోహిణిలను మిగతా మూడు స్థానాల్లో పెట్టారు.

రవి సలహాను లెక్కచేయని విష్ణు
తర్వాత విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి పావని, యాంకర్ రవి వచ్చారు. నీకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చుకోకపోతే జనాలు నీకెందుకు ఓట్లు వేస్తారు? ముందు నీకు నువ్వు ముఖ్యం అనుకుని గేమ్ ఆడమని రవి సలహా ఇచ్చాడు. కానీ విష్ణుప్రియ వింటేగా..? నాకోసం నేను ఆలోచిస్తే అహంకారమంటూ పిచ్చిగా మాట్లాడింది. దీంతో పావని నీపై నువ్వు ఫోకస్ చేయు అని హెచ్చరించడంతో కాస్త వెనక్కు తగ్గింది.

కోవై సరళ కంటే పెద్ద ఆర్టిస్టు..
వీరు గౌతమ్‌ను 1, నిఖిల్‌ను 2, నబీల్‌ను 3, పృథ్వీని 4, రోహిణిని 5వ స్థానంలో పెట్టారు. రోహిణి కోసం నాన్నతో పాటు నటుడు శివాజీ స్టేజీపైకి వచ్చారు. కోవై సరళ కంటే కూడా పెద్ద ఆర్టిస్టు అవుతావు అని శివాజీ.. రోహిణిని మెచ్చుకున్నాడు. టాప్ 5 గురించి మాట్లాడుతూ.. విష్ణు 1, నబీల్ 2, నిఖిల్ 3, గౌతమ్ 4, తేజ 5వ స్థానంలో ఉంటారన్నాడు.

గౌతమ్ సాయం మర్చిపోని సోహైల్
పృథ్వీ కోసం తమ్ముడు విక్రమ్, నటి దర్శిని వచ్చారు. నిఖిల్, నబీల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియను టాప్ 5లో వరుస స్థానాల్లో ఉంచారు. పృథ్వీ సేవ్ అయినట్లు ప్రకటించారు. గౌతమ్ తల్లి మంగమ్మతో పాటు నటుడు సోహైల్ వచ్చారు. ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ.. నా సినిమా రిలీజ్ సమయంలో 120 టికెట్లు స్పాన్సర్ చేసి జనాలకు చూపించాడు అని తెలిపాడు.

నబీల్ కోసం భోలె
ఇక నబీల్‌ను 1, నిఖిల్‌ను 2, ప్రేరణను 3, తేజను 4, అవినాష్‌ను 5వ స్థానాల్లో పెట్టారు. తర్వాత గౌతమ్‌ను సేవ్ చేశారు. నబీల్ కోసం అతడి సోదరుడు సజీల్‌తో పాటు సింగర్ భోలె షావళి వచ్చారు. వీళ్లు నిఖిల్, గౌతమ్, అవినాష్, తేజ, విష్ణుప్రియకు టాప్ 5 ర్యాంకుల్ని వరుసగా ఇచ్చారు.





Comments
Please login to add a commentAdd a comment