ప్రేరణకు భంగపాటు.. మోసం చేయడం మానుకోమన్న పృథ్వీ తల్లి | Bigg Boss 8 Telugu November 14th Full Episode Review And Highlights: Gautam Krishna, Prithviraj Shetty, Vishnupriya Family Enters Into House | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Nov 14th Highlights: పృథ్వీతో పెళ్లికి విష్ణు తండ్రి ఓకే.. లవ్‌ట్రాక్‌ జోలికే వెళ్లొద్దన్న గౌతమ్‌ అన్న

Published Thu, Nov 14 2024 11:47 PM | Last Updated on Fri, Nov 15 2024 11:09 AM

Bigg Boss Telugu 8: Gautam Krishna, Prithviraj Shetty, Vishnupriya Family Enters into House

ఫ్యామిలీ వీక్‌తో కంటెస్టెంట్ల ముఖాలు వెలిగిపోతున్నాయి. తేజ మాత్రం తిరునాళ్లలో తప్పిపోయిన చిన్నపిల్లాడిలా తల్లికోసం ఏడుస్తూనే ఉన్నాడు. ఈ రోజు (నవంబర్‌ 14) ఎవరెవరు హౌస్‌లోకి వచ్చారో చూసేద్దాం..

స్ట్రాటజీ ప్రకారం లవ్‌ ట్రాక్‌?
మొదటగా విష్ణుప్రియ తండ్రి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆమెతో.. గ్రూప్‌ గేమ్‌ వద్దు, నీ ఆట నువ్వు ఆడు. నువ్వు కష్టపడితే కప్పు గెలుస్తావు. నువ్వు కొద్దిగా అటువైపు (పృథ్వీతో) ఉంటున్నావని నీ అభిమానులే బాధపడుతున్నారు. నువ్వు స్ట్రాటజీ ప్రకారం అతడితో లవ్‌ ట్రాక్‌ నడుపుతూ గేమ్‌ ఆడుతున్నావు. అదంతా జనాలు నిజమనుకుంటారు అని చెప్పుకుంటూ పోయాడు.

అతడి వల్లే ఉండగలుగుతున్నా
ఇంతలో విష్ణు మధ్యలో కలగజేసుకుంటూ అది స్ట్రాటజీ కాదని, తన ఫీలింగ్స్‌ నిజమేనని తెలిపింది. ఇది ప్రేమ కాదు, ఒకలాంటి ఇష్టం తనపై ఉంది.. అతడి వల్లే ఎన్నిరోజులైనా హౌస్‌లో ఉండగలుగుతానన్న ధైర్యం వచ్చింది. నాకు తనపై ఫీలింగ్‌ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు కప్పేయాలి? అని ప్రశ్నించింది. అందుకాయన నవ్వుతూ నీ గేమ్‌ నువ్వు ఆడు అని సలహా ఇచ్చాడు.

అన్యాయం చేశా
విష్ణుకు తండ్రి ప్రేమ అందించలేకపోయానని ఎమోషనల్‌ అయ్యాడు. విష్ణు పుట్టాక చాలారోజులు తన దగ్గరకు వెళ్లలేదు. తన చిన్నతనంలో సంతోషాన్ని పంచలేకపోయాను. కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నాను. వాళ్లకు అన్యాయం చేశాను. పైసా కూడా వాళ్లకు పెట్టలేకపోయాను. అందుకు ఇప్పటికీ నేను సారీ చెప్తున్నాను అన్నాడు.

పృథ్వీతో పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ 
పెళ్లి ప్రస్తావన రాగా విష్ణుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేస్తానన్నాడు. పృథ్వీతో లవ్‌ ట్రాక్‌ గురించి మాట్లాడుతూ.. అదంతా కేవలం ఈ హౌస్‌లోనే.. గేమ్‌ అయిపోయాక ఏముండదు అన్నాడు. దాంతో విష్ణు.. ఏమో, అదిప్పుడే చెప్పలేమని సిగ్గుపడగా తనకు ఎవరైనా ఓకే అంటూ తండ్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. తర్వాత ఆయన ఓ గేమ్‌ ఆడి కూతురి కోసం బర్గర్‌ సంపాదించాడు.

విష్ణు నచ్చేసిందన్న పృథ్వీ తల్లి
అనంతరం అమ్మ పాట రాగానే తేజ కన్నీటితో ఆశగా గేటువైపు చూశాడు. కానీ అక్కడ పృథ్వీ తల్లి సత్యభామ లోనికి వచ్చింది. అందరికీ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి విష్ణును మాత్రం ప్రేమగా హత్తుకుంది. పృథ్వీని కన్నందుకు థాంక్యూ అంటూ విష్ణు ఆమె పాదాలపై పడింది. కోడలిగా విష్ణుప్రియ ఓకేనా అని నిఖిల్‌ అడగ్గా.. అన్నీ వాడిష్టం.. వాడికి నచ్చితే ఓకే అని సిగ్నల్‌ ఇచ్చేసింది.

ఇన్ని రోజులు ఉంటావనుకోలేదు
అందరితో కలిసుండు, ఎవరితోనూ గొడవపడకు. నామినేషన్‌ చేసేటప్పుడు వాళ్లతో వీళ్లతో చెప్పకు. ఎవరి గురించో నామినేట్‌ చేయకు. నీ గురించి చేయు. నీ టాలెంట్‌ చూపించుకోవడానికి బిగ్‌బాస్‌ మంచి ఛాన్స్‌. ఇన్ని రోజులు ఉంటావనుకోలేదు. గేమ్‌లో మోసం చేయకుండా నిజాయితీగా ఆడు అని సలహాలు, సూచనలు ఇచ్చింది.

ప్రేరణకు భంగపాటు
ఎవరు ఎక్కువ ఇష్టమని పృథ్వీ అడగ్గా విష్ణు పేరు చెప్పింది. డ్యాన్స్‌ బాగా చేస్తుంది, దేవుడి భక్తురాలు, జెన్యూన్‌ అంది. సత్యభామ తన కొడుకుతో పాటు విష్ణుకు సైతం గోరుముద్దలు తినిపించింది. భర్త రాక కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రేరణకు భంగపాటు ఎదురైంది. హౌస్‌లోకి రాలేకపోతున్నానంటూ తన కటౌట్‌ను పంపించాడు. నువ్వు ట్రోఫీ ఎత్తినప్పుడు వస్తానంటూ వీడియో సందేశం పంపాడు.

నిన్ను టార్గెట్‌ చేయరు
అనంతరం గౌతమ్‌ అన్నయ్య డాక్టర్‌ జగదీష్‌ వచ్చాడు. అందరికీ ఇన్‌పుట్స్‌ వచ్చాయి కాబట్టి నిన్ను టార్గెట్‌ చేయరు. సోలోగానే ఆడు. ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీలు వద్దు.. మరీ ఎక్కువ కోప్పడకు. అనుకున్న లక్ష్యానికి దగ్గరలో ఉన్నావు అని చెప్పాడు. చివరగా తమ్ముడితో కలిసి ఓ గేమ్‌ ఆడి రూ.51 వేలు గెలిచారు. అది ప్రైజ్‌మనీలో యాడ్‌ చేయగా మొత్తం రూ.50,30,000కు చేరింది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement