
అమ్మను మించిన సెంటిమెంట్ మరొకటి ఏముంటుంది? మీ అమ్మ రాదు, రానివ్వను అని తేజను భయపెట్టి ఏడిపించిన బిగ్‌బాస్ చివరకు పట్టువదిలాడు. తల్లిని లోనికి పంపించాడు. దానికంటే ముందు, తర్వాత ఏం జరిగిందో నేటి (నవంబర్ 15) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..

కటౌట్ తీసేయమన్న బిగ్‌బాస్
ఫ్యామిలీ వీక్ అయిపోంది.. కాబట్టి ప్రేరణ.. తన భర్త శ్రీపాద కటౌట్‌ను స్టోర్ రూమ్‌లో పెట్టేయాలన్నాడు బిగ్‌బాస్. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కాసేపటికే ఆమె పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్.. శ్రీపాదను హౌస్‌లోకి పంపించాడు. అతడు రావడంతోనే భార్య నుదుటన తిలకం దిద్దాడు. వీరికి బ్యూటిఫుల్ డిన్నర్ డేట్ కూడా ఏర్పాటు చేయడం విశేషం.

ప్రేమ కావాలి..
అది చూసిన విష్ణు, రోహిణి తెగ ఫీలైపోయారు. విష్ణు అయితే.. పృథ్వీ తనను ప్రేమించట్లేదంటూ బాధపడింది. అతడికి నువ్వంటే ఇష్టం ఉంది కానీ ప్రేమ కాదు అని యష్మి క్లారిటీ ఇచ్చింది. అయినా సరే నాకు ప్రేమ కావాలని విష్ణు పిచ్చిపట్టినట్లే ప్రవర్తించింది. మరోవైపు శ్రీపాద.. గొడవలన్నింటికీ మూలకారణమైన కిచెన్ నుంచి బయటకు వచ్చేయమని ప్రేరణకు సూచించాడు. తెగేదాక గొడవలు లాక్కురావద్దన్నాడు.

లవ్ సాంగ్
తర్వాత భార్యతో కలిసి గేమ్ ఆడాడు. ఈ గేమ్ వల్ల కిచెన్ టైమర్‌కు రెండు గంటలు యాడ్ అయింది. అందరి ఫ్యామిలీస్ వచ్చాయి కానీ తన తల్లి మాత్రం రాలేదని తేజ బెంగపెట్టుకున్నాడు. అనంతరం బిగ్‌బాస్ సరదాగా లవ్ సాంగ్ ప్లే చేస్తే నిఖిల్-యష్మి, పృథ్వీ-విష్ణు అందులో లీనమై స్టెప్పులేశారు. తర్వాత మెగా చీఫ్ కోసం గేమ్ పెట్టారు. ఇందులో తేజ తప్ప మిగతా అందరూ పాల్గొనాల్సి ఉంటుందన్నాడు.

ఏడుస్తుంటే చూడలేకపోతున్నా..
ఈ గేమ్‌లో అవినాష్ గెలిచి మెగా చీఫ్‌గా నిలిచాడు. తల్లి కోసం తేజ ఏడుస్తూనే ఉన్నాడు. అతడి బాధను అర్థం చేసుకున్న బిగ్‌బాస్ ఆమెతో ఫోన్ కాల్ మాట్లాడిపించాడు. నేను రావట్లేదని బాధపడకు, నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నా అని ఫోన్‌లో ఓదార్చింది. కాసేపటికే నేరుగా ప్రత్యక్షమైంది. అమ్మను చూడగానే తేజ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.

గోరుముద్దలు
తల్లి ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. నువ్వు బాగా ఆడుతున్నావు. ఫినాలేలో చూడాలనుందని తన కోరిక బయటపెట్టింది. అలాగే తను ప్రేమగా వండుకొచ్చిన చికెన్, ఆలుగడ్డ కూరను అన్నంలో కలిపి అందరికీ గోరుముద్దలు తినిపించింది. అమ్మను బిగ్‌బాస్ షోలో చూపించాలన్న కల నెరవేరిందంటూ తేజ తెగ సంబరపడిపోయాడు.


Comments
Please login to add a commentAdd a comment