మరో ఐదు రోజుల్లో కంటెస్టెంట్లు ఉండరు, బిగ్‌బాస్ హౌసూ ఉండదు. ఉన్న నాలుగురోజులైనా టాప్ 5 కంటెస్టెంట్లను, వారి జర్నీని, బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌ను ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందామంటే బిగ్‌బాస్ ఆ ఛాన్సే ఇవ్వట్లేదు. వరుసపెట్టి సీరియల్ ఆర్టిస్టులను పంపిస్తూనే ఉన్నాడు. సీరియల్స్ ప్రమోషన్ జరిపిస్తూనే ఉన్నాడు. మరి ఈ రోజెవరొచ్చారో నేటి (డిసెంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
సీరియల్ బ్యాచ్‌పై గెలుపు
వంటలక్క సీరియల్ టీమ్ హౌస్‌లోకి వచ్చింది. వీరితో ప్రేరణ, అవినాష్ గేమ్ ఆడి గెలిచారు. దీంతో బిగ్‌బాస్ రూ.10,928 ప్రైజ్‌మనీలో యాడ్ చేశాడు. తర్వాత మగువ.. ఓ మగువ సీరియల్ టీమ్ హౌస్‌మేట్స్‌తో చిట్‌చాట్ చేసింది. అప్పుడు కూడా అవినాష్ తన కామెడీ యాంగిల్‌తో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అనంతరం అందరూ కలిసి ఓ ఫన్ గేమ్ ఆడారు.
ప్రేరణ నోటికి తాళం
మ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు ఒకరి చేతిలోని బాక్స్‌ను మరొకిరి ఇస్తూ పోవాలి. మ్యూజిక్ ఆగిపోయినప్పుడు ఎవరి చేతిలో అయితే ఆ బాక్స్ ఉంటుందో దాన్ని తెరిచి అందులో ఏది రాసుంటే అది ఫాలో అయిపోవాలి. అలా మొదటగా ప్రేరణ చేతిలో బాక్స్ ఉన్నప్పుడు మ్యూజిక్ ఆగిపోయింది. అందులో గేమ్ అయిపోయేవరకు ప్రేరణ నోరు తెరవకూడదని ఉంది. ఆమె తరపున అవినాష్ మాట్లాడాలని ఉంది.
దెబ్బలు తిన్నాడ్‌రోయ్
రెండో రౌండ్‌లో అవినాష్ వంతురాగా.. తనకు ఇచ్చిన టాస్క్ ప్రకారం అందరిపై ఫేక్ పొగడ్తలు కురిపించాడు. తర్వాత నిఖిల్ మార్నింగ్ పనులను డ్యాన్స్ రూపంలో చేయగా.. నబీల్ రెండు పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తిన్నాడు. చివర్లో అవినాష్ అందరితో దెబ్బలు తిన్నాడు. అనంతరం మగువ ఓ మగువ టీమ్‌తో ప్రేరణ, గౌతమ్ టాస్క్ ఆడి రూ.10,0010 గెలిచారు.
ప్రేరణకు కలిసొచ్చిన అదృష్టం
బీబీ పరివారంపై మా పరివారం ఇప్పటివరకు ఒక్క టాస్క్ గెలిచిందే లేదు! మరి రేపటి ఎపిసోడ్‌లో అయినా ఈ రికార్డును ఎవరైనా బ్రేక్ చేస్తారేమో చూడాలి! అలాగే వచ్చిన అందరూ.. హౌస్‌లో ఒక్క అమ్మాయే ఉందంటూ ప్రతి గేమ్‌లోనూ తననే సెలక్ట్ చేసుకుంటున్నారు. అలా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వందశాతం ఉపయోగించుకుంటోంది ప్రేరణ. ఈ టాస్కుల్లో తన కష్టాన్ని చూసి ప్రేరణకు మరిన్ని ఓట్లు పడే అవకాశం లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment