సినిమా షూటింగ్‌లో సొహైల్‌ గొడవ | Bigg Boss Fame Sohel Serious on Movie Team | Sakshi

సినిమా షూటింగ్‌లో సొహైల్‌ గొడవ

Apr 4 2021 5:06 PM | Updated on Apr 4 2021 8:47 PM

Bigg Boss Fame Sohel Serious on Movie Team - Sakshi

బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో వెలుగులోకి వచ్చిన నటుడు సొహైల్. అయన‌ హీరోగా ఒక మూవీ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న సొహైల్‌ తన చిత్రబృందంలోని ఓ సభ్యుడితో గొడవకు దిగాడు. ఆ గొడవ కాస్త ఇద్దరు కొట్టుకునే స్థాయికి చేరింది. అక్కడ ఉన్న చిత్ర బృందం చెప్పిన వినకుండా ఇద్దరు పరస్పరం పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఒకరిమీద అరుసుకున్నారు. ఒక్కసారి గొడవ వల్ల షాక్ గురైన నిర్మాత తనకు ఇలాంటివి నచ్చవని.. వెంటనే గొడవ ఆపాలని వారికీ సూచించాడు. ఈ గొడవను చూసిన మూవీ హీరోయిన్‌ సైతం షాక్ గురైంది. అయితే, ఇదంతా నిజం కాదని కేవలం ప్రాంక్‌ కోసం మాత్రమే గొడవపడినట్లు సొహైల్‌ తర్వాత వారికి చెప్పాడు. ఈ ప్రాంక్‌ గురించి నిర్మాతతోపాటు హీరోయిన్‌కీ తెలియదని సొహైల్ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

చదవండి:

రజనీకాంత్‌ నటించిన తొలి తెలుగు చిత్రం తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement