సుజాత ఎలిమినేట్‌, 'పోకిరీ'పై ప్ర‌తీకారం | Bigg Boss 4 Telugu: Evicted Sujatha Bigg Bomb On Sohel To Clean Dishes | Sakshi
Sakshi News home page

ఎలిమినేట్ అవుతా అనుకోలే: సుజాత‌

Published Sun, Oct 11 2020 11:03 PM | Last Updated on Tue, Oct 13 2020 2:45 PM

Bigg Boss 4 Telugu: Evicted Sujatha Bigg Bomb On Sohel To Clean Dishes - Sakshi

బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్‌లో ఆరో కంటెస్టెంటు షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్ర‌స్తుతం హౌస్‌లో ఇంటి స‌భ్యుల సంఖ్య ప‌ద‌మూడుకు చేరింది. గంగ‌వ్వ చెప్పిన‌ట్టుగానే సుజాత నేడు బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. నాగ్‌ను చివ‌రిసారిగా బిట్టూ అని పిలుస్తూ న‌వ్వుతూ అంద‌రి ద‌గ్గ‌రా సెల‌వు తీసుకుంది. ఇక ఏ ప‌నీ చేయ‌ని కెప్టెన్‌కు ఒళ్లు వంచి ప‌ని చేసేలా బిగ్‌బాంబ్ వేసింది. మ‌రి ఆ బిగ్‌బాంబ్ ఏంటో?, నేటి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో చ‌దివేసేయండి..

ఆ పిల్ల నాది: అఖిల్‌
సండేను ఫండే చేసేందుకు నాగ్ ఇంటి స‌భ్యుల‌తో గేమ్ ఆడించారు. డంబ్ షేరాడ్స్ ఆడిస్తూనే ఒక్కో ఇంటి స‌భ్యుడిపై ఒక్కో పోస్ట‌ర్ వ‌దిలారు. అలా ఊహ‌లు గుస‌గుస‌లాడే టైటిల్‌ను సుజాత‌కు అంకితం ఇచ్చారు. అభిజిత్‌ను వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వర్‌గా ప్ర‌క‌టించగా అత‌డు అరియానాతో క‌లిసి డ్యాన్స్ చేశాడు. దీంతో ఆమె తెగ ఎక్జైట్ అయిపోయింది. అనంత‌రం నాగ్‌తో పాటు ఇంటి స‌భ్యులు అభిజిత్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌ర్వాత‌ మెహ‌బూబ్‌కు రేసు గుర్రం పోస్ట‌ర్, అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు మాస్ట‌ర్‌, నోయ‌ల్‌కు శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్‌, అరియానాకు జ‌ల్సా, సోహైల్‌కు పోకిరీ సినిమా పోస్ట‌ర్‌లు వ‌దిలారు. అరియానా సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. త‌ర్వాత అవినాష్‌కు డార్లింగ్‌, మోనాల్‌ ఏ మాయ చేశావే, దివికి అందాల రాక్ష‌సి, కుమార్ సాయికి మ‌త్తు వ‌ద‌ల‌రా, హారిక‌కు ఫిదా, అఖిల్‌కు అర్జున్ రెడ్డి, లాస్యకు పెద‌రాయుడు పోస్ట‌ర్ అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా అఖిల్ ఆ పిల్ల నాది అన్న డైలాగ్ చెప్పిన‌ప్పుడు అత‌ని వేలు మాత్రం క‌రెక్ట్‌గా(మోనాల్ వైపు) చూపించావ‌ని నాగ్ సెటైర్ వేశారు. అనంత‌రం నోయ‌ల్ సేఫ్ అయిన‌ట్లు వెల్ల‌డించారు. (చ‌ద‌వండి: నేడే ఎలిమినేష‌న్‌: స‌్వాతి దీక్షిత్ అవుట్‌!)

లాస్య‌, మోనాల్ సేఫ్‌
బీబీ హోట‌ల్‌లోని స్టాఫ్.. అతిథులుగా, అతిథులు స్టాఫ్‌గా మార‌తార‌ని నాగ్ పేర్కొన్నారు. అయితే అంత‌కు ముందు టాస్క్‌లో అరియానా, సోహైల్‌ రాచిరంపాన పెట్టార‌ని ఇంటి స‌భ్యులు నాగ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై ప్ర‌తీకారం తీర్చుకునేందుకు నాగ్ అవ‌కాశ‌మిచ్చారు. దీంతో మాస్ట‌ర్ ఆదేశాల మేర‌కు హారిక నుదుటి మీద నీళ్ల గ్లాసు పెట్టుకుని డ్యాన్స్ చేసేందుకు ప్ర‌య‌త్నించింది, కానీ విఫ‌ల‌మైంది. కోడి పిల్ల‌లా‌గా సోహైల్ శ‌బ్ధం చేస్తూ రెక్క‌లు విదుల్చుతూ న‌డిచాడు. అరియానా.. అవినాష్‌ను ఎత్తుకుని ప‌ది నిమిషాలు ఉండాల‌ని సుజాత చాలెంజ్ విసిరింది. దీంతో అవినాష్‌ను ఎత్తుకున్న అరియానా అత‌ని బ‌రువు మోయ‌లేక‌ అమాంతం కింద ప‌డేసింది. త‌ర్వాత మెహ‌బూబ్.. సుజాత‌ను ఎత్తుకుని 50 సార్లు పైకి కింద‌కు లేపాడు. త‌ర్వాత లాస్య, మోనాల్‌ సేఫ్ అయిన‌ట్లు తెలిపారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: సుజాత‌పై ప‌గ ప‌ట్టిన నెటిజ‌న్లు)

అభిజిత్, మాస్ట‌ర్‌తో ఇబ్బంది: సుజాత‌
దీంతో నామినేష‌న్‌లో ఇంకా మిగిలి ఉన్న‌ సుజాత‌, మాస్టర్ గార్డెన్ ఏరియాలోకి వెళ్లారు. అక్క‌డ వాళ్లిద్ద‌రూ ఐస్‌గ‌డ్డ‌ను ప‌గ‌ల‌గొట్ట‌గా అందులో సుజాత ఫొటో రావ‌డంతో ఆమె ఎలిమినేట్ అయిన‌ట్లు నాగ్‌ ప్ర‌క‌టించారు. త‌ర్వాత స్టేజీపైకి వ‌చ్చిన ఆమె తాను ఎలిమినేట్ అవుతాన‌నుకోలేద‌ని తెలిపింది. కానీ త‌న‌కు త‌న‌లాగా ఉండే అవ‌కాశం ఇక్క‌డ ల‌భించింద‌ని పేర్కొంది. అనంత‌రం ఇంటిస‌భ్యులతో ఉన్న అనుబంధాన్ని హార్ట్ ముక్క‌ల ద్వారా చెప్ప‌క‌నే చెప్పింది. త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన‌ నోయ‌ల్‌, లాస్య‌, అవినాష్‌కు రెడ్ హార్ట్ ఇచ్చింది. చిన్న చిన్న స‌మ‌స్య‌లు ఉన్న‌ అభిజిత్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, అరియానా, మెహ‌బూబ్‌, కుమార్ సాయికి బ్రోకెన్ హార్ట్ ఇచ్చింది. హారిక‌, దివి, సోహైల్‌, అఖిల్‌, మోనాల్‌కు బ్లాక్ హార్ట్ పెట్టింది. హారిక నోయ‌ల్‌, అభిజిత్‌తో మాత్ర‌మే కంఫ‌ర్ట్‌గా ఉంటుందని చెప్పింది. మోనాల్ త‌న‌ను చెల్లిగా చూసుకుంద‌ని తెలిపింది. అనంత‌రం బిగ్‌బాంబ్‌ను ఏరికోరి సోహైల్‌పై విసిరింది. వారం రోజులపాటు బోళ్లు అన్నీ తోమాల‌ని అత‌డిపై బిగ్‌బాంబ్ వేసింది. (చ‌ద‌వండి: న‌న్ను పంపించేయండి: చేతులెత్తి వేడుకున్న గంగ‌వ్వ‌)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement