బిగ్‌బాస్ అయ్యాక గుజ‌రాత్‌ వెళ్తా: అభిజిత్‌ | Bigg Boss 4 Telugu: Sohel Is Second Finalist | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: ఫైన‌ల్‌లో అడుగు పెట్టిన సోహైల్‌

Published Sat, Dec 12 2020 11:24 PM | Last Updated on Sun, Dec 13 2020 4:06 AM

Bigg Boss 4 Telugu: Sohel Is Second Finalist - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌ ప్రీ ఫైనల్స్‌లో నాగార్జున టామ్ అండ్ జెర్రీ గొడ‌వ‌ను చ‌ర్చించారు. ఇద్ద‌రి త‌ప్పుల‌ను ఎత్తి చూపి చిన్న‌దానికి పెద్ద‌దిగా చేశార‌ని చుర‌క‌లంటించార‌. వుమెన్ కార్డు తీయ‌డం మాత్రం అక్ష‌రాలా త‌ప్పేన‌ని అరియానాను విమ‌ర్శించారు. అమ్మాయి మీద‌కు అలా పైపైకి వెళ్లి మాట్లాడ‌టం కూడా త‌ప్పేన‌ని సోహైల్‌ను తిట్టిపోశారు. అనంత‌రం సోహైల్‌ను ఫైన‌ల్‌లో అడుగు పెట్టిన రెండో కంటెస్టెంట్‌గా ప్ర‌క‌టించారు. మ‌రి ఈ సూప‌ర్ సిక్స్ కంటెస్టెంట్లతో నాగ్ ఏం ఆట‌లాడించారు? ఏమేం జ‌రిగాయో తెలియాలంటే ఈ బిగ్‌బాస్ స్టోరీని చ‌దివేయండి..

మోనాల్ హైప‌ర్‌: అభి
హౌస్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు మిగ‌తావాళ్ల మీద ఫ‌స్ట్ ఇంప్రెష‌న్‌, ఇప్పుడు ఫైన‌ల్ ఇంప్రెష‌న్ ఏంటో చెప్తూ లైక్‌, డిస్‌లైక్ పెట్టాల‌ని నాగార్జున ఇంటిస‌భ్యుల‌ను ఆదేశించారు. మొద‌ట హారిక.. అఖిల్‌, అభిజిత్‌, మోనాల్‌కు గ్రీన్ థ‌మ్స‌ప్ ఇచ్చి సోహైల్, అరియానాను డిస్‌లైక్ చేసింది. త‌ర్వాత వ‌చ్చిన అఖిల్‌.. హారిక‌, మోనాల్‌, సోహైల్‌కు లైక్, మిగ‌తా ఇద్ద‌రికి డిస్‌లైక్‌లు ఇచ్చాడు. అనంత‌రం అభిజిత్.. అరియానా, హారిక‌, సోహైల్‌కు లైక్‌, మిగ‌తా ఇద్ద‌రికి డిస్‌లైక్ ఇచ్చాడు. మోనాల్‌ను చూడ‌గానే హైప‌ర్ అనిపించింద‌ని, బిగ్‌బాస్ అయిపోయాక ఓసారి గుజ‌రాత్‌కు వెళ్తానన్నాడు. మోనాల్‌ను, ఆమె అమ్మ‌ను క‌లుద్దామ‌నుకుంటున్నాన‌ని చెప్పాడు. (చ‌ద‌వండి: మ‌న‌సుతో ఆలోచించి ఓటేయండి: రాహుల్)

అఖిల్ ఇన్‌స్టాగ్రామ్ చెక్ చేశా
మోనాల్ వంతు రాగా ఆమె అఖిల్‌, హారిక‌, సోహైల్‌కు లైక్ మిగ‌తా ఇద్ద‌రికి డిస్‌లైక్ ఇచ్చింది. ఇక్క‌డికి వ‌చ్చేముందు అఖిల్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చెక్ చేశానంది. కానీ హౌస్‌లోకి రాగానే అత‌డు ప‌ట్టించుకోలేడ‌ని బుంగ‌మూతి పెట్టింది. అనంత‌రం అరియానా.. అభిజిత్‌, హారిక‌, మోనాల్‌కు లైక్‌, అఖిల్‌, సోహైల్‌కు డిస్‌లైక్ ఇచ్చింది. సీక్రెట్ రూమ్‌లోనే సోహైల్ ఆలోచ‌న‌‌, త‌న‌ ఆలోచ‌న క‌నెక్ట్ అవ్వ‌లేద‌ని చెప్పింది. ఈ సంద‌ర్భంగా నాగ్ వీళ్ల గొడ‌వ‌ను ప్ర‌స్తావించారు. అత‌డికి కోప‌మే వీక్‌నెస్ అని తెలిసి దాన్ని ట‌చ్ చేశావు, ఫ‌స్ట్ హైపిచ్‌లో నువ్వు మాట్లాడితేనే అత‌డు రైజ్ అయ్యాడు అని వివ‌రించారు. (చ‌ద‌వండి: హారిక‌ను చుమ్మా ఇవ్వ‌మ‌ని బెదిరించిన అఖిల్‌)

మూడో వ్య‌క్తిని తీసుకొచ్చింది నువ్వు
అటు సోహైల్‌ను సైతం టాస్క్‌లో కోపం కంట్రోల్ చేసుకున్న నువ్వు జీవితంలో దాన్ని నియంత్రించుకోలేవా? అని ప్ర‌శ్నించారు. నీ ఆటిట్యూట్ వ‌ల్ల, అరియానా మొద‌ట అరిచి మాట్లాడ‌టం వ‌ల్లే ఈ స‌మ‌స్య వ‌చ్చింద‌ని చెప్పారు. నువ్వు హారిక‌ను ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌డం వ‌ల్లే అత‌డు మోనాల్ గుడ్డు విష‌యాన్ని ఉదాహ‌ర‌ణ‌గా తీసుకొచ్చాడ‌ని అరియానాకు స్ప‌ష్టం చేశారు. ఆడ‌పిల్ల‌ల‌ను నేను స‌పోర్ట్ చేస్తాను కానీ హౌస్‌లో అంద‌రూ స‌మాన‌మే అని పేర్కొన్నారు. మోనాల్ బిక్కుబిక్కుమ‌ని ఏడుస్తుంటే ఓదార్చ‌డానికి కూడా వెళ్ల‌లేదు? అని అడ‌గ్గా అప్పుడే గొడ‌వైంది కాబ‌ట్టి ఆమెను ఓదార్చ‌లేద‌ని అరియానా స్ప‌ష్టం చేసింది. (చ‌ద‌వండి: అవినాష్ అవుట్‌: అభిజిత్‌పై బిగ్‌బాంబ్‌)

అభిజిత్ ప్ర‌శ్న‌కు నాగ్ ఆన్స‌ర్‌
వుమెన్ కార్డు ఎందుకు తీశావు? సోహైల్ బూతులేమైనా అన్నాడా? అని ప్ర‌శ్న‌లు కురిపించ‌గా లేద‌ని అరియానా బ‌దులిచ్చింది. అబ్బాయి మీద మీద‌కు వ‌చ్చాడంటూ వుమెన్ కార్డు తీయ‌డం త‌ప్ప‌ని నాగ్ ఆమెను హెచ్చ‌రించారు. నా జీవితంలో ఏ అబ్బాయి ఇలా పైకి వ‌చ్చి మాట్లాడ‌లేద‌ని, అందుకే ఏడ్చానంటూ అరియానా త‌న బాధ వెన‌క కార‌ణాన్ని చెప్పుకొచ్చింది. త‌ర్వాత తిరిగి టాస్కు కంటిన్యూ చేయ‌గా.. సోహైల్‌.. అఖిల్‌, మోనాల్‌కు యాటిట్యూడ్, అభిజిత్‌ను అమాయ‌కుడు అంటూ వారికి లైక్‌, హారిక‌, అరియానాకు డిస్‌లైక్ ఇచ్చారు. ఈ క్ర‌మంలో నాగ్.. పిల్ల‌లెలా పుడ‌తారు? అని అభిజిత్‌ అడిగిన ప్ర‌శ్న‌ను తిరిగి అత‌డికే సంధించారు. అందుకాయ‌న ఎలాంటి స‌మాధానం ఇవ్వ‌కపోవ‌డంతో నాగ్.. ఏడుస్తూ పుడ‌తారు అని ఆన్స‌రిచ్చారు.

క‌లిసిపోయిన‌ టామ్ అండ్ జెర్రీ
త‌ర్వాత నాగ్‌ ఫినాలేకు వెళ్లే టాప్ 5 కంటెస్టెంట్ల‌ను రివీల్ చేసుకుంటూ వెళ్లారు. మొద‌ట‌గా ఫినాలేలో అడుగు పెట్టిన అఖిల్‌ను అత‌డి త‌ర్వాత వ‌చ్చే న‌లుగురు ఎవ‌రో చెప్ప‌మ‌ని అడ‌గ్గా సోహైల్‌, మోనాల్‌, అభిజిత్‌, హారిక పేర్ల‌ను వ‌రుస క్ర‌మంలో చెప్పుకుంటూ పోయాడు. అనంత‌రం సోహైల్ ఫైన‌లిస్టుగా ఎంపికైన‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో అత‌డు ఆనందంతో గంతులు వేశాడు. త‌న కోపాన్ని త‌గ్గించుకుంటాన‌ని, బిగ్‌బాస్ ఒక లాకెట్ ఇస్తే, కోపం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా దాన్ని చూసి కంట్రోల్ చేసుకుంటాన‌న్నాడు. చివ‌ర్లో సోహైల్‌, అరియానా క‌లిసిపోవ‌డం కొస‌మెరుపు. ఇద్ద‌రూ మోకాళ్ల‌పై కూర్చుని ఒక‌రికి ఒక‌రు సారీ చెప్పుకున్నారు. జ‌రిగిన‌వ‌న్నీ మ‌ర్చిపోదామ‌ని, కొత్త అధ్యాయం ప్రారంభిద్దామ‌ని మాటిచ్చుకున్నారు. (చ‌ద‌వండి: మోనాల్ నాకోసం స్టాండ్ తీసుకోవాల్సింది: అభిజిత్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/6

2
2/6

3
3/6

4
4/6

5
5/6

6
6/6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement