
ఎప్పుడూ నవ్వించే అవినాష్ బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో భాగంగా బీబీ హోటల్ సిబ్బంది గెలవకుండా అడ్డుపడ్డాడు. అందుకోసం సిబ్బందికి, అతిథులకు మధ్య చిచ్చు పెట్టి నారదుడిలా మారిపోయాడు. ఏదైతేనేం, చివరాఖరకు కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. స్నేహానికి విలువిచ్చి మెహబూబ్ కెప్టెన్సీని సోహైల్‌కు త్యాగం చేసినట్లు కనిపిస్తోంది. దీంతో బీబీ హోటల్ టాస్క్‌లో గెలుపొందిన అతిథుల టీమ్‌లో అఖిల్, సోహైల్ కెప్టెన్సీకి పోటీ పడుతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం అవినాష్, సోహైల్, అఖిల్ ముగ్గురూ నడుం వంచి నిప్పులు కుంపటి ముందు నిల్చున్నారు. రెండు చేతుల్లో ఐస్ గడ్డలను పట్టుకున్నారు. కింద నిప్పుల కొలిమి నుంచి వచ్చే వేడిని తట్టుకుంటూనే, శరీరాన్ని మొద్దుబారుస్తున్న ఐస్‌గడ్డలను కింద పడిపోకుండా చూసుకుంటున్నారు. అలా ఎవరు ఎక్కువ సేపు కదలకుండా నిలబడితే వారే కెప్టెన్ అయినట్లు లెక్క. (చదవండి: అవినాష్.. చెంచాతో బకెట్ నింపు: అరియానా)
కానీ ఆ వేడి సెగలను తట్టుకోలేని అఖిల్ ఒక్కసారిగా ముందుకు దూకి పడిపోయాడు. దీంతో మోనాల్ తెగ కంగారుపడిపోయింది. ఇక అవినాష్ కూడా కూడా పంటి కింద నొప్పిని ఎక్కువ సేపు భరించలేడని ఆయన ముఖంలో మారుతున్న ఎక్స్‌ప్రెషన్స్ చూస్తేనే అర్థమవుతోంది. దీంతో లీకువీరులు చెప్పినట్టుగానే ఇస్మార్ట్ సోహైల్ కెప్టెన్ అవుతాడని అనిపిస్తోంది. మరోవైపు టాస్క్ ప్రారంభం కాగానే 5 స్టార్లు దొంగిలించి అతి తెలివి ప్రదర్శించిన అభిజిత్‌ను బిగ్‌బాస్ జైలుకు పంపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. అది ఎంత వరకు నిజమనేది నేటి ఎపిసోడ్‌లో చూద్దాం.. (చదవండి: స్టార్ హీరోను బిట్టు అని పిలవడమేంటి?)