తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ నటించిన తాజా చిత్రం సకలగుణాభిరామ. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీజే సన్నీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
గెలుస్తాడనుకుంటే నాల్గో సీజన్‌లో డబ్బులు తీసుకుని బయటకు వచ్చేశావంటూ సోహైల్ గురించి చులకనగా మాట్లాడాడు. 'నాల్గో సీజన్‌లో సోహైల్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ వీడు డబ్బులు తీసుకుని వచ్చేశిండు. నన్ను కూడా అందరూ అంతే అన్నారు. నీకన్నా 10 లక్షలు ఎక్కువే పెట్టిర్రు. అయినా సరే టెంప్ట్ కాలేదు. కళావతి(సన్నీ తల్లి)కి కప్పు ముఖ్యం బిగిలూ.. అందుకే గెలిచి వచ్చా' అని గర్వంగా చెప్పుకొచ్చాడు సన్నీ.
ఈ కామెంట్లపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగుతోంది. గెలిచాక సన్నీకి గర్వం తలకెక్కిందని కామెంట్లు చేస్తున్నారు. స్టేజీమీద అందరి ముందు సోహైల్‌ను అవమానించడం సబబు కాదని మండిపడుతున్నారు. ఈ కామెంట్లపై అఖిల్ పరోక్షంగా స్పందించాడు. సన్నీ పేరు తీయకుండానే అతడిపై మండిపడ్డాడు. 'ఎవరినైనా ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు వారిని గౌరవించాలే తప్ప అవమానించకూడదు. మనం హీరో అవడానికి పక్కవాళ్లను జీరో చేయొద్దు బ్రదర్. నా స్నేహితుడిని అలాంటి పరిస్థితుల్లో స్టేజీ మీద చూడటం చాలా బాధనిపించింది. అప్పుడు నేనక్కడ ఉంటే బాగుండేది!' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఆ పోస్ట్ డిలీట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment