గంగ‌వ్వ‌కు కొత్త‌ ఇల్లు క‌ట్టిస్తా: నాగ్‌ | Bigg Boss 4 Telugu: Nagarjuna Assures To Build New House For Gangavva | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ను వీడిన గంగ‌వ్వ‌, అఖిల్ కంట‌త‌డి

Published Sat, Oct 10 2020 11:30 PM | Last Updated on Sun, Oct 11 2020 3:42 PM

Bigg Boss 4 Telugu: Nagarjuna Assures To Build New House For Gangavva - Sakshi

ఐదోవారంలో నామినేష‌న్‌లో కూడా లేని గంగ‌వ్వ అనారోగ్యం కార‌ణంగా బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఆమెకు ఇంటిస‌భ్యులంద‌రూ స‌గౌర‌వంగా వీడ్కోలు ప‌లికారు. ఏ కోరిక‌తో ఈ షోలో అడుగు పెట్టిందో ఆ క‌ల‌ను నిజం చేస్తాన‌ని నాగ్ హామీ ఇచ్చారు మ‌రోవైపు అన‌వ‌స‌రంగా నోరు పారేసుకుంటున్న సోహైల్‌, మెహ‌బూబ్‌ల‌కు నాగ్ అక్షింత‌లు వేశారు. ఇంకోసారి ఇలాంటివి పున‌రావృతం కాకూడ‌ద‌ని హెచ్చ‌రించి వ‌దిలేశారు. అలాగే ఇద్ద‌రు కంటెస్టెంట్లు సేఫ్ జోన్‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. అంతేకాదు, ఈవారం 8 కోట్ల ఓట్లు వ‌చ్చాయ‌ని తెలిపారు. మ‌రి నేటి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో చ‌దివేయండి..

ఎవ‌రు రూల్స్ బ్రేక్ చేసినా కెప్టెన్‌కే ప‌నిష్మెంట్
బిగ్‌బాస్ ఇంటిస‌భ్యుల‌ను నిద్ర‌లో నుంచి లేపి మ‌రీ కౌంటింగ్ ఇచ్చాడు. మైక్ స‌రిగా ధ‌రించ‌ట్లేద‌ని, తెలుగులో మాట్లాడ‌ట్లేద‌ని సీరియ‌స్ అయ్యాడు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవ‌డం లేద‌ని తిట్టిపోశాడు. ఇంకోసారి ఎవ‌రు నిబంధ‌న‌లు ఉల్లంఘించినా కెప్టెన్ సోహైల్ అన్ని కెమెరాల‌కు క్ష‌మించమ‌ని చెప్పాల్సి ఉంటుందని ఆదేశించాడు. అనంత‌రం ఒప్పో టాస్క్‌లో మోస్ట్ స్టైలిష్ ప‌ర్స‌న్ - మెహ‌బూబ్‌, ప‌ర్ఫెక్ట్ పిక్చ‌ర్ - అరియానా, మోస్ట్ స్పీడీ - లాస్య‌, మోస్ట్ హైలెటెడ్ ఇన్ ద క్రౌడ్ - అవినాష్‌, మోస్ట్ క్లియ‌ర్ ఇన్ థాట్ - కుమార్ సాయి, బాగా శ‌క్తివంతులు - అమ్మ‌రాజ‌శేఖ‌ర్ అని పేర్కొన్నారు. మోనాల్‌ను ఆల్‌రౌండ‌ర్‌గా పేర్కొంటూ ఆమెకు కెప్టెన్ సోహైల్ కిరీటం ధ‌రించారు. (చ‌ద‌వండి: ఇక్కడ రిలేష‌న్స్ పెట్టుకోవ‌డం వేస్ట్‌: అఖిల్‌)

ఎదుటి వాళ్లు చెప్పేది వినిపించుకోండి
స్టేజీ పైన‌కు నాగార్జున వ‌చ్చీరాగానే అఖిల్‌, అభిజిత్ మీద సీరియ‌స్ అయ్యారు. మీరు నామినేష‌న్ చేసుకునేట‌ప్పుడు మ‌ధ్య‌లో మోనాల్ పేరు ఎందుకు తీసుకువ‌చ్చార‌ని ప్ర‌శ్నించారు. ఇంకోసారి ఇది జ‌రగ‌కూడ‌ద‌ని కొర‌డా ఝుళిపించారు. స్వాతి దీక్షిత్‌ను నామినేట్ చేసినందుకు‌ మాస్టర్‌పై నోయ‌ల్ అస‌హ‌నం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని నాగ్ ప్ర‌స్తావిస్తూ మ‌రి కుమార్ సాయి విష‌యంలో ఏమీ అనిపించ‌లేదా అని నిల‌దీయ‌గా ఏమి చెప్పాలో తెలీక నోయ‌ల్‌ నీళ్లు న‌మిలాడు. అదేవిధంగా నోయ‌ల్ వ‌చ్చి సారీ చెప్పినా క‌నీసం ఏం చెప్తున్నార‌నేది కూడా వినిపించుకోరా? అని మాస్ట‌ర్‌ను ప్ర‌శ్నించారు. ముందు విన‌డం నేర్చుకోమ‌ని సూచించారు. దివిపైన అరుపులు ఏంటి? పిచ్చి కుక్క‌లా అరుస్తున్న‌ట్లు ఉంది అని సోహైల్‌పై ఫైర్ అయ్యారు. ఇంకోసారి ఆడ‌పిల్ల మీద అరవ‌కూడ‌ద‌ని వార్నింగ్ ఇచ్చారు.

నీ గెలుపు కోసం టీమ్‌ను ఓట‌మిపాలు చేశావు
త‌ర్వాత అవినాష్‌.. దివికి లైన్ వేసిన విష‌యాన్ని నాగ్ అంద‌రి ముందు బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. కానీ సీక్రెట్ టాస్క్ మాత్రం బాగా ఆడావ‌ని మెచ్చుకున్నారు. స్టార్లు దొంగిలించి ఆట ఆగిపోయేలా చేశాడ‌ని అభిజిత్‌ను నిందించారు. నీ గెలుపు కోసం మాత్ర‌మే పాటుప‌డ‌టం వ‌ల్ల హోట‌ల్ సిబ్బంది టీమ్ ఓడిపోయింద‌ని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ ఎడ్యుకేష‌న్ కోసం తీయ‌క‌ని అభికి సూచించారు. పుచ్చ ప‌గిలిపోతుంది అన్న మాట బ‌య‌ట హోట‌ల్‌లో మాట్లాడితే మెడ‌ప‌ట్టి తోసేసి పోలీసులు మోకాళ్లు విర‌గ్గొడ‌తారు అని, అలాంటి మాట‌లు మాట్లాడొద్ద‌ని మెహ‌బూబ్‌ను గ‌ట్టిగానే హెచ్చ‌రించారు. అయితే ఆ ప‌దం వాడ‌టం త‌ప్ప‌ని, ఇంటి స‌భ్యుల‌కు సారీ చెప్ప‌మ‌ని మెహ‌బూబ్‌కు సూచించినందుకు సోహైల్‌ను అభినందించారు. అనంత‌రం సోహైల్ సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. (చ‌ద‌వండి: బిడ్డ శ‌వం భుజానేసుకుని వెళ్లాను: గ‌ంగ‌వ్వ‌)

నాగార్జున‌కు మ‌నుమ‌రాలు పుట్టాక ప‌ట్నం వ‌స్తా
గంగ‌వ్వకు ఆరోగ్యం స‌రిగా లేద‌ని నాగ్ చెప్పుకొచ్చారు. అవ్వ‌ను క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి ర‌మ్మ‌ని చెప్పి సంభాషించారు. గంగ‌వ్వ త‌న నాగ్ అన్న‌ను చూసి బోరున విల‌పించింది. "ప‌దిరోజులుగా నిద్ర పోత‌లేను. ఇల్లు లేద‌ని వ‌చ్చాను. కానీ నా వ‌ల్ల ఐత‌లేదు. ఆట కూడా ఆడ‌లేక‌పోతున్నా. న‌న్ను ఊరు పంపించేయండి. నీకు మ‌నుమ‌రాలు పుట్టిన‌ప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చి మీ ఇల్లు చూస్తా" అని అంది. ఆమె అవ‌స్థ‌కు క‌ల‌త చెందిన నాగ్‌.. అవ్వ ఈ హౌస్‌ను వీడేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని బిగ్‌బాస్‌కు విన్న‌వించారు. దీంతో ఆమె వెళ్లిపోవ‌చ్చ‌ని బిగ్‌బాస్ ప్ర‌క‌టించాడు. ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోయిన అఖిల్ క‌న్నీరుమున్నీరుగా విల‌పించాడు. అవ్వ‌కు హార్ట్ షేప్ పిల్లోను బ‌హుమ‌తిగా ఇచ్చాడు. ఇంటి స‌భ్యులంద‌రూ ఆమెకు క‌న్నీటితో వీడ్కోలు ప‌లికారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: రీ ఎంట్రీ కోసం‌ స్వాతి ఫ్యాన్స్ ఆందోళ‌న‌)

సోహైల్ నాగుపాము, మోనాల్ అమాయ‌కురాలు
స్టేజీపైకి వ‌చ్చిన అవ్వ ఇంటి స‌భ్యులంద‌రి గురించి మంచి, చెడు చెప్పుకొచ్చింది. హారిక అప్పుడే న‌వ్వుతూ, అప్పుడే సీరియ‌స్ అయిత‌ని తెలిపింది. దివి.. త‌న మ‌నుమ‌రాలిలాగా అని, కానీ ఎవ‌రైనా మాట్లాడ‌క‌పోతే ముఖం మాడ్చుకుంటుంద‌ని చెప్పింది. సోహైల్‌.. నాగుపాము అని, అత‌డిలో మంచి చెప్పుకునేందుకు ఏమీ లేద‌ని గాలి తీసేసింది. అఖిల్‌ను పెంచుకుంటానంది. అమ్మ రాజ‌శేఖ‌ర్ హౌస్‌లో ఉండాలి అని తీర్పు చెప్పింది. అలాగే త‌న‌ను సినిమాలో తీసుకోవాల‌న్న అవ్వ‌ కోరిక‌కు మాస్ట‌ర్ త‌ప్ప‌కుండా అవ‌కాశ‌మిస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు. మోనాల్ మంచిద‌ని, అమాయ‌కురాల‌ని చెప్పుకొచ్చింది.

నోయ‌ల్.. బిగ్‌బాస్ అవ‌గానే పెళ్లి చేసుకో: గ‌ంగ‌వ్వ‌
నోయ‌ల్‌.. హౌస్‌ నుంచి బ‌య‌ట‌కు రాగానే పెళ్లి చేసుకోవాల‌ని ఆదేశించింది. లాస్య, త‌న పెద్ద బిడ్డ అని, సుజాత నామినేష‌న్‌లోకి వ‌స్త‌ద‌ని అభిప్రాయ‌ప‌డింది. అభిజిత్ ముఖం క‌డుక్కోకుండా కాఫీ, టీలు తాగుతార‌ని, అందుకే నామినేట్ చేశాన‌ని తెలిపింది. అరియానా చూడ‌టానికి చిన్న‌పిల్ల‌, కానీ ఎవ‌రు ప‌ట్టించుకోకున్నా ముఖం మీదే అనేస్త‌ద‌ని పొగిడింది. అవినాష్‌ను కుందేలుగా అభివ‌ర్ణించింది. కుమార్ సాయి రోజూ నేర్చుకుంటున్నాడ‌ని, అంద‌రితో క‌లిసిపోయాడంది. ఈ సంద‌ర్భంగా త‌న‌కో ఇల్లు క‌ట్టియ్య‌మ‌ని అవ్వ మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టింది. దీంతో తాను ఇల్లు క‌ట్టిస్తాన‌‌ని, ఇక‌ దాని గురించి మ‌ర్చిపోమ‌ని నాగ్ అభ‌య‌మిచ్చారు. అనంత‌రం అంద‌రూ ఊహించిన‌ట్టుగానే అఖిల్‌ను సేఫ్ చేసింది. రేప‌టి ఎపిసోడ్‌లో సుజాత ఎలిమినేట్ అయిన‌ట్లు తెలుస్తోంది. (చ‌ద‌వండి: అవినాష్ తిక్క కుదిర్చిన అరియానా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement