బిగ్‌బాస్‌: టాప్ 5 కంటెస్టెంట్లు వీళ్లే | Bigg Boss 4 Telugu: These Are The Top 5 Contestants | Sakshi
Sakshi News home page

సోహైల్‌ అర్ధ‌రాత్రి అమ్మాయిల‌తో ఛాటింగ్ చేస్తాడు

Published Sat, Nov 21 2020 11:22 PM | Last Updated on Sun, Nov 22 2020 5:28 AM

Bigg Boss 4 Telugu: These Are The Top 5 Contestants - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో మ‌రోసారి ఫ్యామిలీ ఎపిసోడ్ న‌డిచింది. కాక‌పోతే వ‌చ్చిన‌వారితో కూడా నాగార్జున గేమ్ ఆడించారు. ఎవ‌రు టాప్ 5లో ఉంటారో అంచ‌నా వేయ‌మ‌న్నారు. దీనివ‌ల్ల‌ ఓర‌కంగా కంటెస్టెంట్ల‌కు లాభ‌మే జ‌రిగింది.అటు అయిన‌వారితో మాట్లాడే వెసులుబాటుతో పాటు వారి అంచ‌నాల‌ను బ‌ట్టి ప్రేక్ష‌కుల నాడి తెలుసుకునే అవ‌కాశం దొరికింది. కానీ అవినాష్‌ను మాత్రం దురదృష్టం వెంటాడింది. అత‌డి ఫ్యామిలీని క‌లుసుకునే ఛాన్స్ చేజేతులా పోగొట్టుకున్నాడు. ఇక ఈ సీజ‌న్ మొత్తంలో ఈ వారంలోనే అత్య‌ధికంగా 9.5 కోట్ల ఓట్లు వ‌చ్చాయ‌ని నాగార్జున స‌గ‌ర్వంగా ప్ర‌క‌టించారు. మ‌రి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మీద ఓ క‌న్నేయండి..

అవినాష్ టాప్ 2లో ఉండ‌కూడ‌దు: ‌హారిక‌
కుటుంబ స‌భ్యుల‌ను క‌లుసుకునేందుకు నాగ్ కంటెస్టెంట్ల‌కు బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించారు. త‌ను అడిగే ప్ర‌శ్న‌ల‌కు సూటిగా స‌మాధానాలు చెప్తే వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో మాట్లాడిస్తాన‌ని చెప్పారు. దీనికి ఇంటిస‌భ్యులు స‌రేనంటూ త‌లాడించారు. మొద‌ట‌గా హారిక వంతు రాగా.. నువ్వు టాప్ 2లో ఉంటే ఎవ‌రు నీతో పాటు ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌వు అని నాగ్ ప్ర‌శ్నించారు. అందుకు ఆమె అవినాష్ పేరును చెప్పింది. దీంతో హారిక అన్న‌య్య‌, స్నేహితుడు స్టేజీపైకి వ‌చ్చారు. వ‌చ్చిన‌ వాళ్ల‌తో నాగ్ గేమ్ ఆడించారు. ఎవ‌రు టాప్ 5లో ఉంటారో చెప్ప‌మ‌న‌గా.. హారిక‌, అభిజిత్‌, లాస్య‌, సోహైల్‌, అరియానా ముందు వరుసలో ఉంటార‌ని తెలిపారు. (చ‌ద‌వండి: ఆ అల‌వాటు మాత్రం పోలేదు: హారిక త‌ల్లి)

ముందు ఒక‌లా, వెన‌క ఒక‌లా ఉండేది అభి
బిగ్‌బాస్ ఇంట్లో ముందు ఒక‌లాగా, వెన‌క ఒక‌లాగా ప్ర‌వ‌ర్తించేది ఎవ‌రు అన్న ప్ర‌శ్న‌కు అభిజిత్ అని అఖిల్ ఆన్స‌ర్ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో మ‌రోసారి ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రగ్గా ఈ స‌మస్య‌ను మీరే ప‌రిష్క‌రించుకోవాల‌ని నాగ్ చేతులెత్తేశారు. త‌ర్వాత అఖిల్ అన్న బ‌బ్లూ‌, ఆయ‌న‌ కొడుకు అరుష్‌ స్టేజీ మీద‌కు వ‌చ్చారు. సోహైల్‌, అఖిల్‌, అభిజిత్‌, అరియానా, అవినాష్‌ టాప్ 5లో ఉంటార‌ని బ‌బ్లూ అభిప్రాయ‌ప‌డ్డాడు. షో కోసం అన్నివిధాలా త‌మ వంతు కృషి చేయ‌నిది ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు అరియానా మోనాల్ అని చెప్పింది. త‌ర్వాత‌ అరియానా చెల్లి మృ గ‌న‌య‌ని(ముగ్గు), స్నేహితుడు కార్తీక్ వ‌చ్చారు. (చ‌ద‌వండి: ఐ ల‌వ్ యూ విన‌య్: అరియానా)

అవినాష్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు: లాస్య‌
ఈ సంద‌ర్భంగా అరియానా చెల్లి మాట్లాడుతూ నువ్వు ఏడ‌వ‌కు, న‌న్ను ఏడిపించ‌కు అని అక్క‌కు స‌ల‌హా ఇచ్చింది. టాప్ 5లో అరియానా, అఖిల్‌, సోహైల్‌, హారిక‌, అవినాష్ ఉంటార‌ని చెప్పుకొచ్చారు. కూర‌లో ఉప్పు ఎంత అవ‌స‌ర‌మో బిగ్‌బాస్‌కు అవినాష్ అంత అవ‌స‌ర‌మ‌ని ముగ్గు అభిప్రాయ‌ప‌డింది. కానీ అత‌డు అరియానాను పడేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని చెప్ప‌గా వెంట‌నే అవినాష్‌.. తాము క్లోజ్ ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చాడు. ఇక‌ సేఫ్ గేమ్ ఆడుతూ ఇంత‌వ‌ర‌కు నెట్టుకొచ్చింది ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు లాస్య అవినాష్ పేరు చెప్పింది. దీంతో స్టేజీ మీద‌కు వ‌చ్చిన లాస్య త‌ల్లి శాంత‌మ్మ‌ త‌న కూతురు షోకు వ‌చ్చాక‌ ఎన్నో షాకులిచ్చింద‌ని తెలిపింది. లాస్య‌, అభిజిత్‌, సోహైల్‌, అఖిల్‌, హారిక టాప్ 5లో ఉంటార‌ని చెప్పుకొచ్చింది. (చ‌ద‌వండి: అఖిల్ బ‌ర్త్‌డే: ముద్దులు కురిపించిన మోనాల్‌)

అభితో ఫ్రెండ్‌షిప్ వ‌ద్దు: సోహైల్‌
బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాక ఇంటిస‌భ్యుల్లో ఎవ‌రితో స్నేహాన్ని కొన‌సాగించ‌వు? అన్న ప్ర‌శ్న‌కు సోహైల్ అభిజిత్ పేరు చెప్పాడు. దీంతో సోహైల్ బ్ర‌ద‌ర్స్ స‌బిల్‌, రామారావు స్టేజీ మీద‌కు వ‌చ్చారు. సోహైల్‌, అభిజిత్‌, అఖిల్‌, అవినాష్‌, అరియానా టాప్ 5లో ఉంటార‌ని చెప్పుకొచ్చారు. రాత్రి తొమ్మిది త‌ర్వాత నుంచి ఒంటి గంట వ‌ర‌కు సోహైల్‌‌ అమ్మాయిల‌తో ఛాటింగ్ చేస్తాడ‌ని చెప్పడంతో అంద‌రూ షాక‌య్యారు. త‌ర్వాత నాగ్ ఓ గాడిద సామెత‌ను చెప్ప‌గా అభిజిత్ చేయి లేపుతూ అది‌ హారిక గురించే చెప్పానని స‌మాధాన‌మిచ్చాడు. (చ‌ద‌వండి: మొద‌టి బిడ్డ‌ను చంపుకున్నా: లాస్య క‌న్నీళ్లు)

మెహ‌బూబ్‌కు బ‌దులు మోనాల్ వెళ్లిపోవాల్సింది: అభి
పోయిన వారం మెహ‌బూబ్‌కు బ‌దులు ఎవ‌రు ఎలిమినేట్ కావాల్సింది అన్న ప్ర‌శ్న‌కు మోనాల్ అని అభి స‌మాధాన‌మిచ్చాడు. త‌ర్వాత అభి మామ‌, నాన్న స్టేజీ మీద‌కు రాగా అత‌డి ల‌వ్ స్టోరీ చెప్ప‌మ‌ని నాగ్ అడిగారు. అయితే అభి వ‌ద్ద‌న‌గానే మామ ఏమీ లేద‌ని దాట వేశారు. టాప్ 5లో అభిజిత్‌, సోహైల్‌, హారిక‌, అఖిల్‌, మోనాల్ ఉంటార‌ని తెలిపాడు. ఇంట్లో ఎవ‌రిని న‌మ్మ‌కుండా ఉంటే బాగుండేది అనుకున్నావు అన్న ప్ర‌శ్న‌కు మోనాల్ అభిజిత్ పేరు చెప్పింది. స్టేజీ మీద‌కు వ‌చ్చిన మోనాల్ త‌ల్లి నాగ్‌కు గిఫ్ట్ ఇచ్చింది.

సోహైల్ సేఫ్‌
త‌ర్వాత అభిజిత్, మోనాల్‌, అఖిల్‌, లాస్య‌, సోహైల్ టాప్ 5లో ఉంటార‌ని ఆశీర్వాద‌మిచ్చింది. అంతేకాక‌ త‌న‌కు అభిజిత్ ఫేవరె‌ట్ అని చెప్పింది. త‌ర్వాత అవినాష్‌.. అంద‌రిక‌న్నా లాస్య సెల్ఫిష్ అని చెప్పాడు. కానీ స‌రైన కార‌ణం చెప్ప‌క‌పోవ‌డంతో అత‌డి ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ను స్టేజీ మీద‌కు రాకుండా వెనుదిరిగి పోయారు. అనంత‌రం టాప్ 5 ఓట్లు త‌క్కువగా ప‌డ్డ ముగ్గురు కంటెస్టెంట్లు వారికి ఇష్ట‌మైన వ‌స్తువుల‌ను స్టోర్ రూమ్‌లో పెట్టాల‌ని నాగార్జున ఆదేశించారు. దీంతో లాస్య‌.. జున్ను ఫొటో, అవినాష్.. ప‌ర్ఫ్యూమ్‌, మోనాల్ త‌న స్పెష‌ల్ గిఫ్ట్‌ను పంపించేశారు. త‌ర్వాత సోహైల్ సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. మొత్తానికి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ అభిజిత్‌, సోహైల్‌, అఖిల్‌, హారిక‌, అరియానా టాప్ 5లో ఉంటార‌ని తేల్చి చెప్పారు (చ‌ద‌వండి: మోనాల్ సేఫ్‌, లాస్య ఎగ్జిట్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement