అరియానాతో డేట్‌కు వెళ్తా: అభిజిత్‌ | Bigg Boss 4 Telugu: Female Contestants Midnight Party In House | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: అఖిల్‌కు లైనేసిన హారిక‌

Published Fri, Oct 16 2020 11:12 PM | Last Updated on Sat, Oct 17 2020 4:16 AM

Bigg Boss 4 Telugu: Female Contestants Midnight Party In House - Sakshi

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్ న‌ల‌భై రోజుల‌కు చేరింది. నిన్న రియ‌ల్ లైఫ్ క‌ష్టాలు చెప్పుకుంటూ బాధ‌ప‌డ్డ కంటెస్టెంట్లు ఇవాళ పార్టీ చేసుకుని మ‌న‌సు తేలిక చేసుకున్నారు. కెప్టెన్ నోయ‌ల్ త‌న‌కు టాస్కులో పాల్గొనే అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌టికీ కుమార్‌తో గొడ‌వ కార‌ణంగా ఆట నుంచి వైదొల‌గాడు. ఈవారంతో పాటు వ‌చ్చేవారంలోనూ నామినేష‌న్‌లో ఉన్న నోయ‌ల్ టాస్క్ ద్వారా త‌న స‌త్తా చూపించుకునే అవ‌కాశాన్ని చేజేతులా నాశ‌నం చేసుకుని పెద్ద త‌ప్పే చేశాడు. ఇక అమ్మాయిల‌కు బిగ్‌బాస్ ఇవాళ స్పెష‌ల్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించాడు. వారికి పార్టీ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించాడు. ప‌నిలో ప‌నిగా పార్టీలో అబ్బాయిల‌ను ర్యాగింగ్ కూడా చేశారు. మ‌రి వాళ్ల ర్యాగింగ్‌కు ఎవ‌రెవ‌రు బ‌ల‌య్యారో చ‌దివేసేయండి..

పుష‌ప్స్ చేయ‌లేక చేతులెత్తేసిన అమ్మాయిలు
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు అంద‌రూ హౌస్‌లో ఏదో ఒక ప‌ని చేయాల్సిందే. అయితే దివి మాత్రం త‌న‌కు కేటాయించిన ప‌ని రాదంటూ స‌రిగా ఊడ‌వ‌ట్లేద‌ని ఇత‌ర‌ కంటెస్టెంట్లు త‌ర‌చూ ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విష‌యం దివి వ‌ర‌కు వెళ్లినా ఆమెలో ఎలాంటి మార్పు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.  బిగ్‌బాస్ ఇంటిస‌భ్యుల‌కు రేస‌ర్ ఆఫ్ ద హౌస్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో రెండు రౌండ్లు ఉంటాయి. మొద‌టిదానిలో ఎక్కువ పుష‌ప్స్ చేసిన ఐదుగురు రెండో రౌండ్‌కు అర్హ‌త సాధిస్తారు. ఆ రౌండ్‌లో ఏడు అడ్డంకుల‌ను త‌క్కువ స‌మ‌యంలో దాటాల్సి ఉంటుంది. టైర్ల మ‌ధ్య నుంచి దూక‌డం, తాళ్ల మ‌ధ్య‌లో నుంచి దాట‌డం, ఇసుక మూట‌ల‌ను స్విమ్మింగ్ పూల్‌లో ఒక‌వైపు నుంచి మ‌రొక‌వైపుకు తీసుకెళ్ల‌డం, ఏట‌వాలుగా ఉన్న‌దానిపై న‌డ‌వ‌డం, ముళ్ల కంచె కింద నుంచి పాకడం, మార్బుల్స్ మీద ప‌రిగెత్త‌డం, మంకీ బాస్‌ను చేతులతో ప‌ట్టుకుని వేలాడ‌టం వంటివి చేయాలి. అమ్మాయిలందరూ మొదటి రౌండ్ మ‌ధ్య‌లోనే చేతులెత్తేశారు.

నోయ‌ల్ స్థానంలో టాస్కు ఆడి ఓడిన అవినాష్‌
కానీ కుమార్ సాయి, అఖిల్‌, మెహ‌బూబ్‌, సోహైల్‌, నోయ‌ల్‌ ఎక్కువ పుష‌ప్స్ చేసి త‌ర్వాతి రౌండ్‌కు అర్హత సాధించారు. అయితే పుష‌ప్స్ చేసేట‌ప్పుడు మ‌ధ్య‌లో ఆగావ‌ని నోయ‌ల్ కుమార్‌ను త‌ప్పుప‌ట్టాడు. లేద‌ని బుకాయిస్తున్న కుమార్‌ను ఒక్క‌రోజైనా నిజం చెప్పమ‌ని, నిజాయితీగా ఉండ‌మ‌ని ఘాటు స‌ల‌హా ఇచ్చాడు. ఈ విష‌యంలో చిరాకు ప్ర‌ద‌ర్శించిన నోయ‌ల్‌ తాను ఆడ‌న‌ని త‌ప్పుకోవ‌డంతో అత‌ని స్థానంలో అవినాష్ ఆట‌లో దిగాడు. కానీ స‌రిగా ఆడ‌లేక‌ కింద ప‌డిపోయాడు. మెహ‌బూబ్ మాత్రం రేసుగుర్రంలా 49 సెకండ్ల‌లో టాస్క్ పూర్తి చేసి "రేస‌ర్ ఆఫ్ ద హౌస్‌"గా నిలిచాడు. కుమార్‌, అఖిల్‌, సోహైల్ స్వ‌ల్ప సెకండ్ల తేడాతో ఓట‌మిపాల‌య్యారు. అనంత‌రం తాను 101 పుష‌ప్స్ చేస్తే దాని గురించి మెహ‌బూబ్ త‌క్కువ చేసి మాట్లాడాడ‌ని అఖిల్ ఫీల‌య్యాడు. ఆ కోపం సోహైల్ మీద తీశాడు. ఈ విష‌యం తెలుసుకుని మెహ‌బూబ్ అఖిల్‌కు సారీ చెప్పాడు.

అలాంటి అమ్మాయి ఇష్టం: అభిజిత్‌
బిగ్‌బాస్ అమ్మాయిల‌కు నైట్ ఔట్ పార్టీ చేసుకునే అవ‌కాశాన్నిచ్చాడు. అయితే ప‌నిలో ప‌నిగా అబ్బాయిల‌ను ఆడుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో అభిజిత్‌ను పిల్చుకుని మ‌రీ పొగిడించుకున్నారు. ఎలాంటి అమ్మాయి న‌చ్చుతుందన్న ప్ర‌శ్న‌కు.. అమ్మాయి లెవ‌ల్ హెడెడ్‌గా, నిజాయితీగా ఉండాలి, కరెక్ట్ నిర్ణ‌యాలు తీసుకోగల‌గాలని చెప్పుకొచ్చాడు. ఇక అక్క‌డున్న వాళ్ల‌లో ఎవ‌రితో డేట్‌కు వెళ్తావని అడ‌గ్గా అభి.. అరియానా పేరు చెప్పాడు. దీంతో ఆమె కాళ్లు భూమి మీద‌ ఆగ‌లేవు. అనంత‌రం మాస్ట‌ర్‌ను లోనికి ర‌మ్మ‌న్నారు. వీరు పాట‌లు పాడుతుంటే అత‌డిని అమ్మాయిలా డ్యాన్స్ చేయ‌మంటూ కాసేపు టీజింగ్ చేశారు. (చ‌ద‌వండి: నాగార్జున ఒక్క‌సారి కూడా మెచ్చుకోలేదు)

సోహైల్ లుంగీ లాగిన హారిక‌
త‌ర్వాత సోహైల్ లోనికి వెళ్లి దివికి ఒక్క‌టిచ్చుకోవ‌‌డంతో అమ్మాయిలు షాక‌య్యారు. మేము అంద‌రినీ ఆడుకుంటే వీడేంటి మాతో ఆడుకుంటున్నాడ‌ని నిశ్చేష్టుల‌య్యారు. త‌ర్వాత‌ అక్క‌డున్న అమ్మాయిలంద‌రి గురించి త‌న‌దైన స్టైల్‌లో చెప్పుకొచ్చాడు. మ‌రీ ఉన్న‌దున్న‌ట్టుగా చెప్పాడే త‌ప్ప ఎక్క‌డా పొగ‌డ‌లేద‌ని చింతించిన‌ అమ్మాయిలు చిత‌క‌బాది లుంగీ లాగారు. మీకు అన్న‌ద‌మ్ముల్లేరా అని అత‌డు ప్ర‌శ్నించ‌డంతో హారిక‌ లుంగీ లాగ‌డం వ‌దిలేసింది. కానీ సారీ చెప్పాల‌ని ప‌ట్టు ప‌ట్టినా అత‌డు మాత్రం చెవికెక్కించుకోలేదు. త‌ర్వాత అరియానా సోహైల్‌తో క్యాట్ వాక్ చేయించింది. (చ‌ద‌వండి: నామినేష‌న్స్ పిచ్చ లైట్‌, ఎందుకు ఫీల‌వుతా)

నీ అందం అంద‌రూ చూస్తే త‌ట్టుకోలేను: అరియానా
అఖిల్ లోనికి రావ‌డంతోనే మోనాల్ సంబ‌ర‌ప‌డిపోయింది. కొత్త‌గా పెళ్లైన అమ్మాయిగా న‌టించ‌మ‌ని అఖిల్‌కు అరియానా టాస్క్ ఇచ్చింది. అఖిల్ అమ్మాయిలా ముగ్గు వేస్తుంటే ప‌క్కింటి అబ్బాయిగా హారిక లైనేసింది. అదే స‌మ‌యంలో భ‌ర్త‌ అరియానా కాఫీ ఇవ్వ‌మ‌ని కేకేయ‌డంతో ప‌రుగు ప‌రుగున వెళ్లి కాఫీ ఇచ్చాడు. అరియానా అత‌డిని ద‌గ్గ‌ర‌కు తీసుకుని ముద్దు పెట్టుకున్న‌ట్లు న‌టించింది. ఆఫీసుకు వెళ్తున్నా.. సాయంత్రం మ‌ల్లెపూలు తేనా అని అడుగుతూనే అమ్మ ప‌డుకున్నాక సినిమాకు వెళ్దాం.. నీ అందం అంద‌రూ చూస్తే నేను త‌ట్టుకోలేను అంటూ పాత్ర‌లో లీన‌మైపోయింది. అర్ధ‌రాత్రి అబ్బాయిలు, అమ్మాయిలు అంద‌రూ క‌లిసి చిందులేశారు. కానీ మోనాల్‌, అవినాష్ మాత్రం అంద‌రూ ప‌డుకున్నాక కూడా ఇద్ద‌రూ సాల్సా డ్యాన్స్ చేశారు. యూ ఆర్ మై ఎవ్రీథింగ్.. అంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా చిందేశారు. ఇప్పుడు మ‌న‌సుకు హాయిగా ఉంద‌ని ఇద్ద‌రూ సంతోషంలో మునిగి తేలారు. (చ‌ద‌వండి: న‌న్ను పంపించేయండి: చేతులెత్తి వేడుకున్న గంగ‌వ్వ‌)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement