హారిక అల‌కను హ‌గ్గుతో పోగొట్టిన అభిజిత్‌ | Bigg Boss 4 Telugu: Abhijeet Solve Issue With Harika | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: మ‌ళ్లీ ఇంటికి పోతా అంటున్న గంగ‌వ్వ‌

Published Thu, Oct 8 2020 11:06 PM | Last Updated on Fri, Oct 9 2020 3:44 AM

Bigg Boss 4 Telugu: Abhijeet Solve Issue With Harika - Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో ముప్పై రెండ‌వ రోజు కెప్టెన్సీ టాస్క్ కాస్త‌ ఆస‌క్తిక‌రంగా సాగింది. కానీ కెప్టెన్ సోహైల్ అనే విష‌యం ఎపిసోడ్ ప్రారంభానికి ముందే లీక‌వ‌డం గ‌మ‌నార్హం. ఇక చాప కింద నీరులా అవినాష్‌, అరియానాల మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం సాగుతున్న‌ట్లు కనిపిస్తోంది. కెప్టెన్సీ టాస్కులో అవినాష్‌కు ఆమె తెగ సపోర్ట్ చేసింది. నిన్న అభి స్టార్లు లాక్కున్నాడ‌ని అలిగిన హారిక‌కు అత‌డు హ‌గ్ ఇవ్వ‌డంతో ఆమె ముఖం మ‌తాబులా వెలిగిపోయింది. కానీ నామినేష‌న్ ప్ర‌క్రియ నుంచి వేర‌యిన అఖిల్‌, మోనాల్ మాత్రం ఇప్ప‌టికీ క‌లివిడిగా ఉండ‌లేక‌పోతున్నారు. నిన్న మోనాల్ వెన‌క నుంచి వ‌చ్చి హ‌గ్గిచ్చినా కూడా అఖిల్‌కు కోపం త‌గ్గ‌లేదు. ఈ రోజు కూడా ఆమె మాట్లాడ‌మ‌ని ఎంత‌గా బ‌తిమిలాడిన‌ప్ప‌టికీ మౌన‌మే స‌మాధాన‌మైంది. ఇక నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో చ‌దివేయండి..

ఘోరంగా విఫ‌ల‌మైన అభిజిత్ ప్లాను
అభిజిత్ త‌న చేతిలోని స్టార్లు లాగేసుకున్నాడ‌ని హారిక ప‌దేప‌దే త‌ల్చుకుంటూ ఏడ్చింది. త‌ర్వాత బీబీ హోట‌ల్ టాస్క్ ముగిసింద‌ని బిగ్‌బాస్ ప్ర‌క‌టించాడు. హోట‌ల్ సిబ్బంది ద‌గ్గ‌ర ఐదు స్టార్లు ఉన్న‌ప్ప‌టికీ అవి అతిథులు ఇష్ట‌పూర్వ‌కంగా ఇచ్చిన‌వి కానందున అతిథులే గెలిచిన‌ట్లు వెల్ల‌డించారు. దీంతో అభిజిత్ ప్లాన్ అంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరయ్యింది. దీనికోసం హారిక‌తో గొడ‌వ కూడా పెట్టుకున్నానే అని బుంగ‌మూతి పెట్టుకున్న‌ హారిక ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆమెను హ‌త్తుకుని ఓదార్చాడు. ఒక్క హ‌గ్గుతో ఆమె అల‌క‌, కోపం అన్నీ ప‌టాపంచ‌ల‌య్యాయి. (చ‌ద‌వండి: సుజాత‌ది ఫేక్ న‌వ్వు, మోనాల్ ఆడుకుంటోంది)

ఒంట‌రిగా గేమ్ ఆడిన అఖిల్‌, సుజాత గోరుముద్ద‌లు
గెలిచిన టీమ్ నుంచి బెస్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్ పేరును ఏకాభిప్రాయంతో చెప్ప‌మ‌న్నాడు. అప్పుడు మొద‌లైంది అస‌లు ముస‌లం.. ఎవ‌రికి వారే తానే బెస్ట్ అని చెప్పుకున్నారు. అందరూ క‌లిసి ఒక్క పేరు చెప్ప‌డానికి ముందుకు రాలేదు. దీంతో ఫ్రెండ్‌షిప్‌కు విలువిస్తే నాకు స‌పోర్ట్ చెయ్ అని మెహ‌బూబ్‌కు ఒక్క ముక్కలో తేల్చి చెప్పాడు సోహైల్‌. అలా సోహైల్ పేరును బెస్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్‌గా ఎంపిక చేశారు. అంద‌రిక‌న్నా ఎక్కువ డ‌బ్బు ఉన్న అఖిల్‌, సీక్రెట్ టాస్క్‌లో గెలిచిన అవినాష్ కూడా కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ చేసేందుకు అర్హ‌త సాధించారు. హోట‌ల్ సిబ్బందిలో వ‌రస్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్‌గా ప్ర‌క‌టించుకున్న అమ్మ రాజ‌శేఖ‌ర్‌ను ఉల్లిపాయ‌లు త‌రిగి స్టోర్ రూమ్‌లో పెట్ట‌మ‌న్నాడు. రాత్రి అఖిల్‌కు సుజాత గోరుముద్ద‌లు తినిపించింది. ఇవాళ నేను ఒక్క‌డినే ఆడినందుకు మ‌జా అనిపించింది అన్నాడు. (చ‌ద‌వండి: బిగ్‌ బాస్‌ : దివి ‘పప్పు’ రీజన్‌పై నెటిజన్ల ట్రోలింగ్‌)

మంచు నిప్పు టాస్క్‌ను జ‌యించిన సోహైల్‌
ముప్పై రెండ‌వ రోజు బిగ్‌బాస్ ఇంటి స‌భ్యుల‌కు "మంచు నిప్పు- మ‌ధ్య‌లో ఓర్పు" అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్కుకు అభిజిత్ సంచాల‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. అఖిల్‌కు అభి ఆల్ ద బెస్ట్ చెప్ప‌డం విశేషం. త‌ర్వాత టాస్కు మొద‌ల‌వ‌గా కింద మంట‌ల వేడి, చేతిలోని ఐస్ గ‌డ్డ చ‌ల్ల‌ద‌నాన్ని త‌ట్టుకునేందుకు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించారు. అఖిల్‌కు కాళ్లు వ‌ణ‌కడం ప్రారంభ‌మ‌య్యాయి. త‌ర్వాత నొప్పులు భ‌రించ‌లేక ఒక్కొక్క‌రు అరవ‌డం ప్రారంభించాడు. అఖిల్ ప‌డిపోవ‌డంతో మిగ‌తా ఇంటి స‌భ్యులు వెళ్లి అత‌డి చేతులు రుద్దారు. త‌ర్వాత అవినాష్‌, ఆ వెంట‌నే సోహైల్ బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. దీంతో సోహైల్ ఇంటి కెప్టెన్‌గా ఎన్నిక‌య్యాడు. (చ‌ద‌వండి: ఈ వారం నామినేష‌న్‌లో ఉన్న‌ది వీళ్లే)

ఇంటికి పోతా: గ‌ంగ‌వ్వ‌
త‌ర్వాత నేల‌పై ప‌డుకున్న అఖిల్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి మోనాల్ ముద్దుముద్దుగా కోప‌మొస్తే ఏదైనా చెయ్ కానీ నువ్వు నాతో ఎందుకు మాట్లాడ‌ట్లేదురా అని అడిగింది. నేనేం చేశానో చెప్పు అని నిల‌దీసింది. అయినా అత‌డు మౌనం వీడ‌క‌పోవ‌డంతో చేసేదేం లేక రుస‌రుసా వెళ్లిపోయింది. కానీ అఖిల్ ఓ మూల‌న కూర్చుని బాధ‌ను కక్కేస్తూ‌ ఏడ్చేశాడు. అఖిల్ బాధ‌ను ప‌సి గ‌ట్టిన గంగ‌వ్వ ఏమైందంటూ వెళ్లి అరుచుకుంది. త‌ర్వాత అవినాష్ పులిహోర క‌బుర్లు మొద‌లుపెట్టేశాడు. దివి హైట్ త‌క్కువ ఉంటుందేమో, నాకేమైనా క‌లిసొస్తుంద‌నుకున్నా అని నిరుత్సాహ‌ప‌డ్డాడు. మ‌గ‌వాడిలా న‌డుస్తుంద‌ని ఓసారి న‌డిచి చూపించాడు. నువ్వు దివిని చూస్తున్నావ‌ని మొద‌టిరోజే ప‌సిగ‌ట్టాన‌ని అరియానా అన‌డంతో లేదు, నిన్ను చూశానంటూ డైలాగ్ కొట్టాడు. మ‌ళ్లీ ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ గురించి దివి, అవినాష్ గుసగుస‌లు పెట్టుకున్నారు. గంగ‌వ్వ‌కు మ‌ళ్లీ ఇంటి మీద మన‌సు ప‌డింది. అన్నం పోత‌లేదు, ఇంటికి పోతా అని అఖిల్‌తో త‌న బాధ చెప్పుకొచ్చింది. (చ‌ద‌వండి: బిగ్‌ బాస్‌లో ఇక నాగార్జున కనిపించడా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement